For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam Episode 1132: నిన్ను చంపను.. కానీ నీ ఫ్యామిలీని చంపేస్తా.. కార్తీక్‌కు మోనిత వార్నింగ్

  |

  కార్తీకదీపం సీరియల్‌లో కార్తీక్‌ను తనవాడిని చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న డాక్టర్ మోనిత కుట్రలు మరోసారి బట్టబయలు అయ్యాయి. లాకప్‌లో ఉన్న కార్తీక్‌కు కడుపు నొప్పి వచ్చేలా చేసి.. కానిస్టేబుల్ సహాయంతో కార్తీక్‌ను హాస్పిటల్‌కు మోనిత రప్పించింది. ఆ తర్వాత కార్తీక్‌ను బెడ్‌కు కట్టివేసింది. అయితే కట్టి ఉన్న తన చేతులను కార్తీక్ విదిలించుకోవాలని ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. నన్ను చంపేయాలని అనిపిస్తుందా? చేతులు కట్టేశాను. అరిచి అందర్ని పిలువాలని ఉందా? మాట్లాడకుండా చేశాను అని మోనిత తనదైన శైలిలో డైలాగ్స్ కొట్టింది. ఇంకా కార్తీక్, మోనిత మధ్య తాజా ఎపిసోడ్‌ 1132లో ఏం జరిగిందంటే...

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   కార్తీక్‌ నీవు.. ఎలా అయిపోయావు..

  కార్తీక్‌ నీవు.. ఎలా అయిపోయావు..

  బెడ్‌పై కార్తీక్‌ పక్కన కూర్చొని తలను నిమురుతూ.. కార్తీక్.. నా కార్తీక్.. ఎలా ఉండేవాడివి. ఎలా అయిపోయావు. నీ మీద ఉండే ప్రేమ నిన్ను ఇలాంటి స్థితికి తెచ్చింది. నీ మీద ఎనలేన ప్రేమ ఎందుకు కలగాలి? నీతోనే బిడ్డను కనాలి? పాపాత్మురాలు మోనిత, కానీ పాపం వెనుక ఉన్నందంతా ఏమిటి? నువ్వంటే పిచ్చి ప్రేమ. నీ పేరే జపిస్తూ.. నిన్నే స్మరిస్తూ.. పదహారేళ్లు పెంచుకొన్న ప్రేమను తుంచుకొలేక. చివరికి చచ్చిపోయినట్టు ప్రపంచాన్ని నమ్మించాల్సి వచ్చింది. దాని వల్ల నీవు జైలు పాలు అవుతావని తెలిసినా తప్పలేదు. అజాతంలో ఉంటే నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. అందుకే ఇక్కడికి వచ్చేలా చేశాను. నిన్ను మాత్రమే కాపాడటానికి అని చెప్పడానికే ఇక్కడికి నిన్ను తెప్పించాను అని మోనిత తన కుట్రలను బయటపెట్టింది.

   నీవు నా మెడలో తాళి కట్టాలి

  నీవు నా మెడలో తాళి కట్టాలి

  పోలీసులకు నేను లొంగిపోతాను. నీవు బయటకు వస్తాను. కానీ ఒక్క షరతు.. నీతో దీప ఉంటుంది. నీ పిల్లలు ఉంటారు. నేను ఉంటాను. మనమంతా కలిసి వసుదైక కుటంబంలా ఉంటాను. కానీ ఒక్క షరతు.. నీవు నా మెడలో తాళి కట్టాలి. షాక్ అయ్యావా? నీకు ఇంతకు మించి వేరే దారి లేదు. నీవు లేని జీవితం నాకు వద్దు. పదహారేళ్ల నుంచి నిన్ను దాచుకొంటే.. నీవు దీపను పెళ్లి చేసుకొని కాపురం చేసుకొంటుంటే.. నా బతుకు ఎంత నరకమో ఆలోచించు కార్తీక్.. ఆ నరకాన్ని భరించడం నా వల్ల కాదు అని మోనిత స్పష్టం చేసింది.

  నన్ను పెళ్లి చేసుకొంటే.. అన్నీ సాల్వ్

  నన్ను పెళ్లి చేసుకొంటే.. అన్నీ సాల్వ్

  నీకు నాకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే.. నన్ను పెళ్లి చేసుకొన్నావంటే ప్రాబ్ల్సెం అన్నీ సాల్వ్. నేను ఏమంటున్నాను. ప్రేమించమంటున్నాను. నాలాంటి అందగత్తె బోనస్‌గా దక్కుతుంది. తెలివిగా ఆలోచించుకో.. దాగుడుమూతలన్నీ ఆపేస్తాను. పోలీసులకు లొంగిపోతే రెండు మూడేళ్లు జైలుశిక్ష పడుతుంది. ఆ తర్వాత కలిసి బతుకుదాం. నా కడుపులోని బిడ్డ నిన్న నాన్న, నన్ను అమ్మా అనాలి. అదే నా జీవితానికి చాలు అంటూ మోనిత తనదైన శైలిలో చెప్పుకొంటూ పోయింది. నా అంత గొప్ప ప్రేమికురాలు కనిపించదేమో అని మోనిత ఉన్మాదిలా కనిపించింది.

   ఒక బుల్లెట్ నా వద్దనే ఉందంటూ..

  ఒక బుల్లెట్ నా వద్దనే ఉందంటూ..

  ఒకవేళ నా ప్రపోజల్ నచ్చకపోతే.. అంటూ పిస్టల్ తీసి బెదిరించేలా చేసింది. నిన్ను చంపను. నీవు చచ్చిపోతే నా బతుకెందుకు? నేను కాల్చుకొని చచ్చిపోతాను. మీ అమ్మ రివాల్వర్ నుంచి దొంగిలించిన రెండు బుల్లెట్లలో ఒకటి పోలీసుల వద్ద.. రెండో బుల్లెట్ నా వద్ద ఉంది. నా చావు ఫ్రెష్‌గా జరిగినట్టు ఉండదు. అప్పుడు నీవు షూట్ చేసి నా బాడీని దాచేసినట్టే ఉంటుంది. ఇది పోస్టు మార్టమ్ రిపోర్టు. ఇందులో డేట్ రాయించకుండా ఖాళీగా ఉంచాను. నేను ఆనాడే చచ్చిపోయనట్టు అఫీషియల్‌గా ఉంటుంది తన ప్లాన్‌ను కార్తీక్‌కు మోనిత వివరించింది.

   అపరిచితులు నీ ఫ్యామిలీని చంపేస్తారు

  అపరిచితులు నీ ఫ్యామిలీని చంపేస్తారు

  నన్ను చంపిన నేరం సాక్ష్యాలతో సహా రుజువు అవుతుంది. శాశ్వతంగా నీవు జైల్లోనే ఉంటావు. నా ప్రాణం జైల్లో ఉంటే నా ఆత్మ శాంతించదు. కాబట్టి అందరం హ్యాపీగా ఉండాలి. అందులో నేను ఉండాలి అంటూ మోనిత బ్లాక్‌మెయిల్ చేసింది. ఒకవేళ నన్ను పోలీసులకు పట్టించాలని చూశావో.. మీ ఇంట్లో ఉన్న నీ తల్లిదండ్రులను, పిల్లలను ఒక అపరిచితుడు.. హాస్పిటల్ బయట ఉన్న నీ భార్యను మరో అపరిచితుడు కాల్చి చంపేస్తాడు. నీ ఇంట్లో వాళ్లను ఒక్కో విధంగా చంపేస్తాను. ఇక ఏం చేయాలో నువ్వే తేల్చుకో అంటూ కార్తీక్ కట్లు విప్పి బయటకు వెళ్లిపోయింది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  ఆందోళనలతో కార్తీక్..

  ఆందోళనలతో కార్తీక్..

  హస్పిటల్ గది బయట ఎదురపడ్డ దీపను తప్పించుకోవాలని చూసుంది మోనిత.. అయితే డాక్టర్ ఎలా ఉంది అని అడిగితే.. ఆయనకు ఏమీ కాలేదు అంతా బాగానే ఉంది అని మోనిత చెప్పి వెళ్లిపోయింది. కార్తీక్‌ టెన్షన్‌లో ఉంటే ఏమైంది.. అలా ఉన్నారంటూ ప్రశ్నించింది. గదిలోకి వచ్చిన దీపను చూసి జరిగిందంతా చెప్పాలని చూశాడు. కానీ దీప హెచ్చరించిన నేపథ్యంలో తన కుటుంబానికి ఏమైపోతుందనే భయంతో చెప్పడం ఆపేశారు. ఏదో చెప్పబోయారు అంటూ దీప అంటే.. అవును.. నాకేమైనా అయితే నీవు ఏమైపోతావనే భయం కలిగింది అని చెప్పారు. తర్వాత భార్యను కౌగిలించుకొని ఆందోళనకు గురయ్యాడు. మీకు ఏం కాదు.. మీరు ప్రశాంతంగా ఉండండి.. నేను ఇక్కడే ఉంటాను అని దీప అంటే..

  English summary
  Karthika Deepam August 31th August's Episode preview. Latest episode of 1132 goes once again with emotional content. Monita started another cospiracy against Deepa.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X