twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam మోనిత బిడ్డను ఎత్తుకెళ్లిన అజ్ఞాతవ్యక్తి.. కార్తీక్ ఇంట్లో డాక్టరమ్మ రచ్చ!

    |

    గత మూడేళ్లుగా అనేక ట్విస్టులతో ప్రేక్షకులను ఆలరిస్తున్న కార్తీకదీపం సీరియల్‌లో మరో భారీ ట్విస్టు చోటుచేసుకొన్నది. డాక్టర్ మోనిత కొడుకు ఆనందరావును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లడం ఆసక్తికరమైన మలుపు కథలోకి రావడం ప్రేక్షకులను మరింత ఆసక్తిని కలిగించే అంశంగా మారింది. అలాగే దీప మళ్లీ వంటలక్కగా మారడం లాంటి విషయాలు సీరియల్‌లో కనిపించాయి. తాజా ఎపిసోడ్ 1222లో ఇంకా ఏం జరిగిందంటే..

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

     నేను డాక్టర్ కాదు.. ఎవరికి చెప్పొద్దంటూ కార్తీక్

    నేను డాక్టర్ కాదు.. ఎవరికి చెప్పొద్దంటూ కార్తీక్

    తన కూతుర్లను దగ్గరికి తీసుకొని ఓ విషయం చెప్పాలని అనుకొంటాను. ఇక నుంచి నేను డాక్టర్ అని ఎవరికి చెప్పవద్దు అని కార్తీక్ అన్నాడు. దాంతో హిమ, శౌర్య ఇద్దరు కంగారు పడ్డారు. ఏంటి నాన్న నీవు డాక్టర్ కాదని ఎలా చెప్పగలం. మా స్కూల్‌లో మానాన్న పెద్ద డాక్టర్ అని గొప్పగా చెప్పుకొనే వాళ్లం. ఇప్పుడు డాక్టర్ అని చెప్పవద్దంటే ఎలా అంటూ ఇద్దరు కంటతడి పెట్టారు. ఇప్పుడు నేను డాక్టర్ కాదు.. ఉత్త కార్తీక్‌ను అని అన్నాడు. దాంతో ఎందుకు నాన్న అబద్దాల చెప్పడం.. మీరు గొప్ప డాక్టర్ కదా అంటూ ఇద్దరు విలపించారు. దాంతో నేను డాక్టర్ కాదని చెప్పడం ఎవరికి హానీ చేయదు. ఎవరికీ నష్టం కలుగదు. నా మాట వినండి అంటూ ఇద్దరు కూతుళ్లతో హామీ తీసుకొన్నాడు. అయితే మీ నాన్న ఏం చేస్తాడని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అని అడిగితే.. ఎరువుల కొట్టులో అకౌంట్స్ రాస్తారని చెప్పు అని కార్తీక్ అనగానే.. ఇద్దరు కంగారు పడిపోయారు.

    స్కూల్‌లో వంటలక్కగా చేరిన దీప

    స్కూల్‌లో వంటలక్కగా చేరిన దీప

    అయితే తన ఇల్లు వదిలి చేతిలో చిల్లుగవ్వ లేకుండా కార్తీక్‌, ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చిన దీప.. ఇళ్లు గడవడానికి ఉద్యోగం వేటలో పడింది. ఓ స్కూల్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం వంట చేయడానికి దీప ఒప్పుకొన్నది. తనకు జీతం పెద్దగా ఇవ్వనక్కర్లేదు. నేను చాలా మందికి వంట చేయడం వచ్చు. మీరు ఏమీ కంగారు పడకండి. నేను అంతా బాగానే చూసుకొంటాను అని దీప చెప్పడంతో.. స్కూల్‌ టీచర్ మిమ్నల్ని చూస్తే.. నాకు నమ్మకంగానే ఉంది. మీరు తేడా రాకుండా పనిచేసుకొండి. నాకు మాట రాకుండా చూడండి అంటూ దీపతో టీచర్ చెప్పి ఉద్యోగం ఇచ్చింది.

    డాక్టర్ బాబు ఆవేదనతో

    డాక్టర్ బాబు ఆవేదనతో

    దీపను ఎక్కడికి వెళ్లావు అని కార్తీక్‌ అడిగితే.. మంచిని వెతుక్కొంటూ వెళ్లాను. అంతా మంచే జరిగింది. స్కూల్‌లో వంట చేసే ఉద్యోగం లభించింది. అలాగే పిల్లలను కూడా స్కూల్‌లో చేర్చుకొంటారని చెప్పారని దీప అంటే.. వంటలక్కగా మారుతున్నావా అంటే.. నాకు తెలిసిందే అదే కదా అని దీప సమాధానం ఇచ్చింది. అయితే మన ముగ్గురం రేపటి నుంచి స్కూల్‌కు వెళ్తున్నామా? నాన్న ఒక్కరే ఇంటిలో ఉంటాడా అని పిల్లలు అనగానే.. డాక్టర్ బాబు అదో ఫీలింగ్‌తో కనిపించారు.

     కార్తీక్ ఫ్యామిలీపై లోకల్ విలన్ నజర్

    కార్తీక్ ఫ్యామిలీపై లోకల్ విలన్ నజర్


    ప్రస్తుతం ఉంటున్న శ్రీవల్లి ఇంటిలోని వస్తువులను భద్రపరిచేందుకు కార్తీక్ చేసిన ప్రయత్నాన్ని అడ్డుకొన్న ఆ ప్రాంతపు గుండాలను చితకబాదడం జరిగింది. అయితే తన మనుషులను కొట్టడంపై ఆ ప్రాంతం మహిళా డాన్ సీరియస్ అయింది. మీ ముగ్గురిని ఒక్కడు కొట్టాడా? అంటూ ఆశ్చర్యపోయింది. మీరు మీ పనులు చూసుకోండి.. నేను నా పనులు చూసుకొంటాను అంటూ చెప్పింది. ఇక వంటలక్కగా మళ్లీ ఉద్యోగం సంపాదించానని కార్తీక్, హిమ, శౌర్యతో దీప చెప్పి తన ఆనందాన్ని పంచుకొన్నారు.

    మోనిత బాబును ఎత్తుకెళ్లిన అగంతకుడు

    మోనిత బాబును ఎత్తుకెళ్లిన అగంతకుడు


    ఇక తన కుమారుడు ఆనందరావును తీసుకొని డాక్టర్ మోనిత షాపింగ్‌కు వెళ్లింది. అయితే చివరి నిమిషంలో ప్రియమణి తను రానని చెప్పడాన్ని గుర్తు చేసుకొని విసుక్కొన్నది. ప్రియమణికి ఎక్కువైపోతున్నది. చెప్పిన మాట వినడం లేదు అంటూ తనలో తాను గొణుక్కొన్నది. అయితే బాబు నిద్ర పోవడంతో కారులోనే పెట్టి.. పక్కనే ఉన్న అబ్బాయితో మాట్లాడుతూ.. కాసేపు చూడండి.. నేను షాపింగ్ చేసుకొని వస్తానని చెప్పి షాపింగ్‌కు వెళ్లింది. మోనిత వెళ్లగానే కారులో ఉన్న బాబును ఓ వ్యక్తి వచ్చి ఎత్తుకెళ్లాడు. తన కొడుకు కోసం తెచ్చిన బొమ్మలను గురించి చెబుతూ కారులోకి తొంగి చూసింది. అయితే కారులో బాబు లేకపోవడంతో కంగారుపడిపోయింది. కారు పక్కనే ఉన్న అబ్బాయిని అడిగితే.. ఇటువైపు ఓ వ్యక్తి రావడం కనిపించింది అంటూ చెప్పడంతో ఆందోళనకు లోనైంది.

    కార్తీక్ ఫ్యామిలీ పనే అనుకొంటూ..

    కార్తీక్ ఫ్యామిలీ పనే అనుకొంటూ..

    బాబును చూడమంటే ఇలా చేశావేంటి? అని మోనిత అంటే.. నేను ఇక్కడే ఉన్నా. ఎవరు తీసుకెళ్లారో నాకు తెలియదు అని అంటే...నిన్ను చూడమని చెప్పానుగా అని మోనిత అరిచింది. అయితే తన బాబును ఎత్తికెళ్లింది కార్తీక్ కుటుంబానికి చెందిన వారే అనే అనుమానంతో కంగారు పడింది. అంతేకాకుండా సౌందర్య చెప్పిన విషయాలను గుర్తు చేసుకొని ముమ్మాటికి వారి పనే అయింటుందని నిర్ధారణకు వచ్చారు. ఇక తన కారు స్టార్ట్ కాకపోవడంతో అప్పుడే అక్కడికి వచ్చిన తన స్నేహితురాలి బైక్ తీసుకొని వెళ్లింది.

     కార్తీక్ ఇంట్లో మోనిత హంగామా

    కార్తీక్ ఇంట్లో మోనిత హంగామా

    ఇదిలా ఉండగా, దీప, కార్తీక్‌ ఇద్దరు ఇంటిని వదిలివెళ్లడంతో ఆనందరావు మనోవేధనకు గురవుతున్నాడు. అయితే భర్తను చూసి.. మీరు బాధలో ఉన్నారు అంటే.. సంతోషపడి ఏం చేయాలి అని ఆనందరావు సమాధానం ఇచ్చారు. అయితే దీప ఉంటే కార్తీక్‌కు ఏమీ కాదు అంటూ సౌందర్య సముదాయించింది. కొడుకు పోయాడంటూ నేరుగా బైక్‌తో మోనిత ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లోనే బైక్‌ను నడుపుతూ.. మన అబ్బాయిని ఎవరో ఎత్తుకు పోయారు. కార్తీక్.. ఎక్కుడున్నావు అంటూ మోనిత కేకలు పెట్టింది. మోనిత తీరు చూసి సౌందర్య, ఆనందరావు కంగారుపడిపోయారు.

    English summary
    Karthika Deepam December 14th Episode number 1222:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X