For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam మోనిత పీక పిసికిన సౌందర్య.. శ్రావ్య, ఆదిత్య కొడుకు మిస్సింగ్ ట్విస్ట్

  |

  కార్తీకదీపం సీరియల్‌లో కార్తీక్ తల్లి సౌందర్య, మోనిత మధ్య భారీగా వాగ్వాదం చోటుచేసుకొన్నది. కొడుకును ఎవరో ఎత్తుకెళ్లినప్పటికీ నీవు వెతకడం మానేసి మా ఇంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతున్నావు. నీవు నీ కొడుకును నీ మాయం చేసి నాటకం ఆడుతున్నావేమో అంటూ సౌందర్య అనుమానం వ్యక్తం చేసింది. అయితే నీ కొడుకు, కోడలిని కలుపడానికి దీప నుంచి బిడ్డను వేరు చేయలేదా అలాగే నీవు నా బిడ్డను నా నుంచి వేరు చేసి ఉంటావు అని మోనిత షాకిచ్చింది. ఇక తాజా ఎపిసోడ్ 1230 లో ఏం జరిగిందంటే..

  పిచ్చి వాగుడు ఆపు మోనిత

  పిచ్చి వాగుడు ఆపు మోనిత

  దీప బిడ్డను ఎత్తుకెళ్లావని ఆరోపణలు చేసిన మోనితపై సౌందర్య మండిపడింది. నోర్మూయ్ మోనిత రోజుకో నాటకం ఆడే నీకు నాతో పోలీక ఏమిటి? అడ్డదారిలో బతికే నీకు.. మహరాణిలా బతికే నాకు పోలీకా అని సౌందర్య అంటే.. కొడుకు పోతే తల్లడిల్లాలని చెప్పావుగా.. నీ కొడుకు పోతే నీవు బాగా రెడీ అయ్యి ఇంట్లోనే హాయిగా ఉంటున్నావుగా అని మోనిత కౌంటర్ ఇచ్చింది.

  అయితే నా కొడుకు కావాలనిమాకు దూరంగా కావాలని వెళ్లిపోయాడు. వెతికితే దొరకడు. ఏదో రోజు మనసు మార్చుకొని ఇంటికి వస్తాడు. నీ కొడుకు కావాలనే తప్పించారో.. లేక ఎవరైనా ఎత్తుకెళ్లారో ఆ పరమేశ్వరుడికే తెలియాలి. ఇకనైన పిచ్చి వాగుడు ఆపి బాబు కోసం వెతుక్కో. కానీ ఇక్కడే ఉండి ఇలా చేస్తే నీవు పడుకొన్న సమయం చూసి వేడి వేడి అట్లకాడతో ఆటోగ్రాఫ్ ఇస్తాను అని సౌందర్య గట్టిగా మందలించింది.

  తాళి బొట్టు అమ్మిన దీప

  తాళి బొట్టు అమ్మిన దీప

  ఇంటి అవసరాల కోసం తాళిబొట్టును అమ్మిన దీపను చూసి కార్తీక్ షాక్ తిన్నాడు. దీప మెడలో మంగళసూత్రం లేనిది చూసి.. నీ ఒంటి మీద బంగారం ఏమైంది అక్కా అంటూ శ్రీవల్లి అడగింది. దాంతో దీప బంగారం తాకట్టుపెట్టిన విషయం కార్తీక్‌కు తెలిసింది. బంగారం అమ్మేశావా? అంటూ కార్తీక్ అడిగితే.. తప్పనిసరి పరిస్థితిలో తాకట్టు పెట్టాను అని దీప బదులిచ్చింది. నీ అభరణాలు తల్లికి గుర్తు అని చెప్పావు అంటే.. కష్టాల్లో మా అమ్మ నగలు అవసరం వచ్చాయి అని గుర్తు పెట్టుకొంటాను అని దీప చెప్పింది. నేను పనిచేస్తానంటే వద్దంటావు.. నీవేమో ఇలాంటి పనిచేస్తున్నావు. నేను పనికిరాని వాడిగా మారిపోతున్నాను. నాకు ఓ మనసాక్షి ఉంటుంది కదా అని కార్తీక్ డీలా పడ్డారు.

  మంచి పనులు చేసినా మట్టి అంటుతుందంటూ

  మంచి పనులు చేసినా మట్టి అంటుతుందంటూ

  అయితే నగలు తాకట్టు పెట్టడంపై బాధపడుతున్న కార్తీక్‌ను దీప ఓదార్చింది. ఒక్కోసారి మంచి పనులు చేసినా మట్టి అంటుతుంది. అందులో మీ తప్పేమీ లేదు కదా డాక్టర్ బాబు అని పిల్లలతో మొక్కలు నాటుతున్న కార్తీక్ చేతులకు మట్టి అంటడంతో నీళ్లతో దీప కడిగే ప్రయత్నం చేసింది. దాంతో నేను చేసే తప్పులను సరిదిద్దుతున్నావా దీప అని కార్తీక్ అడిగాడు. అయితే కార్తీక్ మాటలకు చిరునవ్వు చిందిస్తూ ఉపశమనం కలిగించే పనిచేసింది.

  నాకు కొడుకు పోయిన బాధ లేదా?

  నాకు కొడుకు పోయిన బాధ లేదా?

  అయితే కొడుకు పోయిన నీకు బాధలేదనే విధంగా సౌందర్య అన్న మాటలను గుర్తు చేసుకొని మోనిత పశ్చత్తాపం పడింది. నా కొడుకుపోయినా నాకు బాధ కలగడం లేదా? నాలో తల్లి ప్రేమ లేదా? నాలో కోపం పెరగాలి కదా.. కార్తీక్‌పై ఉన్న ప్రేమనే నా బిడ్డను నా వద్దకు తెప్పిస్తుంది. కార్తీక్‌పై ఉన్న ప్రేమ మాదిరిగానే.. నా ఆనందరావుపై ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తాను. నేను గొప్ప తల్లిగా అందరి చేత శభాష్ అనిపించుకొంటాను. ఆనందరావు గారు.. మీరు ఎక్కడ ఉన్నారు? అమ్మను వదిలేసి వెళ్లావు. అమ్మ నీ కోసం బాధపడుతున్నది అంటూ మోనిత ఆవేదన వ్యక్తం చేసింది.

  దీపు మిస్సింగ్ ట్విస్ట్.. మోనిత

  దీపు మిస్సింగ్ ట్విస్ట్.. మోనిత

  మోనిత తీరుతో చికాకుగా ఉన్న సౌందర్యకు మరో షాక్ తగిలింది. తన మనవడు, ఆదిత్య, శ్రావ్య కొడుకు దీపు కనిపించడం లేదు అంటూ పరుగున వచ్చి చెప్పింది. శ్రావ్య ఏడుపులతో మరింత షాక్‌కు గురవుతూ.. ఇంట్లో వెతుకు అని చెప్పింది. అయితే ఇళ్లంతా వెతికాను. ఎక్కడా కనిపించడం లేదు అని శ్రావ్య చెప్పింది. అంతలోనే మోనిత అదోరకంగా చూస్తూ రాగానే.. ఆమె దీపును దాచిపెట్టి ఉంటుంది అని శ్రావ్య గోడున ఏడుస్తూ బాధపడింది.

  అయితే మోనితను చూసిన సౌందర్య కోపంతో ఆమెను పట్టుకొని దీపును ఎక్కడ దాచావో చెప్పు అంటూ చంపేసేంత పనిచేసింది. దాంతో చంపు అత్తమ్మ.. నీ చేతుల్లోనే నేను చస్తాను అని మోనిత చెప్పడంతో ఛీ అంటూ వదిలేసింది. మోనిత ఇదంతా నీ పనే నాకు తెలుసు. మర్యాదగాఎక్కడ దాచావో చెప్పు అంటూ సౌందర్య వార్నింగ్ ఇచ్చింది.

  మోనిత కాళ్లపై పడిన శ్రావ్య

  మోనిత కాళ్లపై పడిన శ్రావ్య

  అయితే సౌందర్య బెదిరింపులను ఖాతరు చేయకుండా మోనిత గట్టిగానే సమాధానం ఇచ్చింది. నా కొడుకు కనిపించకుండా పోతే నేను ఏడుస్తున్నా. నా కార్తీక్ పోయి నేను బాధపడుతుంటే.. ఈ దీపు గోల ఏమిటి? సరే పద దీపును వెతుకుదాం పద.. పోలీసులకు కంప్లయింట్ ఇద్దాం అని మోనిత అని కేర్‌లెస్‌గా సమాధానం చెప్పింది.

  దాంతో నా బిడ్డను నాకు ఇచ్చేయండి.. అంటూ మోనిత కాళ్లపై శ్రావ్య పడింది. శ్రావ్యను చూసి దాని కాళ్లపై పడటం ఏమిటి? అని సౌందర్య అంది. అయితే శ్రావ్యను చూస్తే బాధగా, జాలిగా ఉంది. కొడుకును దూరం చేసుకొంటే బాధ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించా. దీపును నేనే దాచిపెట్టాను. బెడ్ కింద వాడిని పెట్టాను తెచ్చుకొండి అని మోనిత చెప్పింది.

  English summary
  Karthika Deepam December 23rd Episode number 1230: Shrava, Aditya Son Deepu missing twist.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X