Karthika Deepam weekly roundup గతం మరిచిన కార్తీక్.. డాక్టర్ బాబు కోసం మళ్లీ దీప, మోనిత ఫైట్

కార్తీకదీపం సీరియల్‌ మరోసారి భారీ ట్విస్టులతో కొనసాగుతున్నది. కార్తీక్ గతం మరిచిపోవడం, దీప తన డాక్టర్ బాబు కోసం వెతకడం.. మోనిత సంరక్షణలో కార్తీక్ ఉండే అంశాలు మరింత టిస్టులుగా మారాయి. దీప, కార్తీక్, మోనిత రీ ఎంట్రీ అంశాలు సీరియల్‌లో ఆసక్తికరమైన పరిణామాలుగా మారాయి. ఆగస్టు 22 నుంచి ఆగస్టు 27 వరకు జరిగిన ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

ఆగస్టు 22 తేదీ ఎపిసోడ్‌లో

ఆగస్టు 22 తేదీ ఎపిసోడ్‌లో

యాక్సిడెంట్ తర్వాత కార్తీక్ తనను గుర్తుకు పట్టకపోవడంతో దీప కంగారు పడింది. అంతేకాకుండా డాక్టర్ బాబును తమ భార్య తీసుకెళ్లిందనే విషయం విని మోనితపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో చిక్‌మంగళూరులోని డాక్టర్ కుటుంబం తనకు నైతిక మద్దతు ఇచ్చింది. కార్తీక్ కనిపించాడు కాబట్టి.. మీ భర్త మీకు లభిస్తాడు అని చెప్పడంతో దీప కాస్త ఊరట చెందింది. ఇక ఆ రోజు 22వ తేదీ కావడంతో తన పెళ్లి రోజు అని గుర్తు చేసుకొని దీప ఎమోషనల్ అయింది.

ఆగస్టు 23 తేదీ ఎపిసోడ్‌లో

ఆగస్టు 23 తేదీ ఎపిసోడ్‌లో

తన వివాహ వార్షికోత్సవం గురించి చిక్ మంగళూరు డాక్టర్ కుటుంబానికి చెప్పింది. దాంతో వారంతా కలిసి మ్యారేజ్ యానివర్సరీని గ్రాండ్‌గా జరిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్తీక్‌ను వెతుకుతూ రోడ్లపై కనిపించింది. ఈ క్రమంలో మోనిత కూడా కార్తీక్ ఫోటో పట్టుకొని దీపకు ఎదురు పడింది. దీపను మోనిత చూసి.. ఇంకా నీవు బతికే ఉన్నావా? అని మోనిత అంటే.. ఆపవే నీ నాటకాలు.. నా భర్తను తీసుకెళ్లింది నీవే కదా అని దీప అంటే.. హాస్పిటల్ నుంచి నేను తీసుకెళ్లడమేమింటి? కార్తీక్ నా వద్ద ఉంటే.. పిచ్చిదానిలా కార్తీక్ ఫోటోను పట్టుకొని తిరుగుతాను. కార్తీక్ కోసం పిచ్చిదాన్ని అయిపోతున్నాను. కార్తీక్‌ను ఎవరు తీసుకెళ్లారు? అని మోనిత చెప్పడంతో దీపకు తల తిరిగినంత పనైంది.

ఆగస్టు 24 తేదీ ఎపిసోడ్‌లో

ఆగస్టు 24 తేదీ ఎపిసోడ్‌లో

కార్తీక్‌ కోసం వెతుకుతూ మోనిత చెప్పిన విషయాలు విన్న దీప.. ఆపవే నీ నాటకాలు. నేను హాస్పిటల్‌కు వెళితే.. ఆయన భార్య తీసుకెళ్లారని చెప్పారు. నీవు తప్ప ఎవరు తీసుకెళ్తారని నేను అనుకొన్నాను. నీ మీదే అనుమానం వచ్చింది. నిన్ను చూస్తేనే డాక్టర్ బాబు అసహ్యించుకొంటారని తెలిసి సర్దిచెప్పుకొన్నాను. నీవు ఇక్కడ కనిపించావు కాబట్టి..నా అనుమానం కరెక్ట్ అయింది. డాక్టర్ బాబును ఎక్కడ పెట్టావో చెప్పు అంటూ దీప నిలదీసింది. అయితే గతం మరిచిపోయిన కార్తీక్‌ను అతడి కారు డ్రైవర్.. మేడమ్ అంటూ బ్లాక్ మెయిల్ చేయడం ఆసక్తికరంగా మారింది.

ఆగస్టు 25 తేదీ ఎపిసోడ్

ఆగస్టు 25 తేదీ ఎపిసోడ్

మోనితపై అనుమానాలు పెరిగిపోవడంతో దీప ఆమెను వెతుక్కొంటూ పోయింది. ఆ తర్వాత మోనిత ఇంట్లోకి ప్రవేశించగానే.. కార్తీక్ ఫోటో పెట్టుకొని ఆమె బాధపడటం చూసి దీప షాక్ గురైంది. అయితే మోనిత బాధ నిజమా? నాటకామా అనేది తెలుసుకోవాలని దీప అనుకొన్నది. మోనిత గురించి డాక్టర్ కుటుంబానికి చెప్పింది. దాంతో పరాయి ఆడది, మగాడిని కోరుకొన్న ఎవరైనా సుఖపడిన సందర్భాలు లేవు అని డాక్టర్ తల్లి చెప్పింది.

ఆగస్టు 26 తేదీ ఎపిసోడ్‌లో

ఆగస్టు 26 తేదీ ఎపిసోడ్‌లో

మోనిత ఓవరాక్షన్ చేసిన ప్రతీసారి డాక్టర్ బాబు దూరమయ్యాడు అని డాక్టర్ తల్లితో దీప అంది. అయితే మోనిత గురించి అంతా తెలుసు కాబట్టి.. ఒకవేళ గుర్తుపడితే.. మోనితను చీత్కరించుకొంటాడు. కాబట్టి.. నీ భర్త గురించి ముందు దృష్టిపెట్టు అని సలహా ఇచ్చింది. అయితే కార్తీక్ ఎవరో తెలియదని చెప్పిన అతడి డ్రైవర్‌ను దీప పట్టుకొని అసలు విషయాన్ని లాగింది. కార్తీక్‌ను తీసుకెళ్లింది ఎవరో దీపకు చెప్పాడు. ఇక కార్తీక్‌ను మోనిత తీసుకెళ్లిందనే విషయం ఈ ఎపిసోడ్‌లో స్పష్టమైంది.

ఆగస్టు 27 తేదీ ఎపిసోడ్‌లో

ఆగస్టు 27 తేదీ ఎపిసోడ్‌లో

కార్తీక్ గురించి వెతికే ప్రయత్నాన్ని దీప కొనసాగించింది. కార్తీక్ ఎదురుపడినట్టే ఎదురుపడి కనిపించకుండా పోయారు. అయితే మోనిత సంరక్షణలో ఉంటున్న కార్తీక్ ఆమెకు షాకిచ్చాడు. యాక్సిడెంట్‌కు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రావడంతో దీప.. దీప అంటూ పిలవడంతో మోనిత కంగారుపడింది. దీప అంటూ తనను సంబోధించడంతో కాస్త ఊరట చెందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X