అందరినీ వాడేస్తోన్న ఓంకార్.. ‘కార్తీక దీపం’ హిమను కూడా దించేశాడు!

బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌ది సపరేట్ ట్రెండ్. పరిచయం అక్కర్లేని సీరియల్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా కార్తీకదీపం అవుతుంది. అందులోని ప్రతీ పాత్రను ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ బాబు, దీప, వంటలక్క, కార్తీక్, హిమ, శౌర్య ఇలా ప్రతీ ఒక్క పాత్ర అందరికీ సుపరిచితమే. ఇన్ని రోజుల వరకు కార్తీకదీపం యూనిట్ బయట ఎక్కడా కూడా కనిపించకుండా ఉండేది.

బయట రచ్చ..

బయట రచ్చ..

కార్తీక దీపం సీరియల్ నటీనటులు ఈ మధ్య బయట ఈవెంట్లలో రచ్చ చేస్తున్నారు. ఇంత వరకు బయటకు రాని వారంతా ఇప్పుడు స్పెషల్ షోలో సందడి చేస్తున్నారు. ఆ మధ్య దసరా ఈవెంట్‌లో ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ కలిసి రచ్చ చేశారు. అలా మొదటి సారి బయటకు వచ్చి షోలో కనిపించడంతో బాగా క్లిక్ అయింది.

ఇప్పుడు ఇలా..

ఇప్పుడు ఇలా..

కార్తీకదీపం సీరియల్ ద్వారా శౌర్య, హిమలు ఫేమస్ అయ్యారు. అలా అక్కడ వచ్చిన క్రేజ్‌తో స్పెషల్ ఈవెంట్లతో రచ్చ చేస్తారు. కామెడీ స్టార్స్ అనే షోలో హిమ, శౌర్యలను తీసుకొచ్చారు. రేపు గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోన్న ఈ షోలో హిమ, శౌర్యలు దుమ్ములేపేందుకు రెడీగా ఉన్నారు.

ఓంకార్ సైతం..

ఓంకార్ సైతం..

అలా కార్తీకదీపం క్రేజ్‌ను ఓంకార్ కూడా వాడేశాడు. నేటి రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో హిమతో స్పెషల్ పర్ఫామెన్స్ ఇప్పించేస్తున్నాడు. ఎప్పుడూ ఏడుస్తూ ఎమోషనల్ పాత్రలు చేసే హిమ.. సోషల్ మీడియాలో డ్యాన్సులతో సందడి చేస్తుంటుంది. ఇప్పుడు ఏకంగా డ్యాన్స్ ప్లస్ షోలోనే స్టెప్పులు వేసేందుకు రెడీ.

టీఆర్పీ కోసం..

టీఆర్పీ కోసం..

అసలే ఇప్పుడు డ్యాన్స్ ప్లస్ షోకు టీఆర్పీలు రావడం లేదని ఓంకార్ తలలు పట్టుకున్నాడు. అందుకే ఈ వారం ఎక్కువగా సెలెబ్రిటీలను తీసుకొచ్చి అట్రాక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగానే విష్ణుప్రియ, షణ్ముక్, కార్తీకదీపం హిమను తీసుకొచ్చాడు. మరీ ఈ వారమైనా టీఆర్పీలో ఏదైనా మార్పులు కనిపిస్తుందేమో చూడాలి.

నడుము కామెంట్లతో..

నడుము కామెంట్లతో..

ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోల్లో విష్ణుప్రియ డ్యాన్స్ పర్ఫామెన్స్, ఆమె నడుము మీద ఓంకార్, బాబా భాస్కర్ చేసినకామెంట్లు బాగానే వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదల చేసిన హిమ డ్యాన్స్ పర్ఫామెన్స్ ప్రోమో కూడా క్లిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X