twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam రుద్రాణి చెంప పగలకొట్టిన పోలీస్ ఆఫీసర్.. అరెస్ట్ చేసి అలా తగిన శాస్తి

    |

    శ్రీవల్లి దత్తత తీసుకొన్న బిడ్డ నామకరణం రోజు స్థానిక లీడర్, గుండా రుద్రాణి వచ్చి హంగామా సృష్టించడం అందర్నీ కలిచివేసింది. శ్రీవల్లి కుమారుడిని నామకరణం వేడుక పీటల మీద నుంచి లాక్కెళ్లడంతో షాక్ తిన్నారు. శ్రీవల్లి బిడ్డకు రంగరాజు అని నామకరణం చేసి.. అప్పు కింద నీ బిడ్డను తీసుకెళ్లకుండా ఈ చిన్నారిని తీసుకెళ్తున్నాను అంటూ కార్తీక్‌‌కు రుద్రాణి వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇంకా తాజా ఎపిసోడ్ 1236 లో ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయంటే..

    కార్తీక్ నీకు ప్రమాదం అంటూ

    కార్తీక్ నీకు ప్రమాదం అంటూ

    శ్రీవల్లి బిడ్డను రుద్రాణిని తీసుకెళ్తున్న ఏమీ చేయలేకపోవడంపై కార్తీక్ మదనపడ్డారు. మన పరిస్థితులను పట్టించుకోకుండా వేరే వివాదాల్లో తలదూర్చుతున్నాం. బిడ్డను రుద్రాణి ఎత్తుకెళ్లిందని శ్రీవల్లి, కోటేష్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ మనం వెళ్లలేం. వెళితే మన వివరాలు అడుగుతారు. అందుచేత రుద్రాణి ఇంటికి వెళ్లి పిల్లాడిని పట్టుకొస్తాను అని కార్తీక్ అంటే.. అక్కడికి వెళ్తే నీకు ప్రమాదం అని దీప హెచ్చరించింది.

    మనసు మార్చుకొన్న కార్తీక్

    మనసు మార్చుకొన్న కార్తీక్

    అయితే దీప మాటలను పట్టించుకోకుండా రిస్క్ అయినా నేను వెళ్తాను. శ్రీవల్లి, కోటేష్‌కు ఎవరు అండగా ఉన్నారు అని కార్తీక్ అన్నాడు. ఇప్పటికే రుద్రాణితో గొడవపెట్టుకొన్నాం. మళ్లీ ఆమెతో మనం గొడవ పడకుండా ఉంటే మంచింది అని దీప అంటే.. మనం తప్ప శ్రీవల్లి ఫ్యామిలీకి ఎవరు ఉన్నారు చెప్పు అంటూ కార్తీక్ అన్నారు. అయితే నీవు రుద్రాణి వద్దకు వెళితే.. వచ్చే వరకు మేము భయంతో బతకాల్సి ఉంటుంది అని దీప వేడుకొన్నది. మనకు ఇక గొడవలు వద్దు.. మనమంత కలిసి ఉందాం అని పిల్లలు కూడా వద్దని అనడంతో తన నిర్ణయాన్ని కార్తీక్ వెనక్కి తీసుకొన్నాడు.

    లెక్కలు వడ్డీతో తీర్చుకొందాం అంటూ

    లెక్కలు వడ్డీతో తీర్చుకొందాం అంటూ

    అయితే తమ బిడ్డను ఎత్తుకెళ్లడంపై పోలీస్ స్టేషన్‌లో శ్రీవల్లి, కోటేష్ దంపతులు ఫిర్యాదు చేశారు. దాంతో ఎస్ఐ మాధురి నేరుగా రుద్రాణి ఇంటిలో అడుగపెట్టింది. నా ఇంటికి నేరుగా వస్తావా? అంటే.. తప్పు ఎక్కడ జరిగితే.. అక్కడికి పోలీస్ వస్తారు అని మాధురి అన్నారు. రుద్రాణి చేతిలో ఉన్న బిడ్డను చూసి నా బిడ్డ అంటూ శ్రీవల్లి ఏడిచింది. దాంతో కాస్త ఓపిక పట్టు అంటూ మాధూరి సముదాయించింది. అయితే నాపైనే కేసు పెడుతావా అంటూ రుద్రాణి అంటే.. అన్ని లెక్కలు వడ్డీతో తీర్చుకొందాం అని మాధురి వార్నింగ్ ఇచ్చింది. రుద్రాణి మాటలు పెంచడంతో ఎస్ఐ మాధురి చెంప చెళ్లుమనిపించింది. నన్నే కొడుతావా అంటే.. మరోసారి రుద్రాణి చెంపను ఎస్ఐ పగలకొట్టింది.

    రుద్రాణి చెంప పగలకొట్టడంతో

    రుద్రాణి చెంప పగలకొట్టడంతో

    తనపై ఎస్ఐ మాధూరి చేయి చేసుకోవడంతో రుద్రాణి తట్టుకోలేకపోయింది. తన అనుచరులను ఉసి గొల్పేందుకు ప్రయత్నించగా.. కదిలితే కాల్చిపడేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చింది. నన్ను ఎదురించి ఊర్లో ఉంటావా అంటూ రుద్రాణి చెలరేగిపోయింది. రుద్రాణి ఆవేశానికి కౌంటర్ ఇస్తూ.. ఇప్పుడే అందిని వార్త.

    తాడికొండ ఎస్ఐ మాధూరి ట్రాన్స్‌ఫర్ అయింది. వెళ్లే ముందు కొన్ని పాత బాకీలు తీర్చుకొని.. కొందరిని లాకప్‌లో వేసి వెళ్తాను. బాబును వారికి ఇచ్చేయండి అని రుద్రాణి అనుచరులకు వార్నింగ్ ఇవ్వడంతో వారి చేతిలో చిన్నారిని పెట్టింది. దాంతో ఏ కేసు పెట్టావంటే రుద్రాణి అంటే.. కేసులు పెడుతాను అని వార్నింగ్ ఇచ్చింది. అలా రుద్రాణిని అరెస్ట్ చేసి మాధురి సంచలన నిర్ణయం తీసుకొన్నది.

    రుద్రాణిని పోలీస్ జీప్ ఎక్కించిన ఎస్ఐ

    రుద్రాణిని పోలీస్ జీప్ ఎక్కించిన ఎస్ఐ

    అయితే తనపై కేసు పెట్టిన శ్రీవల్లిపై రుద్రాణి మండిపడింది. నాపై కేసు పెట్టి జీవితంలో పెద్ద తప్పు చేశావు అంటూ శ్రీవల్లిని రుద్రాణి హెచ్చరించింది. అయితే ఇంటిలో నుంచి అందర్ని బయటకు పంపించి.. రుద్రాణికి కోటింగ్ ఇచ్చింది. నడువలేక నడువలేక అనుచరుల సహాయంతో రుద్రాణి పోలీస్ జీప్ ఎక్కింది. అలా రుద్రాణిని మాధూరి అరెస్ట్ చేసింది. శ్రీవల్లికి బిడ్డను తిరిగి ఇచ్చేలా ఎస్ఐ నిర్ణయం తీసుకొన్నది.

    నామకరణం రోజే రుద్రాణికి బుద్ది చెప్పావా?

    నామకరణం రోజే రుద్రాణికి బుద్ది చెప్పావా?

    రుద్రాణిని అరెస్ట్ చేసి బిడ్డను తమ చేతుల్లో పెట్టడంతో శ్రీవల్లి, కోటేష్ ఇంటికి తిరిగి వచ్చారు. బిడ్డను చూసి దీప, కార్తీక్ హ్యాపీగా ఫీలయ్యారు. నామకరణం రోజే రుద్రాణికి బుద్ది చెప్పావా? అంటూ దీప ముద్దు చేసింది. అయితే రుద్రాణి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఏం చేస్తుందో అని శ్రీవల్లి భయాన్ని వ్యక్తం చేసింది. అలా భయపడితే జీవితంలో ఏమీ చేయలేం అని దీప, కార్తీక్ ధైర్యం చెప్పారు.

    శ్రీవల్లి, కోటేష్‌ను లారీతో గుద్దించి..

    శ్రీవల్లి, కోటేష్‌ను లారీతో గుద్దించి..

    ఇదిలా ఉండగా, అరెస్ట్ అయిన రుద్రాణి అదే రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. అయితే తనపై ఫిర్యాదు చేసి అరెస్ట్ చేసిన శ్రీవల్లి, కోటేష్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దమైంది. రోడ్డుపై స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరిని లారితో గుద్దేపించింది. లారీ ఢీ కొట్టడంతో శ్రీవల్లి, కోటేష్ రోడ్డుపై ఎగిరిపడ్డారు. గాయాలతో ఉన్న వారిని స్థానికులు కాపాడారు. ఈ తాజా సన్నివేశాలు తదుపరి ఎపిసోడ్ ప్రోమోలో కనిపించాయి. దీంతో ఏం జరిగిందనే ఆసక్తిని రేకేత్తించింది.

    English summary
    Karthika Deepam December 30th Episode number 1236: Rudrani arrested in Kidnap case by SI Madhuri.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X