twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్‌తో సినిమా ఛాన్స్.. ఒక్క మాట చెప్పినా సౌందర్య బ్రతికేది: కార్తిక దీపం దర్శకుడు

    |

    కార్తీక దీపం అనగానే అందులోని పాత్రలు ప్రతి ఒక్కరి మనసులో అలా మెదులుతూ ఉంటాయి. ఒక కాన్సెప్ట్ తో సిరియల్ ను వెయ్యికి పైగా ఎపిసోడ్స్ ను నడిపించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఇక ఆ కథను అలా కొనసాగిస్తున్న దర్శకుడు కాపుగంటి రాజేంద్ర ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ విషయాలని బయటపెట్టాడు. అలాగే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాల్సిన విషయంతో పాటు సౌందర్య డెత్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.

     పోటీగా వస్తున్న మిగతా సీరియల్స్

    పోటీగా వస్తున్న మిగతా సీరియల్స్


    కార్తీక దీపం రేటింగ్స్ లో ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలకు కూడా గట్టి పోటీని ఇస్తోంది. ఎంత పెద్ద సినిమాలు వచ్చినా కూడా ఈ సీరియల్ ను ఏ మాత్రం మిస్ చేసుకోవద్దని అనుకునే వారి సంఖ్య రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. ఇక పోటీగా వస్తున్న మిగతా సీరియల్స్ కూడా కార్తీక దీపం ముందు నిలవలేకపోతున్నాయి.

    తెలివైన దర్శకుడు

    తెలివైన దర్శకుడు

    కార్తీక దీపం సిరియల్ అనగానే అందులో నటించే వారి గురించి అందరి చెబుతుంటారు. ఇక ఆ సిరియల్ స్థాయిలో హిట్టవ్వడానికి టెక్నీషియన్స్ కష్టం కూడా చాలానే ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర తెలివికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఆ దర్శకుడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సీక్వెల్ పై స్పందించారు.

    కార్తీక దీపం 2పై కామెంట్

    కార్తీక దీపం 2పై కామెంట్

    చాలా రోజులుగా కార్తీక దీపం సిరియల్ అయిపోవచ్చని రూమర్స్ గట్టిగానే వస్తున్నాయి. అయితే సిరియల్ బిజినెస్ పరంగా రేటింగ్ పరంగా బాగున్నప్పడు అంత త్వరగా పూర్తవ్వలేవు అని సిరియల్ దర్శకుడు రాజేంద్ర తెలిపారు. బోర్ కొడుతుందని అనుకున్న సమయానికి మళ్ళీ ఏదో ఒక ట్విస్ట్ తో హైలెట్ చేస్తుంటామని కార్తీక దీపం 2పై ఇంకా ఆలోచించలేదని అంటూ.. రేటింగ్ బావున్నంత వరకు సీరియల్ కొనసాగుతుందని ఓపెన్ గానే చెప్పారు.

    పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాల్సింది..

    పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాల్సింది..

    కాపుగంటి రాజేంద్ర దాసరి నారాయణరావు దగ్గర గోరింటాకు సినిమా నుంచి సహాయక దర్శకుడిగా పని చేసుకుంటూ వచ్చాడు. అనంతరం కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశాడు. గీత ఆర్ట్స్ లో అతని మొదటి సినిమా 'డబ్బు భలే జబ్బు'. ఆ సినిమా తరువాత తొలిప్రేమ అనంతరం పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చెయాలి కానీ అనుకోని కారణాల వలన ఆ సినిమా రెండుసార్లు క్యాన్సిల్ అయ్యింది.. అని రాజేంద్ర చెప్పారు.

    మోహన్‌ బాబు అలా చెప్పి ఉంటే సౌందర్య బ్రతికేది

    మోహన్‌ బాబు అలా చెప్పి ఉంటే సౌందర్య బ్రతికేది

    ఇక సౌందర్య మృతి గురించి మాట్లాడుతూ.. మోహన్ బాబు ఆ రోజులో గట్టిగా ఉంటే ఆమె బ్రతికేది. శివశంకర్ సినిమాను డైరెక్ట్ చేసినప్పుడు 65% షూటింగ్ అయిపోగానే సౌందర్య బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమని హెలికాప్టర్ లో వెళ్లారు. సాధారణంగా మోహన్ బాబు మధ్యలో ఎవరిని అలా వెళ్ళనివ్వరు కానీ ఎందుకో సౌందర్య బ్రతిమాలడంతో పంపించేశారు. ఆ రోజు గనక ఆపి ఉంటే సౌందర్య బ్రతికేవారు. ఆమె మరణంతో సినిమా కథను క్లైమాక్స్ ను మార్చేయాల్సి వచ్చింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడం నా కెరీర్ కు దెబ్బ పడింది.. అని రాజేంద్ర వివరణ ఇచ్చారు.

    English summary
    Karthika Deepam director Kapuganti Rajendra about pawan kalyan movie and soundarya death. Continuing the Karthika Deepam story, director Kapuganti Rajendra revealed interesting things about the sequel in a recent interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X