నరేష్ పవిత్రా లోకేష్‌పై కార్తీక దీపం సౌందర్య కామెంట్స్.. ఇబ్బంది పెడితే వదిలిపెట్టనంటూ!
ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య ఎక్కువగా వినిపించిన జంట పేరు వీకే వీకే నరేష్ (VK Naresh), పవిత్ర లోకేష్ (Pavitra Lokesh). వీరు రిలేషన్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ రియల్ మ్యారేజ్ సంగతి ఏమో కానీ వీళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన మళ్లీ పెళ్లి (Malli Pelli) చిత్రం మాత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, పవిత్రల ప్రవర్తనపై పలు కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా నరేష్, పవిత్ర రిలేషన్ పై కార్తీకదీపం ఫేమ్ సౌందర్య అలియాస్ అర్చన అనంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమాల్లోనూ: కార్తీక దీపం సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సీరియల్ లో డాక్టర్ బాబుకి తల్లిగా, వంటలక్కకి అత్తగా సౌందర్య పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు అర్చన అనంత్. బుల్లితెరపై సీరియల్స్ మాత్రమే కాకుండా వెండితెరపై పలు చిత్రాలతో కనువిందు కూడా చేశారు. హీరో, థ్యాంక్యూ బ్రదర్, మాటరాని మౌనమిది సినిమాలతో ఆకట్టుకున్నారు.

అది కనెక్షన్: అయితే తాజాగా మళ్లీ పెళ్లి మూవీ ప్రమోషన్స్ సందర్భంగా నరేష్, పవిత్రలు స్టేజీలపైనే ముద్దులు పెట్టుకుంటూ హల్ చల్ చేశారు. వారి బిహేవియర్ చూసి నవ్వుకున్న వాళ్లు ఉన్నారు.. విమర్శించిన వారు ఉన్నారు. ఇలా వారి ప్రవర్తనపై అర్చన అనంత్ కామెంట్స్ చేశారు. "నరేష్-పవిత్రలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఎవరి ఇష్టం వాళ్లది. పర్సన్ టు పర్సన్ కనెక్షన్ అనేది వేరే. నేను చేసుకునే కనెక్షన్ వేరే విధంగా ఉంటుంది" అని తెలిపారు అర్చన అనంత్.

ప్రపోజ్ చేశారు: "ఒక పర్సన్ మీద ఒకరికి ఇంట్రెస్ట్ కలగడం అనేది వాళ్ల వ్యక్తిగత విషయం. అందులో మన అమ్మనాన్నలకు కూడా సంబంధం ఉండదు. పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ అంతే. చూసేవాళ్లకు కరెక్ట్ అనిపంచకపోవచ్చు. కానీ అది వాళ్ల ఇష్టం. వాళ్లపై కామెంట్స్ చేసే హక్కు ఎదుటివాళ్లకు లేదు. నన్ను కూడా చాలా మంది ఇష్టపడిన వాళ్లు ఉన్నారు. ప్రపోజ్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ నాకు అలా కనెక్షన్ కుదర్లేదు" అని అర్చన చెప్పుకొచ్చారు.

ఆ ఎక్స్ పీరియన్స్ లేదు: "నాకు ప్రపోజ్ చేసిన వాళ్లను నేను డీల్ చేసిన విధానం వేరే. అది పైకి చెప్పలేను. నేనైతే ఇబ్బంది పడలేదు. నన్ను ఇబ్బంది పెడితే వదిలిపెట్టను. నాకు ఇండస్ట్రీలో నెగెటివ్ ఎక్స్ పీరియన్స్ ఏం లేదు. నా వరకూ ఎవరూ రారు. వచ్చేలా ఉంటే నా ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది. అందుకే రారు. వాళ్లని స్టార్టింగ్ నుంచే ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు" అని కార్తీక దీపం సౌందర్య తెలిపారు.

ఫీలింగ్ ఉంటేనే కదా: అర్చన అనంత్ ఇంకా కొనసాగిస్తూ.. "ఊరికే ఎవరో వచ్చి, మీరంటే ఇష్టం, మీరంటే క్రష్ అందే అది వాళ్ల ఫీలింగ్ మాత్రమే. వాళ్లు వారి అభిప్రాయం చెప్పినప్పుడు నేను దాన్ని ఓపెన్ గా తీసుకుని ఆలోచిస్తాను. ఆ ఫీలింగ్ నాలో కూడా ఉంటేనే కదా బాండింగ్ ముందుకు వెళ్తుంది" అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











