అమ్మో ఈ పిల్ల మామూల్ది కాదు.. డ్యాన్స్‌తో అదరగొట్టిన ‘కార్తీకదీపం’ శౌర్య

కార్తీక దీపం సీరియల్ గురించి, దానికున్న క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసింది. కార్తీక దీపం సీరియల్ చూడని తెలుగిళ్లు ఉంటుందా? అనే అనుమానం కూడా రాకమానదు. అంతటి ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది ఈ సీరియల్. ఈ ఒక్క ధారావాహికతోనే స్టార్ మా ఛానెల్ నిలబడిందంటే అతిశయోక్తి కాదు. ఇంత వరకు ఎన్ని సినిమాలు, ఎన్ని షోలు, ఎంత పెద్ద ఈవెంట్ జరిగినా సరే టీఆర్పీలో మాత్రం కార్తీక దీపం ముందుంటుంది.

వారు ఫేమస్..

వారు ఫేమస్..

కార్తీకదీపంలో వంటలక్క, దీపగా ప్రేమీ విశ్వనాథ్, డాక్టర్ బాబు‌, కార్తీక్‌గా నిరుపమ్ ఎక్కడా లేని స్టార్డంను సొంతం చేసుకున్నారు. ఇక ఇందులో ఓ బుల్లి చిచ్చర పిడుగు కూడా బాగానే ఫేమస్ అయింది. అదే శౌర్య, రౌడీ అలియాస్ బేబీ కృతిక. ఇక ఈ పాప తెరపై ఎంతలా చెడుగుడు ఆడుతుందో.. సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటుంది.

చిన్న వయసు పెద్ద మనసు..

చిన్న వయసు పెద్ద మనసు..

ఆ మధ్య కృతిక చేసిన ఓ పని అందర్నీ ఆకట్టుకుంది. మామూలుగా సెలెబ్రిటీలను తమ ఫ్యాన్స్ కొన్ని కోరికలు కోరుతుంటారు. మా బర్త్ డే అండి విష్ చేయండి అని అలా రిక్వెస్ట్‌లు పెడుతుంటారు. అలాగే ఓ అభిమాని తన భార్య బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పమని అడిగాడు. అందుకు కృతిక ఓ కండీషన్ పెట్టింది. ఎవరికైనా సాయం చేయండి అప్పుడు విష్ చేస్తానని తెలిపింది. దానికి సదరు నెటిజన్ సాయం చేసిన ఫోటోలను కృతికకు షేర్ చేయగా.. బర్త్ డే విషెస్ చెబుతూ ఓ వీడియోను కానుకగా పంపింది.

కృతిక బర్త్ డే అలా..

కృతిక బర్త్ డే అలా..

ఇక కృతిక బర్త్ డే (ఆగస్ట్ 6) సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా విషెస్ వెల్లువెత్తాయి. అంతేకాకుండా కొందరు అభిమానులు కూడా బహుమతులను పంపారు. బేబీ కృతిక డిఫరెంట్‌గా ఆలోచించి వెరైటీగా కేక్ కట్ చేసేందుకు ప్రయత్నించింది. ఇక షూటింగ్ లొకేషన్‌లోనూ తన బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకుంది.

Recommended Video

Rajinikanth,Pawan Kalyan,K viswanath Expresses Their Condolences For SPB
తాజాగా డ్యాన్స్...

తాజాగా డ్యాన్స్...

తాజాగా కృతిక వెరైటీగా డ్యాన్స్ చేసింది. జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ అనే పాట మ్యూజిక్‌కు అనుగుణంగా మంచి స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ మూమెంట్స్, డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు కృతిక ప్రతిభను చూసి ముచ్చటపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X