For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam కార్తీక్‌తో అలా గర్బవతిని అయ్యా.. మోనితకు దీప సీరియస్ వార్నింగ్

  |

  డాక్టర్ అసోసియేషన్ ఎన్నికల జరుగుతుండటంతో కార్తీక్ తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఆడిటోరియంలోకి రాగానే ఘనంగా ఆహ్వానం పలికారు. అయితే ఏకగ్రీపంగా ఎన్నుకోవడంపై తాను ఆ పదవికి న్యాయం చేయలేమేననే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే డాక్టర్ అసోసియేషన్ ప్రసిడెంట్‌గా నీవే సమర్ధుడివని డాక్టర్ భారతీ దంపతులు ప్రోత్సహించారు. ఈ ఎన్నిక ప్రక్రియ జరుగుతుండగా.. మోనిత ఎంట్రీ ఇచ్చి రచ్చ చేసింది. అయితే తాజాగా అంటే డిసెంబర్ 1వ తేదీన ప్రసారమైన 1211 ఎపిసోడ్‌లో మోనిత చేసిన రచ్చ ఏమిటంటే..

  ఏకగ్రీవంగా కార్తీక్ ఎన్నిక

  ఏకగ్రీవంగా కార్తీక్ ఎన్నిక

  కార్తీక్‌ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో కుటుంబ సభ్యుల్లో తల్లిని ప్రసంగించమని కోరితే.. సౌందర్య మైక్ ముందుకు వచ్చి డాక్టర్ బాబు చిన్ననాటి సంఘటనను అందరికి చెప్పింది. కార్తీక్ మంచి వ్యక్తి, మృదు స్వభావి. ఈ పదవికి కార్తీక్ సరైన వ్యక్తి అంటూ సౌందర్య చెబుతుంటే.. మోనిత ఎంట్రీ ఇచ్చింది. కార్తీక్ గురించి మీ కంటే నేనే ఎక్కువ చెబుతాను అంటూ మోనిత అనగానే.. అందరూ షాక్ గురయ్యారు.

  ఒక వ్యక్తి గురించి ఎక్కువగా చెప్పగలిగేది తల్లి, ఆ తర్వాత భార్య, అర్ధాంగి, సతీమణి అంటూ దీపవైపు చూసింది. దాంతో మోనిత ముఖం వాడిపోయింది. కార్తీక్ గురించి ఆయన సతీమణి దీప మాట్లాడుతుంది. వేదిక మీదకు రమ్మని ఆహ్వానించింది. మీ వారు గురించి ఊరు, పేరు లేని వారు చెబితే ఏం బాగుంటుంది అని పిలిచింది.

  కార్తీక్‌ను టార్గెట్ చేసిన మోనిత

  కార్తీక్‌ను టార్గెట్ చేసిన మోనిత

  సౌందర్య కోరిక మేరకు దీప స్టేజ్‌పైకి రావడానికి ప్రయత్నిస్తుండగా.. మోనిత వచ్చి.. డాక్టర్ భారతీ, సౌందర్యను జరిపి మైక్ తీసుకొన్నది. ఇక్కడ జరిగేది డాక్టర్ అసోసియేషన్ ఎన్నికలు. కానీ కొందరు డాక్టర్లు కానీ యాక్టర్లు వచ్చారు. అధ్యక్షుడిగా ఎన్నికైన కార్తీక్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. కార్తీక్ గురించి భార్య బాగా చెబుతుందని సౌందర్య చెప్పారు అంటూ పకపక నవ్వింది.

  అయితే ఎందుకు నవ్వుతున్నానంటే.. పెళ్లయ్యాక కార్తీక్ తన భార్యకు 11 ఏళ్లు దూరమయ్యారు. ఈ మధ్యనే కలిశారు. అసలు కలిసి లేని భార్యకు భర్త గురించి ఏం తెలిస్తుంది. పేషెంట్‌కు ట్రీట్‌మెంట్ చేయని డాక్టర్‌కు ఆ పేషెంట్‌కు ఏం తెలుస్తుంది అని మోనిత అనగానే అందరూ షాక్ గురయ్యారు.

  నిజాలు చెప్పడానికే అంటూ..

  నిజాలు చెప్పడానికే అంటూ..


  కార్తీక్ గురించి ఏదో చెప్పబోతుంటే.. డాక్టర్ భారతీ ఆపమని అంటే.. ఎందుకు ఆపాలి అంటూ మోనిత సమాధానం ఇచ్చింది. కార్తీక్ స్నేహితురాలిగా, ఒక డాక్టర్‌గా, ఒక బాధితురాలిగా, ఒక గైనకాలజిస్టుగా, కార్తీక్ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిగా మాట్లాడుతాను. ఇక్కడ ఉన్న మీకు ఏమీ తెలియదని అనుకొను. మా ఇద్దరి గురించి పేపర్ల, మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చాయి.

  అయితే వచ్చిన దాంట్లో నిజా నిజాలు తెలియవు కదా.. అందుకే ఆ విషయాలు చెప్పడానికి వచ్చాను అంటూ మోనిత చెప్పగానే.. కార్తీక్ లేచివెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. అయితే కార్తీక్ కూర్చో.. నేను ఏదైనా తప్పు చెబితే.. వాటిని అడ్డుకోవచ్చు అంటూ మోనిత చెప్పింది.

  పెళ్లి చేసుకొంటానని మోసం

  పెళ్లి చేసుకొంటానని మోసం

  అయితే మోనిత స్టేజ్ మీద కార్తీక్‌ను టార్గెట్ చేస్తూంటే.. ఇది డాక్టర్స్ అసోసియేషన్ అంటూ డాక్టర్ భారతీ భర్త రవి అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే.. కరెక్ట్‌గా చెప్పావు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ అసోసియేషన్ న్యాయం చేయాలి. కార్తీక్ వల్ల నాకు అన్యాయం జరిగింది అని మోనిత అంటే.. మీ ప్రాబ్లెం ఏమిటో చెప్పు అంటూ డాక్టర్ నిలదీసింది.

  అయితే పాయింట్‌కు వస్తాను అంటూ.. దీప వదిలేసి వెళ్లిన తర్వాత నా వద్దకు వచ్చేవాడు. నన్ను పెళ్లి చేసుకొంటానని చెప్పాడు. పెళ్లిపీటల మీద ఉంటే ఈ మహానుభావురాలు నా పెళ్లిని చెడగొట్టారు. దాంతో నేను ఏడ్చాను. నా గురించి అందరికి తెలిసిపోయింది. నన్ను ఎవరూ పెళ్లి చూసుకోవడం లేదు. కార్తీక్ నన్ను వద్దంటున్నాడు అని మోనిత చెప్పింది.

  అలా గర్బవతిని అయ్యా..

  అలా గర్బవతిని అయ్యా..

  మోనిత అలా మాట్లాడుతుంటే.. డాక్టర్ భారతీ ఆపేందుకు ప్రయత్నించింది. అయితే నీ భర్త నిన్ను వదిలేస్తే నీకు నా బాధ అర్ధం అవుతుంది. నా బాధను ఎవరికి చెప్పుకోలేక కృత్రిమ గర్బధారణతో గర్బవతిని అయ్యాను. డెలివరీ సమయంలో భర్తగా సంతకం చేశాడు. బిడ్డ పేగు మెడలో వేసుకొని పుట్టాడని, శాంతి పూజలు జరిపించాలంటే.. దంపతులుగా పూజలు చేశాం అంటూ సాక్ష్యాలను మోనిత చూపించింది.

  నాకు న్యాయం చేయండి అంటూ మోనిత చేతులెత్తి ధీనంగా ప్రార్థించింది. అలాంటి వ్యక్తిని ప్రసిడెంట్ చేస్తారు? అందలం ఎక్కిస్తారు అంటూ మోనిత అంటుండగా.. అప్పటి వరకు మౌనంగా ఉన్న దీప చప్పట్లు కొడుతూ లేచింది.

  మోనితను కొటేందుకు కార్తీక్

  మోనితను కొటేందుకు కార్తీక్

  మోనిత మొసలి కన్నీరు కారుస్తుంటే.. దీప చప్పట్లు కొడుతూ స్టేజ్ మీదకు వెళ్లి ఆమెను పక్కకు నెట్టింది. అయితే తాజా ప్రోమోలో మరోసారి దీప, మోనిత మధ్య పవర్‌ఫుల్ సీన్ కనిపించింది. ఆడిటోరియం నుంచి కార్తీక్ బయటకు వెళ్తుంటే.. తన బిడ్డను చూస్తూ.. ఆనందరావు గారు.. మీ తండ్రి డాక్టర్ అసోసియేషన్ ప్రసిడెంట్ అయ్యాడు. ఆ మాట అనగానే.. మోనితను కొట్టేబోయేందుకు కార్తీక్ వెళ్తే.. దీప ఆపింది. దానిని చంపేస్తాను అంటే.. నా మీద ఒట్టు అంటూ సౌందర్య కార్తీక్ చేయి తన తలపై పెట్టుకొన్నది.

  Actor Karthikeya & Tanikella Bharani Interview Part 2
  మోనితకు అలాంటి వార్నింగ్

  మోనితకు అలాంటి వార్నింగ్

  మోనిత రెచ్చ గొడుతున్నా.. కార్తీక్ కుటుంబం వెళ్లిపోతుంటే.. కార్తీక్ నీకు ఆడపిల్లలు ఉన్నారు.. నా శాపం తగులుతుంది. నీ పిల్లల బతుకు కూడా నాలాగే అవుతుంది అని మోనిత అంది.. దాంతో ఏయ్ అంటూ దీప ఉగ్రరూపం ప్రదర్శించి మోనితను కొట్టబోయింది. ఇంకోసారి నా పిల్లలు, భర్త, నా గురించి మాట్లాడావో.. అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రండి అమ్మా అంటూ మోనిత ప్రియమణి లాగితే.. వెళ్లిపోవడానికి రాలేదు. కార్తీక్ ఇంటిలో ఉండేందుకు వచ్చాను అంటూ మోనిత షాకింగ్‌గా కామెంట్లు చేసింది.

  English summary
  Highest rated Telugu serial Karthika Deepam's November 30th Episode number 1211
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X