డాక్టర్‌ బాబుకి ఆవిడంటే అంత పిచ్చా?.. ఆ ప్లేస్‌లో టాటూతో షాకిచ్చిన నిరుపమ్

గతంలో పోలిస్తే ప్రస్తుతం బుల్లితెర ఇండస్ట్రీ బాగా విస్తరిస్తోంది. ఓటీటీల రాకతో భారతదేశంలో టెలివిజన్ రంగానికి మరింత క్రేజ్ లభిస్తోంది. సినీనటులతో సమానంగా బుల్లితెర నటీనటులకు క్రేజ్ లభిస్తుండటంతో చాలా మంది వెండితెరపై అడుగుపెట్టడానికి బుల్లితెరను ఓ ఫ్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో స్టార్స్‌గా వెలుగొందుతున్న పలువురు తొలుత స్మాల్ స్క్రీన్‌పై మెరిసిన వారే. తెలుగునాట బుల్లితెరపై సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు నిరుపమ్ పరిటాల.

ఓంకార్ తనయుడిగా ఎంట్రీ

దివంగత రచయిత, నటుడు ఓంకార్ పరిటాల కుమారుడే నిరుపమ్. విజయవాడలో పుట్టి పెరిగిన ఆయన చెన్నైలో చదువుకున్నారు. తండ్రి బాటలోనే సినీరంగంలో అడుగుపెట్టిన నిరుపమ్.. 2009లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఫిటింగ్ మాస్టర్ సినిమాలో నెగిటివ్ రోల్‌లో నటించారు. ఆ తర్వాత 2014లో రభస సినిమాలో కనిపించారు. తండ్రి లాగే డైలాగ్స్ రాయడాన్ని ఇష్టపడే నిరుపమ్.. 2017లో నెక్ట్స్ నువ్వే సినిమాకు మాటలు అందించారు.

karthika deepam fame nirupam paritala birthday gift to his wife manjula paritala

కార్తీక దీపంతో దేశవ్యాప్తంగా గుర్తింపు

ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్‌తో బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన నిరుపమ్.. బ్రహ్మముడి (జెమినీ టీవీ), హిట్లర్ గారి పెళ్లాం, కుంకుమపువ్వు, మూగమనసులు, కార్తీక దీపం, అత్తారింటికి దారేది, కలవారి కోడళ్లు, కాంచన గంగ, ప్రేమ, రాధకు నీవెర ప్రాణం సీరియల్స్‌లో నటించారు. అయితే మా టీవీలో ప్రసారమైన కార్తీక దీపంతో నిరుపమ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్ దెబ్బకు స్టార్ హీరోల సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. కొద్దినెలల పాటు తెలుగులో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్‌ను పక్కకునెట్టి కార్తీక దీపం నెంబర్‌వన్‌గా రూల్ చేసింది. ఒక్క తెలుగులోనే కాకుండా టీఆర్పీ విషయంలో ఏకంగా ఇండియాలోనే టాప్‌ ప్లేస్‌ను దక్కించుకుంది కార్తీక దీపం.

మంజులను ప్రేమించి పెళ్లాడిన నిరుపమ్

సీరియల్స్‌తో పాటు పలు షోలు, ఈవెంట్స్ , వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు నిరుపమ్. హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌కు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో వెబ్ సిరీస్, ఓటీటీలకు ఆదరణ పెరుగుతుందని చెబుతున్న ఆయన ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. కర్ణాటకకు చెందిన బుల్లితెర నటి మంజులను నిరుపమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చంద్రముఖి సీరియల్ చేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత మంజుల నటనకు గుడ్‌బై చెప్పి భర్త, కుమారుడిని చూసుకుంటున్నారు.

భార్యకు సర్‌ప్రైజ్

షూటింగ్స్ లేనప్పుడు కుటుంబంతో గడపటానికి సమయం కేటాయించే నిరుపమ్.. వీలున్నప్పుడల్లా ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్తుంటాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆయన తన సీరియల్స్, సినిమాలు, ఇతర విషయాలను షేర్ చేస్తుంటారు. తాజాగా నిరుపమ్ తన భార్యపై ప్రేమను చాటుకున్నాడు. మే 9న మంజుల పుట్టినరోజు కావడంతో ఆమె పేరుని మోచేతిపై టాటూ వేయించుకున్నాడు. ఇదే తాను మంజులకు ఇస్తున్న సర్‌ప్రైజ్ అని చెప్పి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X