Just In
- 38 min ago
తెలుగులో ఆ హీరో అంటేనే ఇష్టమన్న రోజా: అలాంటి వాళ్ల వల్లే సినిమాలు చేయట్లేదంటూ!
- 1 hr ago
యంగ్ హీరో అమర్‌పై ఆరియానా ఆరోపణలు: ఏకంగా ఆమె ఇంటికెళ్లి రచ్చ.. నా ప్రాణం అంటూ అలా!
- 1 hr ago
ప్రముఖ నిర్మాతకు భారీ షాకిచ్చిన నమ్రత శిరోద్కర్: మీ భార్య మిస్టేక్ చేసిందంటూ మహేశ్ బాబుకు ట్వీట్
- 2 hrs ago
పోర్న్ స్టార్‌గా మారిన నోయల్ మాజీ భార్య: ఎస్తర్ నిర్ణయానికి షాకౌతోన్న సినీ ప్రియులు
Don't Miss!
- News
ఏపీ దెబ్బకు దిగొచ్చిన తమిళనాడు ... సంక్రాంతి సమయంలో బస్సుల వివాదం .. తెరపడిందిలా !!
- Automobiles
షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి
- Sports
India vs Australia: భారీ షాక్.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా!!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సీ‘రియల్’ కష్టాలు.. కార్తీకదీపం ఫేమ్ హిమ తండ్రి అలాంటి వాడట.. తల్లి భావోద్వేగం
కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. అందులో వంటలక్క-దీప (ప్రేమీ విశ్వనాథ్), డాక్టర్ బాబు-కార్తీక్ (నిరుపమ్ పరిటాల), హిమ (సహృద), శౌర్య (కృతిక) పాత్రలు ఫుల్ ఫేమస్. అందులోనూ హిమ పాత్రకు అందరూ కనెక్ట్ అవుతుంటారు. తండ్రి కోసం పరితపించే కూతురిగా, తల్లి ప్రేమకు దూరమైన చిన్నారిగా హిమ అద్భుతమైన నటను కనబర్చుతుంది. మొదట్లో తన పాత్ర అంటే తనకు ఇష్టం ఉండేదని కాదని హిమ ఆ మధ్య చెప్పుకొచ్చింది.

మొదట్లో అలా..
పాత్ర డిమాండ్ మేరకు సహృద (హిమ ఒరిజినల్ పేరు)కు కాస్త బ్లాక్ మేకప్ వేశారు. అలా తనను తాను నల్లగా చూసుకోవడంతో మొదట్లో నచ్చేది కాదట.కానీ తరువాత రాను రాను తన పాత్రలోని గొప్పదనం తెలుసుకున్నాక మేకప్‌ను, ఆ రూపాన్ని ఇష్టపడేదట.

సీరియల్‌లో కష్టాలు..
హిమకు కార్తీకదీపం సీరియల్‌లో కష్టాలున్నాయి. పెద్దింట్లో ఉన్నా కూడా తల్లి ప్రేమకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు తండ్రి కూడా దూరం పెడుతున్నాడు. అయితే సీరియల్‌లోనే హిమకు ఇలాంటి కష్టాలున్నాయని అనుకుంటే పొరబాటే. నిజ జీవితంలోనూ హిమకు పుట్టెడు కష్టాలున్నట్టు తెలుస్తోంది.

తాజాగా అలా..
దసరా ఈవెంట్ కోసం కార్తీకదీపంలోని హీరో హీరోయిన్లు వచ్చారు. జాతరో జాతర అనే ఈవెంట్‌లో అమ్మవారుగా ప్రేమీ విశ్వనాథ్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. ఆ ఈవెంట్‌కు ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాలే హైలెట్ అయ్యారు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం ఇద్దరు పిల్లల్ని పట్టుకొచ్చారు.

పిల్లలతో సందడి..
సంక్రాంతికి ఇట్సే ఫ్యామిలీ పార్టీ అంటూ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఇందులో శౌర్య, హిమలు గెస్ట్‌లు విచ్చేశారు. వారే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్‌నుకూడా తీసుకొచ్చారు. ఆ సమయంలోనే హిమ రియల్ లైఫ్ కష్టాలు బయట పడ్డాయి.

తండ్రి వదిలేశాట..
హిమ తల్లి స్టేజ్ మీదే తమ గతాన్ని చెబుతూ అందరినీ ఏడిపించేశారు. హిమ పుట్టిందని ఆడపిల్ల అని చూడకుండానే వదిలేసి వెళ్లిపోయాడంటూ తండ్రి గురించి చెబుతూ హిమ తల్లి కన్నీరు పెట్టేసుకుంది. దీంతో హిమ కూడా కంటతడి పెట్టేసుకుంది. ప్రస్తుతం హిమ తల్లి మాట్లాడిన మాటలు అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేస్తున్నాయి.