Bigg Boss Telugu 6: బిగ్ బాస్ లో 'కార్తీక దీపం' సిస్టర్స్.. ఇక్కడ చెల్లి.. అక్కడ అక్కా..
బుల్లితెరపై అనేక షోలు వచ్చినప్పటికీ అత్యధికంగా పాపులారిటీ సంపాందించుకున్న వాటిలో బిగ్ బాస్ ఒకటి. ఈ రియాలిటీ షో ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటుంది. అయితే ఈ షో సెలబ్రిటీషో గా వర్ణిస్తూ ముందుకొచ్చింది. దానికి అనుగుణంగానే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ అలాగే అందరూ సినీ సెలబ్రిటీలతో సాగింది. ఆ తర్వాత వచ్చిన సీజన్ నుంచి బుల్లితెర తారలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇటీవలే ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో బుల్లితెర నటి కీర్తి భట్ అడుగుపెట్టింది. కీర్తి భట్ కార్తిక దీపం సీరియల్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే కీర్తి భట్ తో పాటు ఆమె అక్క (కార్తిక దీపం సీరియల్ లో) కూడా బిగ్ బాస్ షోలో ఆకట్టుకుంటుంది.

రియాలిటీ ఆధారంగా..
బుల్లితెరపై రకరకాల కాస్సెప్టులతో షోలు వస్తున్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ ఒకటి. ప్రస్తుతం సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది.

ఒకదానికి మించి ఒకటి..
తెలుగులో బిగ్ బాస్ ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా భారీ రెస్పాన్స్‌తో పూర్తి చేసుకున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు..
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కార్తిక దీపం సీరియల్ ఫేమ్ కీర్తి భట్ ఒకరు. కార్తిక దీపం సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు యాక్సిడెంట్ లో చనిపోయినట్లు ఆ మధ్య చూపించిన విషయం తెలిసిందే. వారి మరణం తర్వాత వారి కూతుళ్లు హిమగా కీర్తి భట్, శౌర్యగా అమూల్య గౌడను చూపించారు. హిమ, శౌర్యలతో నెక్ట్స్ జనరేషన్ ఎపిసోడ్ లను కొనసాగించారు ఆ సీరియల్ నిర్వాహకులు.

కన్నడ బిగ్ బాస్ హౌజ్ లో..
బిగ్ బాస్ తెలుగు 6 హౌజ్ లో కీర్తి భట్ కంటెస్టెంట్ గా ఉంటే.. కన్నడ బిగ్ బాస్ హౌజ్ లో అమూల్య గౌడ కంటెస్టెంట్ గా ఉంది. అయితే తెలుగులో కీర్తి భట్ కేవలం కన్నీళ్లు కారుస్తూ ఉంటుందే తప్పా గేమ్ ఆడింది లేదు. కానీ కీర్తితో పోల్చుకుంటే అమూల్య గౌడ బెటర్ గానే గేమ్ ఆడుతోందని టాక్. కన్నడ బిగ్ బాస్ లో అమూల్య అదరగొడుతోందని, టాప్ 5కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.

ఈ వారామా.. తర్వాతి వారామా అన్నట్లుగా..
కానీ ఇక్కడ కీర్తి మాత్రం ఇంటి నుంచి బయటకు ఈ వారామా.. తర్వాతి వారామా అన్నట్లుగా ఉంది. మనసిచ్చి చూడు, కార్తిక దీపం వంటి సీరియల్స్ తో మంచి పాపులారిటీ దక్కించుకున్న కీర్తి భట్ కు బిగ్ బాస్ షో కలిసి రాలేదనే చెప్పవచ్చు. బిగ్ బాస్ షోలో చాలా మంది పాపులర్ సెలబ్రిటీల్లానే కీర్తి భట్ కూడా తన మార్క్ చూపించలేకపోయింది.

అక్క శౌర్యగా అమూల్య గౌడ..
ఇదిలా ఉంటే కార్తిక దీపం సీరియల్ లో అక్క శౌర్యగా అమూల్య గౌడ నటిస్తే చెల్లి హిమగా కీర్తి భట్ నటించింది. డాక్టర్ బాబు, వంటలక్క మరణం తర్వాత ఈ అక్కా చెళ్లెల్ల జెనరేషన్ తో సీరియల్ ను కొనసాగించారు. కానీ అకస్మాత్తుగా మళ్లీ డాక్టర్ బాబు, వంటలక్క బతికి వచ్చినట్లు ఈ ఇద్దరితోపాటు మోనిత కలిపి సీరియల్ ను కొనసాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











