Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డాక్టర్ బాబులో ఈ యాంగిలో కూడానా?.. నీ రూపమే అంటూ నిరుపమ్ డైలాగ్
బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌ది ఓ చరిత్ర. ఓ సీరియల్, అందులోని పాత్రలు, పాత్రధారులు ఇంతగా ఫేమస్ అవుతారని, ఇంతలా గుర్తింపు వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ హవా ఓ రేంజ్లో ఉంది. అలా సీరియల్, నటీనటులకు క్రేజ్ పీక్స్‌లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అందరూ ట్రై చేస్తున్నట్టున్నారు. ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్లో తప్పా మరెక్కడా కనిపించని డాక్టర్ బాబు, దీపలు ఇప్పుడు బయట కూడా రచ్చ చేస్తున్నారు.
బుల్లితెరపై స్పెషల్ షో..
బుల్లితెరపై పండులకు వచ్చే స్పెషల్ ఈవెంట్లు, స్పెషల్ షోల్లో నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్, కృతిక, సహృద వంటి వారంతా రచ్చ చేస్తున్నారు. అంతే కాకుండా యాడ్స్‌తోనూ బాగానే సంపాదిస్తున్నారు. డాక్టర్ బాబు, దీపలు ప్రకటనల్లోనూ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
స్టార్ మా ప్లానింగ్..
బిగ్ బాస్ కంటెస్టెంట్లు, తమ సీరియల్ నటీనటులతో స్టార్ మా కొత్త కొత్త షోలను ప్లాన్ చేస్తోంది. ఈ మధ్యే రెండు వారాలు బిగ్ బాస్ కంటెస్టెంట్లతో షోను ప్లాన్ చేశారు. బిగ్ బాస్ ఉత్సవం పేరిట రెండు ఆదివారాలు బాగానే ఎంటర్టైన్ చేశారు. మళ్లీ ఇప్పుడు మరో కొత్త షోతో ముందుకు వచ్చారు.
100 పర్సెంట్ లవ్..
రీల్ జంటలు, రియల్ జంటలు అంటూ ఆరు జంటలను కొత్త ప్రోగ్రాంను డిజైన్ చేశారు. 100 పర్సెంట్ లవ్ అంటూ రాబోతోన్న ఈ షోల్లో ప్రభాకర్, నిరుపమ్, అమ్మ రాజశేఖర్ వంటి వారు రియల్ కపుల్స్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చారు. అవినాష్ అరియానా, దీప్తి సునయన షణ్ముఖ్ వంటివారు రీల్ కపుల్ లిస్ట్‌లో వచ్చారు.
డాక్టర్ బాబు అలా..
అయితే డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల తన భార్య మంజుల పరిటాలతో కలిసి 100 పర్సెంట్ లవ్ షోలో సందడి చేశారు. అయితే తన భార్య మీదున్న ప్రేమను కవిత్వం రూపంలో చెప్పేశాడు. మొత్తానికి నిరుపమ్‌లో ఓ కవి కూడా ఉన్నాడని అందరికీ తెలిసిపోయింది.
నీరూపమే..
నిన్ను చూసిన క్షణం నా కళ్లు స్కానర్‌లా మారిపోయాయ్.. నీ అందాన్ని నా మెదడులో ముద్రించి.. నా గుండెల్లో దాచుకున్నా.. నా పేరు నిరుపమ్.. నా మనసు నిండా నీ రూపమే అంటూ అదిరిపోయేలా చెప్పాడు. తన భార్య మీదున్న ఈ ప్రేమను ఇలా అందంగా మాటల్లో చెప్పేశాడు. ఈ షో ఫిబ్రవరి 21న సాయంత్రం ఆరుగంటలకు ప్రసారం కానుంది.