twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె కోరడంతో పొడిపించుకోవాల్సి వచ్చింది.. కార్తీకదీపం డాక్టర్ బాబు మామూలోడు కాదు!

    |

    తెరపై కనిపించే సెలెబ్రిటీలకు బయట కనిపించే సెలెబ్రిటీలకు ఎంతో తేడా ఉంటుంది. తెరపై పాత్రల్లో జీవిస్తూ కనిపిస్తారు.. కానీ బయట తమ ఒరిజినాలిటీతో ఉంటారు. ఆ రెంటికి ఒక్కోసారి బేధం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. అయితే కార్తీకదీపం డాక్టర్ బాబు ఫేమ్ నిరుపమ్ పరిటాల మాత్రం పూర్తి భిన్నంగా ఉంటారు. ఆ సీరియల్‌లో కార్తీక్ పాత్రలో నిరుపమ్ ఎంతో గంభీరంగా ఉంటాడు. కానీ బయట మాత్రం ఎంతో సరదాగా ఉంటాడు.

     స్పెషల్ షోల్లో..

    స్పెషల్ షోల్లో..

    నిరుపమ్ పరిటాల ఎక్కువగా స్పెషల్ షోల్లో కనిపించడు. తన సీరియల్స్ పని మాత్రమే చూసుకుంటూ ఉంటాడు. అయితే ఈ మధ్యే స్పెషల్ షోలు, ఈవెంట్లలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. తాజాగా కార్తీకదీపం యూనిట్ మొత్తం స్టార్ట్ మ్యూజిక్ షోలో సందడి చేసింది.

    ఆడుకున్న సుమ..

    ఆడుకున్న సుమ..

    సుమ నిర్వహిస్తోన్న స్టార్ట్ కామెడీ షోలో కార్తీకదీపం ఫేమ్ సహృద, కృతిక, నిరుపమ్ వంటి వారంతా పాల్గొన్నారు. ఇందులో నిరుపమ్‌ను సుమ ఓ రేంజ్‌లో ఆడుకుంది. దీపను ఎందుకు అలా ఏడిపిస్తున్నావ్ అంటూ అపరిచితుడు స్టైల్లో భయపెట్టేసింది.

     ఇప్పుడు ఇలా..

    ఇప్పుడు ఇలా..

    స్టార్ట్ మ్యూజిక్ షోలో డమ్ షెరాడ్స్ లాంటి ఓ ఆట ఉంటుందని తెలిసిందే. ఎదుటి వారికి పాటలు వినిపించకుండా హెడ్ సెట్స్ పెడతారు.. మిగతా వారు ఆ పాటను తెలిసేలా క్లూలు ఇస్తూ ఉంటారు. అలా పచ్చ బొట్టేసినా సాంగ్‌ను సహృద యాక్ట్ చేసి చూపించగా.. నిరుపమ్ కరెక్ట్‌గా గెస్ చేస్తాడు.

    అలా పంచ్..

    అలా పంచ్..

    నిరుపమ్ అలా చెప్పడంతో పావుశేరు భాగ్యం పాత్రదారి కౌంటర్ వేస్తుంది. ఆయనకు అది అలవాటు అందుకే చెప్పాడంటూ పంచ్ వేసింది. ఒళ్లంతా పచ్చబొట్లే అంటూ అసలు విషయం చెప్పేసింది. అయితే అలాంటిదేమీ కాదని ఒకటే ఉందని చూపించాడు నిరుపమ్.

     ఆమె కోరుకుంది..

    ఆమె కోరుకుంది..

    మీరే పొడిచారా? ఆమె పొడిచిందా? అని సుమ మరో కౌంటర్ వేసింది. ఆమె కోరుకుంది నేను పొడిపించుకోవాల్సి వచ్చింది అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు. మొత్తానికి కార్తీకదీపం యూనిట్ మాత్రం నేటి ఎపిసోడ్‌లో దుమ్ములేపారు. నిరుపమ్ పరిటాల సీరియల్ నటి మంజులను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె కూడా ఇప్పుడు పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.

    English summary
    Karthika Deepam Fame nirupam Paritala about His tattoo,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X