కార్తీకదీపం డాక్టర్‌బాబుకు బెదిరింపులు.. వన్స్ ఐ స్టెప్ ఇన్ అంటూ యాంకర్ సుమ రచ్చ

తెలుగు ప్రజలకు రెండింటి గురించి పరిచయం చేయనక్కర్లేదు. అందులోనూ మరీ ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. సుమ చేసే యాంకరింగ్.. కార్తీక దీపం సీరియల్ సృష్టించిన రికార్డుల.. సృష్టిస్తోన్న సంచలనాల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ రెండూ ఒకే చోట కనిపిస్తే అది కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది. తాజాగా సుమ హోస్ట్‌గా వస్తోన్న స్టార్ట్ మ్యూజిక్ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. అందులో కార్తీకదీపం యూనిట్ సందడి చేసింది.

సుమ చేతుల్లోకి..

సుమ చేతుల్లోకి..

స్టార్ట్ మ్యూజిక్ అనే ఈ షోను మొదటగా ఝాన్సీ నిర్వహించింది. కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఆ తరువాత శ్రీముఖి నడిపించింది. స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ అంటూ హంగామా చేసింది. కానీ షో మాత్రం సక్సెస్ కాలేదు. ఇలా చివరకు అది సుమ చేతుల్లోకి వచ్చింది.

మొదటి ఎపిసోడ్ అలా..

మొదటి ఎపిసోడ్ అలా..

గత ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ షోలో మొదటి ఎపిసోడ్‌ బాగానే క్లిక్ అయింది. గ్రాండ్‌గా ఉండేందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్లను పట్టుకొచ్చారు. నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో గ్రూపులుగా బాగానే ఫేమస్ అయిన సోహెల్, మెహబూబ్, అఖిల్‌లను.. హారిక,నోయల్, లాస్యలను సుమ తీసుకొచ్చింది.

రెండో ఎపిసోడ్‌లో రచ్చ..

రెండో ఎపిసోడ్‌లో రచ్చ..


అయితే వచ్చే ఆదివారం ప్రసారం కానున్న రెండో ఎపిసోడ్‌లో కార్తీకదీపం యూనిట్ రచ్చ చేసింది. డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రల్లో అదరగొట్టిన నిరుపమ్, హిమ (సహృద), శౌర్య (కృతిక), సౌందర్య (అర్చన) వంటి వారంతా గెస్ట్‌లు వచ్చారు. వారిని సుమ ఓ ఆట ఆడుకున్నట్టు కనిపిస్తోంది.

కార్తీకదీపంపై సెటైర్..

కార్తీకదీపంపై సెటైర్..

యాంకర్ సుమ తన షోలో కార్తీకదీపంపై సెటైర్ వేసింది. ఇంకెన్ని రోజులు దీపను ఏడిపిస్తావ్.. ఇంకెన్నాళ్లు బాధపెడతావ్ అంటూ కత్తి చూపిస్తు నిరుపమ్‌ను బెదిరించింది. ఆ దెబ్బతో నిరుపమ్ సెంట్‌లోంచి పారిపోయి వెనక నుంచి వచ్చేశాడు. అయినా కూడా సుమ ఆయన్ను వదల్లేదు.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
 అపరిచితుడు స్టైల్లో..

అపరిచితుడు స్టైల్లో..

ఇక యాంకర్ సుమ దొరికిందే చాన్స్ అనుకుని అపరిచితుడు స్టైల్లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది. తాను అడుగుపెట్టనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ బాలయ్య రేంజ్‌లో డైలాగ్ కొట్టేసింది. ఈ మేరకు వదిలిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X