Karthika Deepam కీడు శంకించిన కార్తీక్.. నా అంచనాలు తప్పు కావు అంటూ మోనిత
కార్తీకదీపం సీరియల్ అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో బుల్లితెరపై కొనసాగుతున్నది. ఈ సీరియల్ ప్రతీవారం ఏదో ఒక్క కొత్త ట్విస్టుతో ముందుకెళ్తున్నది. అయితే తాజాగా జైలు నుంచి విడుదలైన రుద్రాణి తన ప్రతీకారంతో ఊగిపోయింది. కోటేష్, శ్రీవల్లికి ముప్పు ఉందనే అనుమానాన్ని కార్తీక్ వ్యక్తం చేయడంతో దీప కూడా షాక్ గురైంది. తాజా ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..
Photos Courtesy: Star మా and Disney+Hotstar

రుద్రాణిపై కంప్లయింట్ తప్పు
స్వీట్లు పట్టుకొని వచ్చి దీప సంతోషంగా కనిపించడంతో ఏంటి ఆనందంగా కనిపిస్తున్నావు అని కార్తీక్ అడిగితే.. రుద్రాణి అరెస్ట్ అయింది కదా.. ఇక నుంచైనా బుద్ది తెచ్చుకొంటుందేమో అని దీప సమాధానం ఇచ్చింది. అయితే కుక్క తోక వంకర అనే బుద్ది రుద్రాణిది. అరెస్ట్ చేస్తే మారుతుందని అనుకోవడం తప్పేమో అనిపిస్తుంది. శ్రీవల్లి, కోటేష్ పోలీసులకు కంప్లైయింట్ చేసి తప్పు చేశారేమో అనిపిస్తుంది. ఒక్కోసారి యుద్ధం కంటే రాజీ బెటర్. మనం వెళ్లి బాబును తీసుకొస్తే బాగుండేది అని కార్తీక్ అనుమానం వ్యక్తం చేశాడు. అయితే బాబును తీసుకెళ్లితే నోరు మూసుకోని ఉండటం సరికాదు అని దీప అంటే.. అవును.. కంప్లైయింట్ చేసి తప్పు చేశారనే ఫీలింగ్ నాకు కూడ కలుగుతుంది అని కార్తీక్ మాటలను సమర్థిస్తూ దీప తన అభిప్రాయం చెప్పింది.

పిండి వంటల పనితో దీప
ఇక ఇంటి ఖర్చుల కోసం పిండి వంటల పనిని చేపట్టడానికి దీప సిద్ధమైంది. రేపటి నుంచి నేను పిండి వంటలు మొదలుపెడుతున్నాను అని కార్తీక్‌తో దీప చెప్పడంతో.. ఏం పేరు పెడుతున్నావు అంటూ కార్తీక్ అడిగాడు. అయితే ఇంకా ఏమీ అనుకోలేదు. నీ పేరు కంటే మంచి పేరు ఏముంటుంది? అని దీప సమాధానం ఇచ్చింది. వద్దు దీప.. అయితే నా పేరు పెట్టకు.. నేను దురదృష్ట జాతకుడిని. నా పేరు వద్దు అని కార్తీక్ అంటే.. దీప బాధ పడుతూ కనిపించింది.

అమ్మోరుకు బలి ఇస్తా అంటూ రుద్రాణి
శ్రీవల్లి, కోటేష్ కంప్లయింట్ కారణంగా అరెస్ట్ అయిన రుద్రాణి జైలు నుంచి బయటకు వచ్చింది. తనను అరెస్ట్ చేయించిన ఇద్దరిపై పీకల్లోతు కోపంగా కనిపించింది. వారిద్దరిని ఉద్దేశించి.. అమ్మోరుకు బలి ఇవ్వాల్సిన రోజు వచ్చింది. మేకపోతు మాంసంతో భోజనం పెట్టాలి అని రుద్రాణి అంటే.. ఎన్ని మేకలు బలి ఇవ్వాలి అంటే.. రెండు అని చెప్పింది. తన మనుషులను పలు పనులు పురమాయించింది. అడ్డు వస్తే అవసరమైతే ఆ ఇద్దరిని కూడా బలి ఇద్దాం అని రుద్రాణి తన మనసులోని విషయాలను తన అనుచరులకు చెప్పింది.

నేను ఏడువను.. ఎందుకంటే నేను మోనితను
ఇక బస్తీలో హాస్పిటల్ పెట్టడంపై బస్తీవాసులు వ్యతిరేకించడంపై మోనిత ఘాటుగా స్పందించింది. దీపక్క నీకు బాగానే ఫ్యాన్స్ ఉన్నారు. కానీ మీరు హాస్పిటల్ రాకుండా వ్యతిరేకించడం ఎన్నో రోజులు చేస్తారో నేను చూస్తాను. దీప, కార్తీక్ ఆచూకీ బస్తీవాసుల నుంచే తెలుసుకొంటాను. అందుకే ఇక్కడ కాలు పెట్టాను. అందుకే ఇక్కడ ఇళ్లు కొనుక్కొన్నాను. కొద్ది రోజుల్లో వీళ్ల అభిమానాన్ని సంపాదించుకొంటాను. మోనిత అంచనాలు తప్పు కావు దీపక్క అంటూ మోనిత తన ధీమాను వ్యక్తం చేశారు. నా ఆనందరావును కిడ్నాప్ చేసిన వాడికి ఆనందం ఉండదు. ఆనందరావు ఎక్కడ ఉన్నావు.. నేను నీ కోసం ఏడవను. ఎందుకుంటే నేను మోనితను కాబట్టి అంటూ మోనిత తనలో తాను అనుకొంటూ కనిపించింది.

బాబును చూసుకో అక్క అంటూ శ్రీవల్లి
దీపను పిలిచి మేము గుడికి వెళ్లొస్తాం అక్కయ్య అంటూ శ్రీవల్లి అంటే.. నీవు చెప్పకపోతే నేను చూసుకోనా? అని దీప సమాధానం ఇచ్చింది. బాబును మీరు చూసుకొండి. నేను గుడి నుంచి ఆఫీస్‌కు వెళ్తాను. ఆయన కూడా డ్యూటీకి వెళ్తారు. ఈ ఒక్క రోజు మీరు చూసుకోండి. రేపటి నుంచి మా పిన్ని వస్తుంది అని శ్రీవల్లి అంటే.. సరే అంటూ.. గుడి హుండీలో వేయమని కొన్ని డబ్బులు ఇచ్చింది. ఆ తర్వాత బాబును చూసుకొంటూ దీప, శౌర్య, హిమ మురిసిపోయారు. నీవు గొప్పవాడిని అవుతావు. చిన్నతనంలోనే నీవు రుద్రాణిని అరెస్ట్ చేయించావు. లేకపోతే నీ నామకరణానికి రుద్రాణి అడ్డుపడుతుందా? నన్ను పెద్దమ్మ అను అంటూ దీప ఆనందంలో మురిసిపోయింది.

రుద్రాణి ఎవ్వరిని వదలదు అంటూ
అయితే ఇంట్లోకి వస్తూనే.. రుద్రాణి రాత్రే జైలు నుంచి ఇంటికి వచ్చారు అని కార్తీక్ చెప్పడంతో దీప కంగారు పడిపోయింది. తనకు ఎదురు తిరిగితే ఎవ్వరిని రుద్రాణి వదలదు అని చెప్పుకొంటున్నారు. శ్రీవల్లి, కోటేష్‌కు ముప్పు ఉందని అనిపిస్తున్నది. రుద్రాణి ఎవరిని అంతా సులభంగా వదిలిపెట్టదని అందరూ చెప్పుకొంటున్నారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లారా అంటూ కార్తీక్ ఆందోళన పడ్డారు.
Recommended Video

శ్రీవల్లి, కోటేష్‌ను వెంటాడిన రుద్రాణి లారీ
ఇక స్కూటర్‌పై గుడికి వెళ్తున్న శ్రీవల్లి, కోటేష్‌ను లారీలో రుద్రాణి మనుషులు వెంటాడారు. అదును చూసి లారీతో స్కూటర్‌ను గుద్దేందుకు వెంబడించారు. చివరకు శ్రీవల్లి, కోటేష్ ప్రయాణిస్తున్న స్కూటర్ గుద్దడం తాజా ప్రోమోలో కనిపించింది. తదుపరి ఎపిసోడ్‌లో ఈ ఎమోషనల్ సన్నివేశం ప్రసారం కానున్నది. అయితే శ్రీవల్లి దత్తత తీసుకొన్న పిల్లాడి పరిస్థితి ఏమిటనే ట్విస్ట్‌ను ప్రేక్షకులకు వదిలడం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











