Karthika Deepam weekly roundup కార్తీకదీపం సీరియల్‌లో భారీ ట్విస్టులు.. కార్తీక్, దీప రీఎంట్రీతో..!
చిక్ మంగళూరులో జరిగిన యాక్సిడెంట్‌కు హిమ కారణమనే విషయంతో ఇంటి నుంచి పారిపోయిన శౌర్యను డ్రైవర్ వారణాసి కలిశాడు. అయితే హిమ ఉన్న ఇంటిలో ఉండలేను. కాబట్టి తాను బతికేందుకు ఆటో డ్రైవింగ్ నేర్పించమని శౌర్య అడిగింది. ఇంకా నిరుపమ్, హిమ పెళ్లి డ్రామా, దీప, కార్తీక్ రీ ఎంట్రీ అంశాలు సీరియల్‌లో ఆసక్తికరమైన పరిణామాలుగా మారాయి. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 20 వరకు జరిగిన ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

కార్తీకదీపం ఆగస్టు 15వ తేదీ ఎపిసోడ్
చిక్ మంగళూరులో యాక్సిడెంట్ జరిగిన సమయంలో శౌర్యను చూసుకొనే బాధ్యత నీదే అంటూ కార్తీక్, దీప చెప్పిన విషయాన్ని హిమ బయటపెట్టింది. అయితే ఇక నాటకాలు ఆపు.. నీ మాటలు నమ్మను అంటూ శౌర్య మండిపడింది. సీరియల్‌ను మలుపు తిప్పే 1431 ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే...్టు 16వ తేదీ ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ మలుపు తిప్పే ఎపిసోడ్ ఇది.
ఆటో డ్రైవర్ రంగ ప్రవేశం చేసి.. కార్తీక్, దీప బతికే ఉన్నారంటూ చెప్పడం భారీ ట్విస్టుగా మారింది. యాక్సిడెంట్ గురైన దీప.. చిక్ మంగళూరులోని హాస్పిటల్ చికిత్స పొందుతూ సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

కార్తీకదీపం ఆగస్టు 17వ తేదీ ఎపిసోడ్
చిక్ మంగళూరులో యాక్సిడెంట్‌లో కార్తీక్, దీప తమకు దూరం కావడంతో మనస్తాపం చెందిన సౌందర్య ఫ్యామిలీ ఆస్తులు అమ్మేసి.. అమెరికాకు బయలు దేరాలని ప్లాన్ చేయడం ఈ ఎపిసోడ్‌లో ప్రధానం అంశంగా మారింది.

కార్తీకదీపం ఆగస్టు 18వ తేదీ ఎపిసోడ్
యాక్సిడెంట్ తర్వాత కోలుకొన్న దీప హాస్పిటల్‌లో డాక్టర్ ఫ్యామిలీ ఆదరించడం.. అక్కడి నుంచి వంటలక్క హైదరాబాద్‌కు బయలుదేరడం.. అదే బస్సులో శౌర్య ఉండటం ఓ డ్రామాగా సాగింది. దీప,శౌర్య ప్రయాణంలో వారిద్దరూ కలుసుకొన్నారా అనేది ప్రధాన అంశంగా మారింది.

కార్తీకదీపం ఆగస్టు 19వ తేదీ ఎపిసోడ్
చిక్ మంగళూరులో యాక్సిడెంట్ తర్వాత పిల్లలను వెతుక్కొంటూ దీప.. అలాగే ఇంటి నుంచి పారిపోయిన వచ్చిన శౌర్య ఇద్దరూ హైదరాబాద్‌కు బయలుదేరారు. ఒకే బస్సులో వారిద్దరూ ప్రయాణించడం ఓ ట్విస్టు. అలాగే దీప, కార్తీక్ మరణించారనే వార్త తర్వాత ఇంటిని అమ్మేసి సౌందర్య కుటుంబం అమెరికాకు వెళ్లడం మరో ట్విస్టుగా మారింది. దీప, శౌర్య కలుసుకొన్నారా? అనే వివరాలకు సంబంధించి

కార్తీకదీపం ఆగస్టు 20వ తేదీ ఎపిసోడ్
ఆగస్టు 20వ తేదీ ఎపిసోడ్‌లో యాక్సిడెంట్‌లో గాయపడి హాస్పిటల్ చేరిన కార్తీక్‌ను తన భార్య తీసుకెళ్లిందని దీపకు నర్సు చెప్పడం ఓ ట్విస్టుగా మారింది. అలాగే కార్తీక్‌ను చూసిన దీపకు మరో షాక్ తగిలింది. తనను కలిసి డాక్టర్ బాబు అని దగ్గరకు వెళ్లితే.. ఎవరు నీవు.. అసలు దీప ఎవరు అని కార్తీక్ అనడం మరో భారీ ట్విస్టుగా మారింది.


Click it and Unblock the Notifications











