ఆ సీరియల్ వల్ల చాలా నష్టపోయాను.. కార్తీక్ దీపం డాక్టర్ బాబు చేదు అనుభవం

తెలుగు బుల్లితెర ప్రేక్షకుల డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'కార్తీకదీపం' సీరియల్‌తో ఆయన సంపాదించుకున్న క్రేజ్ సాధారణం కాదు. ఈ సీరియల్ ద్వారా ఆయనకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో బుల్లితెర శోభన్ బాబుగా కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇప్పటికీ చాలామంది ఆయనను అసలు పేరుతో కాకుండా "డాక్టర్ బాబు"గానే పిలుస్తుంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిరుపమ్, తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఓ సీరియల్ వల్ల తీవ్రంగా నష్టపోయాననీ, ఆర్థికంగా కూడా దెబ్బపడిందని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఇంతకీ ఏమైందంటే?

నిరుపమ్ మాట్లాడుతూ.. తన సీరియల్ జర్నీ 'చంద్రముఖి' సీరియల్‌తో ప్రారంభమైందని తెలిపారు. అయితే మొదట తన కుటుంబ సభ్యులకు తాను నటుడిగా మారడం అస్సలు ఇష్టం లేదని చెప్పారు. "మా నాన్నగారి కోరిక నన్ను వేరే ప్రొఫెషన్‌లో చూడాలని. కానీ ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితుల ప్రభావంతో ఇండస్ట్రీలోకి రావాల్సి వచ్చింది" అంటూ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి స్నేహితులు, పరిశ్రమలోని కొంతమంది ప్రముఖులు తనకు ఎంతో సపోర్ట్ చేశారని తెలిపారు. "నా పోర్ట్‌ఫోలియోను ఈటీవీకి పంపించింది కూడా నాన్నగారి ఫ్రెండ్సే. వాళ్ల ప్రోత్సాహంతోనే నేను ఈ రంగంలోకి అడుగుపెట్టాను" అంటూ గుర్తు చేసుకున్నారు.

Karthika Deepam fame Nirupam Paritala Opens Up About Financial Losses and Struggles Behind TV Serials

ఇక సినిమాల్లో నటించే ఆసక్తి ఉందా అని అడగగా.. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా వెంటనే సినిమాల వైపు వెళ్లడం కాస్త కష్టమేనని చెప్పారు. అయితే మంచి పాత్ర వస్తే మాత్రం ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. "నటన నాకు చాలా ఇష్టం. మంచి పాత్ర దొరికితే సినిమాల్లో కూడా నటిస్తాను" అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక తన భార్య మంజుల గురించి కూడా నిరుపమ్ సరదాగా మాట్లాడారు. "మీ ఆవిడకు మీ మీద అసూయ ఎప్పుడైనా కలిగిందా? మీకు ఎక్కువ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఫీల్ అవుతుందా?" అని అడగగా.. "ఒకప్పుడు ఉండేది.. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. సోషల్ మీడియాలో కామన్‌గా ప్రపోజల్స్ వస్తుంటాయి. కానీ వాటిని మేము పెద్దగా పట్టించుకోము. ఆమె కూడా చాలా లైట్‌గా తీసుకుంటుంది" అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

ఇక 'కార్తీకదీపం' సీరియల్ గురించి మాట్లాడుతూ నిరుపమ్ చాలా ఎమోషనల్ అయ్యారు. "ఈ సీరియల్‌లో ఉన్న కథ, భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అత్త తన కొడుకుకు అందమైన కోడలు రావాలని కోరుకుంటుంది. కానీ హీరో మాత్రం బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యాన్ని చూసి హీరోయిన్‌ను ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఆమెను నిందించడం, మళ్లీ ఆమెకు అండగా నిలవడం కథలో ప్రధాన అంశాలు" అంటూ వివరించారు. మిగతా సీరియల్స్‌తో పోలిస్తే 'కార్తీకదీపం' కథ పూర్తిగా భిన్నంగా ఉండటమే దాని విజయానికి కారణమని చెప్పారు. "కోట్లాది మంది ప్రేక్షకులు ఆ సీరియల్‌ను ఆదరించారు. అందుకే ఇప్పుడు 'కార్తీకదీపం 2' కూడా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 600 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది" అని తెలిపారు.

ఈ సీరియల్‌కు టైటిల్ సాంగ్ కూడా భారీ ప్లస్ అయిందని చెప్పారు. 'చిన్న పిల్లలు కూడా ఆ పాటను హమ్మింగ్ చేస్తూ వీడియోలు పెడుతుంటారు. ప్రేక్షకులు మీమ్స్ చేస్తూ తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. ఒక సీరియల్ నటుడిని సినిమా స్టార్‌లా అభిమానించడం నా అదృష్టం' అంటూ నిరుపమ్ భావోద్వేగానికి గురయ్యారు. ఇక సీరియల్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుతూ అనేక కష్టాలను బయటపెట్టారు. "చాలామంది సీరియల్ కదా.. ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు అనుకుంటారు. కానీ నిజానికి సినిమా కంటే సీరియల్ నిర్మాణం చాలా కష్టం. కొత్త సీరియల్ ప్రారంభించాలంటే దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చవుతుంది" అంటూ తెలిపారు.

అంతేకాదు, పెట్టిన డబ్బులు తిరిగి రావాలంటే కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు సమయం పడుతుందని చెప్పారు. "ఒకవేళ రేటింగ్స్ రాకపోతే.. ప్రేక్షకులు ఆదరించకపోతే మాత్రం నిర్మాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది" అంటూ సీరియల్ ఇండస్ట్రీలో ఉన్న రిస్క్‌ను వివరించారు. ఇలాంటి చేదు అనుభవం తనకు 'పల్లకిలో పెళ్లికూతురు' సీరియల్ సమయంలో ఎదురైందని చెప్పారు. "ఆ సీరియల్‌ను దాదాపు 200 ఎపిసోడ్స్ వరకు షూట్ చేశాం. కానీ మేము అనుకున్నంత రీచ్ రాలేదు. దీంతో ఛానెల్ వాళ్లు నేరుగా 'ఈ సీరియల్ వల్ల బిజినెస్ జరగడం లేదు.. ఆపేయండి' అని చెప్పేశారు" అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

ప్రస్తుతం ప్రైమ్ టైమ్ స్లాట్స్‌లో 'కార్తీకదీపం 2', 'పొదరిల్లు' వంటి సీరియల్స్ మంచి ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. అలాగే తాను నిర్మించే సీరియల్స్‌లో తానే నటించడం కూడా చాలా కష్టమని చెప్పారు. "నటుడిగా, నిర్మాతగా రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు" అంటూ తన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం నిరుపమ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సీరియల్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్థిక ఒత్తిళ్లు, నిర్మాతలు ఎదుర్కొనే నష్టాల గురించి ఆయన చెప్పిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X