వాళ్లకు పోటీ అవుతానని... సీరియల్ నటుడినని దారుణంగా.. కార్తీక దీపం డాక్టర్ బాబు ఎమోషనల్

కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్‌ కార్తీక్ బాబుగా మహిళా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నిరుపమ్ పరిటాల. ఎన్ని సీరియల్స్‌లో నటించినా జనం మాత్రం ఆయనను డాక్టర్ బాబుగానే గుర్తు పెట్టుకున్నారంటే ఆ పాత్రపై నిరుపమ్ వేసిన ముద్రను అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ క్రేజ్, ఈ పాపులారిటీ ఇదంతా ఆయనకు రాత్రికి రాత్రి వచ్చింది కాదు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదురైనా కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు. దివంగత రచయిత ఓంకార్ తనయుడే నిరుపమ్. సినీ నేపథ్యం ఉన్నప్పటికీ కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి నిరుపమ్ శ్రమించారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిరుపమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

టీవీ నటుడినని ఆఫర్లు ఇవ్వలేదు
పాతికేళ్ల వయసులో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. ఆ టైంలో ఎవరైనా చేయి అందిస్తే బాగుండు అనిపిస్తుంది. ఇండస్ట్రీలో అందరూ తెలిసినా వాళ్ల దగ్గరికి వెళితే పలకరించి ఏంటమ్మా అంటారు తప్పించి ఎవరూ అవకాశాలు ఇవ్వరు. రెండు మూడు సినిమాలలో అవకాశాలు వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యాయి. కేవలం నేను టీవీ ఇండస్ట్రీలో చేస్తున్నాననే ఒకే ఒక్క కారణం. ఆడిషన్స్ చేసి సూట్ అవ్వడం లేదని చెబితే వేరు. కానీ నేను టీవీలో నటిస్తుండటంతో ఆడిషన్స్ కూడా వద్దులే అని పట్టించుకోలేదు. ఆ సమయంలో ఇంటికి వెళ్లి ఏడ్చాను.. మా అమ్మగారికి కూడా తెలియదు. నాన్నగారి ఫోటో ముందు నిలబడి నాకే ఎందుకిలా? ఏంటిది? అని ఆ దు:ఖం ఆపుకోలేకపోయేవాడిని అని నిరుపమ్ తెలిపారు.

Karthika Deepam fame Nirupam Paritala Opens Up About Struggles Behind His Doctor Babu Stardom

వాళ్ల పక్కనే కూర్చొవాలంటే సిగ్గు
నేను కొన్ని ఆడిషన్స్‌కి కానీ, కాస్టింగ్ కాల్స్‌కి కానీ వెళ్లినప్పడు .. మనలాగే కొత్త పిల్లలు ఆల్బమ్స్ పట్టుకుని కూర్చొనేవారు. వాళ్లతో పాటు మనం కూడా కూర్చొంటే వాళ్లు మన వంక చూస్తారు. పైకి మాట్లాడకపోయినా సార్ ఏంటీ మీరు కూడా వచ్చారు అని ఓ లుక్ ఇస్తారు. ఆ సమయంలో చాలా సిగ్గేసిది.. నేను అది ఫేస్ చేయలేక ఆడిషన్స్‌కి వెళ్లేవాడిని కాదు. నాకు క్యారెక్టర్ ఇవ్వండి అని వెళ్లి అడగటం ఇష్టం ఉండేది కాదు. యాక్టింగ్ అనేది లేకపోతే డైలాగ్స్ అయినా రాసుకోవచ్చనే కాన్ఫిడెన్స్ ఉంది. నాన్నగారు బిజీగా ఉన్నప్పుడు కొన్ని సీన్ పేపర్స్ నాకు ఇచ్చి ఇది రాయమని చెప్పేవారు. నేను రాసిన వాటిని కరెక్ట్ చేసి ఇచ్చేవారు. అలా చిన్నప్పుడే నాన్న నా మైండ్‌లో యాక్టింగ్, రైటింగ్ నాటారు.

డాక్టర్ బాబు అంటూ అల్లరి
వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ఓ వెబ్ సిరీస్‌ను నీత్యామీనన్‌తో కలిసి పనిచేశా. ఆ సమయంలో రాజమండ్రిలో ఓ షెడ్యూల్‌కు వెళ్లినప్పుడు లేడీస్ డాక్టర్ బాబు అంటూ పిలిచేవారు. అప్పటి వరకు నిత్యా గారికి నేనొక నటుడిగానే తెలుసు.. అయితే ఆ సమయంలో మాత్రం ఈ డాక్టర్ బాబు ఎవరు? జనాలు ఏంటీ అని నిత్య అనుకుని కనుక్కుంటే మన గురించి తెలిసింది. ఆవిడ నేషనల్.. మనం లోకల్. ఆమె మేనేజర్ వచ్చి ఈ జనాలేంటీ? ఈ గోల ఏంటీ? అని అడుగుతున్నారని చెప్పాడు. రెండ్రోజుల తర్వాత నిత్యామీనన్ కూడా డాక్టర్ బాబు అని పిలవడం మొదలుపెట్టారు.

సీరియల్స్ స్క్రిప్ట్ వాళ్ల చేతిలో
జనాలు సీరియల్స్ చూడమని అంటారు కానీ వాటి గురించి మాట్లాడతారు. బయటికి వెళ్లినప్పుడు చివరికి మీ ఇద్దరు కలుస్తారా అని అడుగుతారు. కలుస్తారో లేదో నీకు ఎలా తెలుసు? టీవీ సీరియల్స్, స్టోరీస్ ఇప్పుడు రైటర్స్ చేతుల్లో నుంచి కూడా వెళ్లిపోయాయి ఛానెల్స్ జ్యోక్యం ఎక్కువైపోయింది. ఛానెల్స్‌లో క్రియేటివ్ హెడ్స్.. ప్రతి ప్రాజెక్ట్‌కి ఒకరిద్దరు ఛానెల్ వాళ్లు ఉంటారు. స్టోరీ, స్క్రీన్ ప్లే అనేది వాళ్ల నుంచి అప్రూవ్ అయి ప్రొడక్షన్ చేతికి వచ్చి షూటింగ్ చేస్తారు. మేధావులంతా కూర్చొని అప్రూవ్ చేస్తారు.. కొన్ని సందర్భాల్లో బాలేదని చెబుతాం, కొన్ని మారుస్తారు.. కొన్ని గుడ్డిగా చేసుకుంటూ వెళ్లిపోవడమేనని నిరూపమ్ పరిటాల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు బుల్లితెర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X