For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam కార్తీక్‌పై చేయి చేసుకొన్న రుద్రాణి.. చెంప పగలకొట్టిన దీప

  |

  కార్తీకదీపం సీరియల్‌లో ఆసక్తికరమైన అంశాలతో కొనసాగుతున్నది. కథలో ఊహించని మలుపులు చోటుచేసుకోవడం సీరియల్‌పై మరింత క్రేజ్ కనిపించింది. కార్తీక్ కుటుంబం వలస పోవడం, మోనిత కొడుకును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లడం, కార్తీక్ ఇంట్లో మోనిత తిష్ట వేయడం లాంటి అంశాలు సీరియల్‌లో ఆసక్తిగా మారాయి. తాజా ఎపిసోడ్ 1223లో ఇంకా ఏమి జరిగిందంటే..

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   కుమారుడు అదృశ్యం కావడంపై మోనిత

  కుమారుడు అదృశ్యం కావడంపై మోనిత

  తన కుమారుడు అదృశ్యం కావడంపై ఆందోళన చెందుతూ కార్తీక్ కుటుంబంపై డాక్టర్ దీప అనుమానాలు పెట్టుకొని సౌందర్య దంపతులను నిలదీసింది. నీ కొడుకు నీకు దూరం అయ్యారని.. నా కొడుకును నాకు దూరం చేస్తారా? అది తప్పు కాదా? చంటిపిల్లాడిని దూరం చేస్తారా? అంటూ మోనిత నిలదీసింది. దాంతో చంటి పిల్లాడిని దూరం చేయడమేమిటి అంటూ సౌందర్య ఎదురు ప్రశ్న వేసింది. నా మీద కోపం ఉంటే.. కొట్టండి.. చంపండి.. కానీ నా పిల్లాడిని దూరం చేస్తారా? నీ కొడుకు ఆదిత్యను పిలవండి.. అతడే నా కొడుకును ఎత్తుకెళ్లి.. దాచి ఉంటాడని అనుమానం అని మోనిత గొడవ చేసింది.

  కొత్త నాటకాలు వేయకు అంటూ

  కొత్త నాటకాలు వేయకు అంటూ

  మోనిత ఆరోపణలకు ఘాటుగా సమాధానం ఇస్తూ.. మళ్లీ కొత్త నాటకాలు మొదలుపెట్టావా? ఎత్తుకెళ్లడం, కిడ్నాప్ చేయడం నీకు తెలిసిన విద్యలు అంటూ సౌందర్య నిలదీసింది. దాంతో నా కొడుకును తీసుకెళ్లి.. నా మీద పగ తీర్చుకొంటున్నారు అని మోనిత అంటే.. ఎందుకమ్మ ఇలా టార్చర్ పెడుతారు.. నీకు మాకు సంబంధం ఏమిటి? అని ఆనందరావు ప్రశ్నించాడు. దాంతో నాకు మీకు సంబంధమంటారేమిటి.. మీకు నేను దేవుడు ఇచ్చిన కోడలిని అంటూ మోనిత చెప్పింది. మోనిత ఏడ్చే రోజులు పోయాయి.. ఏడిపించే రోజులు వచ్చాయి అంటూ తనదైన శైలిలో స్పందించింది.

  నీ కొడుకు దొరుకుతాడు.. నా కొడుకు దొరుకుతాడు

  నీ కొడుకు దొరుకుతాడు.. నా కొడుకు దొరుకుతాడు

  నా కొడుకును ఎత్తుకెళ్లింది తెలిసే దాక.. ఇక్కడే ఉంటాను. చస్తే కదలను అని మోనిత అంటే.. నీ కొడుకును మేము ఎందుకు దొంగిలిస్తాం. అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా? అని సౌందర్య చెప్పింది. దాంతో నా కొడుకు విషయంలో నేను ఎందుకు అబద్ధం చెబుతాను. వాడు నా కొడుకు మాత్రమే కాదు. ఈ ఇంటి వారసుడు. మీ రక్తం పంచుకొని పుట్టాడు. మీ కొడుకు దొరుకుతాడు. నా కొడుకు దొరుకుతాడు. ఆడదానికి పెళ్లి అయితే అత్తారిల్లే దిక్కు కదా. నా కొడుకు దొరికే వరకు నేను ఇక్కడే మీ ఇంట్లో ఉంటూ.. ఆది దంపతులుగా చూసుకొంటూ మీకు సేవ చేసుకొంటాను అని మోనిత చెప్పడంతో వాళ్లు కంగారు పడ్డారు.

   మోనిత కొడుకును ఎత్తుకెళ్లింది

  మోనిత కొడుకును ఎత్తుకెళ్లింది

  అయితే మోనిత బిడ్డను ఎత్తుకెళ్లింది శ్రీవల్లి భర్త కావడం ట్విస్టుగా మారింది. కార్తీక్‌ వలస వెళ్లి ఉంటున్న ఇళ్లు శ్రీవల్లిదే కావడం, ఆ ఇంటి నుంచి రుద్రాణి అనే లోకల్ లీడర్ వెళ్లగొట్టడం తెలిసిందే. అప్పు చెల్లించకపోవడంతో శ్రీవళ్లీ ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఆ సమయంలోనే ఆమె ప్రసవవేదనకు గురికావడం, అనంతరం ఆమె జన్మనిచ్చి బిడ్డ మరణించడంతో ఆమె భర్త మోనిత బిడ్డను తీసుకొచ్చి చేతిలోపెట్టాడు. అయితే ఈ బిడ్డ తల్లి చనిపోయింది. ఇక బిడ్డను మనమే పంచుకొందామని చెప్పాడు. దాంతో శ్రీవల్లి ఊరట చెందింది.

  లోకల్ లీడర్ రుద్రాణి వీరంగం

  లోకల్ లీడర్ రుద్రాణి వీరంగం

  ఇదిలా ఉండగా, శ్రీవల్లి ఇంటి వస్తువులను జాగ్రత్త చేయాలని ప్రయత్నించిన కార్తీక్‌ను రుద్రాణి మనుషులు అడ్డుకొంటే వారిని కొట్టడం జరిగింది. అయితే తన మనషులను కొట్టిన కార్తీక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీవల్లి ఇంటికి వచ్చింది. ఇంట్లో వస్తువులు చూసి.. శ్రీవల్లి వస్తువులను ఎందుకు ఇంట్లో పెట్టుకొన్నావు అంటూ కార్తీక్, దీప, హిమ, శౌర్య భోజనం చేస్తుండగా కాలితో తన్నడంతో కార్తీక్ కోపంతో ఊగిపోయాడు. చిన్నపిల్లలు తింటూ ఉంటే కాలితో తన్నుతావా? అని సీరియస్ అయ్యాడు. నాకు ఎదురు తిరిగితే.. ఎవరైనా కాలితోనే సమాధానం చెబుతాను అంటూ రుద్రాణి వీరంగం సృష్టించింది.

  Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
  కార్తీక్, దీపకు రుద్రాణి వార్నింగ్

  కార్తీక్, దీపకు రుద్రాణి వార్నింగ్

  అయితే రుద్రాణి తీరుతో కోపగించుకొన్న కార్తీక్ ఆమెపైకి వెళ్లాడు. తనపై తిరగబడిన కార్తీక్‌ను రుద్రాణి నెట్టివేసింది. దాంతో రుద్రాణి చెంపపై దీప. లాగి కొట్టింది. దీప కొట్టిన దెబ్బకు దిమ్మతిరగడంతో ఏం జరిగిందనే విషయాన్ని తేల్చుకోలేకపోయింది. శ్రీవల్లి నాకు మూడు లక్షలు ఇవ్వాలి. మీరు చెల్లిస్తారా అంటూ ప్రశ్నించింది. అయితే నేను చెల్లిస్తాను అంటూ కార్తీక్ చెప్పడంతో దీప కంగారు పడిపోయింది. అయితే శ్రీవల్లి చేసిన అప్పు తీర్చుకపోతే నా నిజస్వరూపం చూస్తారు. నీ కొట్టిన దెబ్బను కూడా గుర్తుంచుకొంటాను అంటూ రుద్రాణి వార్నింగ్ ఇచ్చింది.

  English summary
  Karthika Deepam December 15th Episode number 1223:Deepa Slaps local leader Rudrani
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X