ఆ బిజినెస్‌లోకి డాక్టర్ బాబు.. హీరోలను మించిన ప్లానింగ్‌తో బుల్లితెర సూపర్‌స్టార్!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని నటీనటులు పక్కాగా ఫాలో అవుతున్నారు. తమ ముందు తరాల వారి ఆర్ధిక కష్టాలు, దుర్బర పరిస్ధితులను చూసి బుద్ధి తెచ్చుకుంటున్నారు. నిలకడలేని చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే చిన్నా పెద్ద నటులు తమకు వచ్చిన దానిలోనే తెలివిగా దాచుకుంటున్నారు. బంగారం, రియల్ ఎస్టేట్, షేర్స్ ఇలా ఎలా కుదిరితే అలా పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నారు. మరికొందరైతే వ్యాపారాలను ప్రారంభించి రెండు చేతులా సంపాదిస్తున్నారు. తాజాగా తెలుగు బుల్లితెరపై స్టార్‌గా వెలుగొందుతున్న నిరుపమ్ పరిటాల కొత్త వ్యాపారంలోకి దిగారు ఈ వివరాల్లోకి వెళితే..
ఈవీవీ చేతుల మీదుగా లాంచింగ్
దివంగత రైటర్, సినీనటుడు ఓంకార్ తనయుడే నిరుపమ్ పరిటాల. చదువు తర్వాత 2009లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఫిటింగ్ మాస్టర్ సినిమాలో నటించారు. ఆ తర్వాత 2014లో రభస సినిమాలో కనిపించారు. 2017లో నెక్ట్స్ నువ్వే సినిమాకు మాటలు అందించారు. సినీరంగంలో అంతగా లక్ కలిసి రాకపోవడంతో బుల్లితెరపై ఫోకస్ పెట్టారు నిరుపమ్ పరిటాల.

కార్తీక దీపంతో స్టార్ డమ్
ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. మా టీవీలో ప్రసారమైన కార్తీక దీపంతో నిరుపమ్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారారు. కుటుంబ ప్రేక్షకులకు ఆయన బాగా దగ్గరయ్యారు. ఒక్క తెలుగులోనే కాకుండా టీఆర్పీ విషయంలో ఏకంగా ఇండియాలోనే టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది కార్తీక దీపం. తర్వాత బ్రహ్మముడి (జెమినీ టీవీ), హిట్లర్ గారి పెళ్లాం, కుంకుమపువ్వు, మూగమనసులు, అత్తారింటికి దారేది, కలవారి కోడళ్లు, కాంచన గంగ, ప్రేమ, రాధకు నీవెర ప్రాణం సీరియల్స్‌లో నటించారు నిరుపమ్.
నిరుపమ్‌కు భారీ రెమ్యునరేషన్
చంద్రముఖి సీరియల్‌లో తన సహనటి మంజులతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత మంజుల నటనకు గుడ్‌బై చెప్పి భర్త, కుమారుడిని చూసుకుంటున్నారు మంజుల. తెలుగు బుల్లితెరపై అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటుల్లో నిరుపమ్ కూడా ఒకరు. ఒక్కరోజుకే 30 వేల రూపాయలు పారితోషికంగా తీసుకుంటారని అంచనా. ప్రస్తుతం కార్తీక దీపం 2, హిట్లర్ గారి పెళ్లాం, కుమారి శ్రీమతి సీరియల్స్‌లో నటిస్తున్న నిరుపమ్.. ఈ మూడింటి ద్వారా రోజుకు లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తున్నారని అంచనా. అయితే సీరియల్స్‌తో పాటు పలు షోలు, ఈవెంట్స్ , వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు నిరుపమ్. హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌కు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
వ్యాపారంలోకి నిరుపమ్ దంపతులు
సినీతారలను చూసి బుల్లితెర స్టార్స్ కూడా వ్యాపారాలలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిరూపమ్ తన భార్య మంజులతో కలిసి కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఈ దంపతులిద్దరూ తాము క్లాత్ బిజినెస్ ప్రారంభిస్తున్నట్లు యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించారు. శ్రీవల్లి కలెక్షన్స్‌తో చేతులు కలిపి చందానగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. జూలై 30వ తేదీన ఈ స్టోర్ లాంచ్ చేస్తున్నామని.. మా ప్రయత్నం విజయవంతం కావాలని ఆశీర్వదించాలని నిరుపమ్- మంజులలు ప్రేక్షకులను కోరారు. ప్రస్తుతం వీరిద్దరూ స్టోర్‌కు కావాల్సిన ఏర్పాట్లు, స్టాక్ సిద్దం చేసుకోవడం వంటి పనులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నిరుపమ్ వ్యాపారంలో సక్సెస్ కావాలని ఆయన అభిమానులు విషెస్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications










