twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నిన్ను చంపి.. సంతాప సభలో ఫ్లెక్సి పెట్టిస్తా.. మోనితకు సౌందర్య స్ట్రాంగ్ వార్నింగ్

    |

    డాక్టర్ మోనిత కొడుకు ఆనందరావును ఎత్తుకొచ్చిన కోటేష్ తన భార్యకు అబద్దం చెప్పి దత్తత తీసుకొందామని చెప్పారు. కోటేశ్, శ్రీవల్లి తన ఇంటిలో ఉంటున్న కార్తీక్, దీప కుటుంబం వద్దకు వచ్చి ఆశీర్వాదం ఇవ్వమని అడిగారు. ఆ సందర్భంగా మోనిత కొడుకును చూసి ఈ బిడ్డ రోజుల శిశువుగా లేడు. నెలల బిడ్డగా ఉన్నాడు అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. అలాగే కార్తీక్ ఇంటిలోకి వచ్చి ఆయన తల్లిదండ్రులను ఇబ్బందికి గురిచేస్తున్న మోనితకు సౌందర్య షాకిచ్చింది. ఇంకా కార్తీకదీపం సీరియల్‌లోని తాజా ఎపిసోడ్ 1226లో ఎలాంటి ట్విస్టులు కనిపించాయంటే..

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    కన్న ప్రేమ కంటే.. పెంచిన ప్రేమే గొప్పది

    కన్న ప్రేమ కంటే.. పెంచిన ప్రేమే గొప్పది

    బిడ్డను ఒడిలో పెట్టుకొని తమ వద్దకు తీసుకొచ్చి ఆశీర్వాదం అడిగిన కోటేష్ దంపతులపై కార్తీక్ అనుమానం వ్యక్తం చేయడంతో వారిద్దరి కంగారుపడ్డారు. కార్తీక్, దీప అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నా భార్యకు ఇప్పటికే మూడుసార్లు గర్బం పోయింది. ఇక పిల్లలు పుట్టడం కష్టమని చెప్పారు. ఆ పరిస్థితుల్లో హాస్పిటల్‌లో అనాధ బిడ్డ కనిపించడంతో దత్తత తీసుకొన్నామని కోటేష్ మళ్లీ అబద్దం చెప్పాడు. దాంతో మంచి పని చేశావు. డాక్టర్ల సమక్షంలో దత్తత తీసుకోవడం మంచిపనే అంటూ కార్తీక్ అన్నాడు. అయితే ఈ విషయం ఎవరికి చెప్పకండి.. నేను ఊర్లో వారందరికి నా బిడ్డే, శ్రీవల్లికి పుట్టిన బిడ్డే అని చెప్పాను. దాంతో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పది అంటూ దీప ఆశీర్వాదం అందించింది.

    మా పరిస్థితి బాగా లేకపోవడం వల్లే

    మా పరిస్థితి బాగా లేకపోవడం వల్లే

    కార్తీక్, దీప కుటుంబాన్ని చూసిన శ్రీవల్లి.. తన మనసులోని మాటను అడిగింది. మీరు మాకు చాలా సహాయం చేస్తున్నారు. చాలా మంచి వాళ్లుగా కనిపిస్తున్నారు. మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది. దాంతో అలా అడగడం తప్పు అంటూ కోటేష్ వారించాడు. అయితే తాము విజయనగరానికి చెందిన వాళ్లం. ఉన్నత కుటుంబమైనా పరిస్థితులు బాగా లేని కారణంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. మేము డబ్బుతో కాకుండా మనసుతో మనిషిని చూస్తాం అని దీప అన్నారు.

    సెల్ఫీ దిగుతూ మోనిత ఓవరాక్షన్

    సెల్ఫీ దిగుతూ మోనిత ఓవరాక్షన్

    ఇక కార్తీక్ ఇంటిలో అడ్డా పెట్టిన మోనిత గోడపై పెట్టిన కార్తీక్‌తో దిగిన ఫోటోతో సెల్ఫీ తీసుకొంటూ ప్రియమణికి కనిపించింది. మోనిత వ్యవహారం చూసి ఏంటమ్మా అని అడిగితే.. కార్తీక్ ఇంటిలో కార్తీక్‌తో దిగిన ఫోటోతో సెల్పీ దిగుతానని ఊహించావా? అలాగే కార్తీక్‌తో నేను దిగిన ఫోటో పెట్టి.. ఇంట్లో వాళ్ల నోర్లు మూయిస్తానని ఊహించావా? నా కలలు అన్నీ నిజం అవుతున్నాయి? ఇలా జరుగుతాయని ఎన్నడైనా ఊహించావా? అని కళ్లు మూసుకొని తన్మయత్వంలో మునిగిపోయింది.

    మోనిత ఫోటోను నేలకేసి కొడుతూ..

    మోనిత ఫోటోను నేలకేసి కొడుతూ..


    అయితే మోనిత, ప్రియమణి సంభాషణను విన్న సౌందర్య కోపంతో పరుగున వచ్చి కార్తీక, మోనిత దిగిన ఫోటోను గోడ మీద నుంచి నేలకేసి కొట్టింది. దాంతో ప్రియమణి కంగారు పడిపోయింది. కళ్లు తెరిచి చూసిన మోనిత సౌందర్య ఉగ్రరూపం చూసి భయపడి పోయింది. ఏంటే ప్రియమణి.. మోనిత ఫోటోను నేలకేసి కొడుతానని ఎప్పుడైనా ఊహించావా అని సౌందర్య గద్దించింది. మౌనంగా ఉండటంతో ఎప్పడైనా ఊహించావా అంటూ రెట్టింపుగా అడగడంతో భయంతో తలాడించింది. ఏం మోనిత నువ్వు ఊహించావా? అంటే మోనిత కూడా భయంతో అడ్డంగా తలాడించింది.

    నిన్ను మెడపట్టి నెట్టడం చిటికెలో పని..

    నిన్ను మెడపట్టి నెట్టడం చిటికెలో పని..


    మోనితకు సౌందర్య వార్నింగ్ ఇస్తూ.. కార్తీక్, దీప ఎక్కడికి వెళ్లారో అనే టెన్షన్‌లో ఉన్నాం. ఇలాంటి టైమ్‌లో ఇంటికి వచ్చి ఫ్లెక్సిలు పెడుతాను.. కటౌట్ పెడుతానని బెదిరిస్తున్నావు. నా కొడుకు కోసం, నా కోడలు కోసం అవసరమైతే నిన్ను చంపి.. నీ సంతాప సభలో అతిపెద్ద ఫ్లెక్సి పెడుతాను. ఏం అనుకొంటున్నావో.. ఇంట్లో నుంచి నిన్ను మెడపట్టి బయటకు నెట్టడం చిటికెలో పని. కొడుకును పోగొట్టుకొన్నావు, కష్టాల్లో ఉన్నావు కదా అంటూ జాలి పడ్డాం. బిడ్డను మేము ఎత్తుకెళ్లామని మాపై నిందలు మోపావు. నీ బిడ్డను ఎత్తుకెళ్లారో.. నీవే నాటకం ఆడుతున్నావో తేల్చుకోవడానికి ఇంట్లో ఉంచాం. నీ నాటకాలు ఆపకపోతే.. నిన్ను ప్రియమణిని గేట్ బయటకు నెట్టడం కష్టమైన పని కాదు అంటూ సౌందర్య వార్నింగ్ ఇచ్చింది.

    రుద్రాణి పిలుపుతో కార్తీక్..

    రుద్రాణి పిలుపుతో కార్తీక్..

    శ్రీవల్లి, కోటేష్ అప్పుబారిన పడటంతో తీసుకొన్న రుణం చెల్లించాలని లోకల్ నేత రుద్రాణి దౌర్జన్యం చేయడంతో ఆమెను దీప చెంప పగలకొట్టిన విషయం తెలిసిందే. అయితే శ్రీవల్లి కుటుంబానికి ఆశ్రయం ఇచ్చిన కార్తీక్‌ను తన ఇంటికి రమ్మని తన రౌడీలతో కబురు పంపించింది. అయితే కార్తీక్ అర్ధరాత్రి రుద్రాణి వద్దకు బయలు తేరి ఆమె ముందు నిలుచున్నాడు. రుద్రాణి అంటే అటు పది ఊళ్లు.. ఇటు పది ఊళ్లు చెప్పుకొంటాయి. ఒక్కరు కూడా నన్ను మంచిదాన్ని అని చెప్పుకోరు. నేను చాలా చెడ్డదానిని. నచ్చితే నెత్తిన. లేకపోతే నేలకేసి కొడుతాను. ఆ దస్తావేజులపై సంతకం పెట్టు.. నీ పెళ్లాం దీప.. శ్రీవల్లి, కోటేష్‌ను ఇంట్లోనే పెట్టుకొన్నది. కోటేష్ చేసిన అప్పు తీర్చు. నీవు మంచి పనులు చేసి గొప్పవాడివి అనిపించుకొంటున్నావు. కోటేష్ చేసిన అప్పు తీర్చాలి.. అందుకే కోటేష్ ఆస్తిని జప్తు చేశాను.

     దస్తావేజులపై సంతకం..

    దస్తావేజులపై సంతకం..

    కాబట్టి నీవు ఇంటి అప్పు తీర్చాలి. నా పనిమనుషులను కొట్టినందుకు బాధ్యత తీసుకొంటావా? లేక వారిని బజారుకు ఈడ్చాలా? అని రుద్రాణి అంటే.. కోటేష్ అప్పును నేను తీర్చుతాను అని కార్తీక్ చెప్పాడు. మూడు లక్షలు అప్పు నెలలో తీర్చాలి. లేకపోతే నా వల్ల కాదని వెళ్లిపో.. నీకు ఎలాంటి బాధ ఉండదు అని రుద్రాణి అంటే.. దస్తావేజులపై సంతకం పెట్టాడు. అయితే అప్పు తీర్చకపోతే దస్తావేజుల్లో రాసిన ప్రకారం.. నీ ఇద్దరు కూతుళ్లలో ఒకరిని తీసుకొచ్చుకొంటాను అని రుద్రాణి ట్విస్టు ఇచ్చింది. దాంతో కార్తీక్ కంగారు పడిపోయాడు. ఇంటికి వచ్చి తన కూతుళ్లను చూసుకొంటూ బాధపడిపోయాడు.

    English summary
    Karthika Deepam December 18th Episode number 1226: Soundarya Strong warning to Monita
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X