భార్యతో బీచ్‌లో పబ్లిక్‌గా అలాంటి పనులు ... డాక్టర్ బాబు మామూలోడు కాదుగా
మా టీవీలో ప్రసారమైన డైలీ సీరియల్ కార్తీక దీపం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ధారావాహిక దెబ్బకు స్టార్ హీరోల సినిమాలు, క్రేజీ షోలు అడ్రస్ లేకుండా పోయాయి. నెలల పాటు తెలుగులో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్‌ను పక్కకునెట్టి కార్తీక దీపం నెంబర్‌వన్‌గా నిలిచింది. ఒక్క తెలుగులోనే కాదు ఏకంగా ఇండియాలోనూ టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. ఈ సీరియల్‌లో నటించిన వారందరికీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కడంతో పాటు ఎన్నో ఆఫర్లు అందుకున్నారు.
కార్తీక దీపంలో హీరో హీరోయిన్లుగా నటించిన నిరూపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్‌లకు స్టార్స్‌తో సమానంగా క్రేజ్ దక్కింది. నిరుపమ్ అయితే పలు ఛానెల్స్‌లో ప్రసారమయ్యే సీరియల్స్‌తో తీరిక లేనంత బిజీగా ఉంటున్నాడు. అద్భుతమైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ చేత బుల్లితెర శోభన్ బాబు అనిపించుకున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత ఓంకార్ కుమారుడే నిరుపమ్ పరిటాల. సీరియల్స్‌తో పాటు పలు షోలు, ఈవెంట్స్ , వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.

ఇకపోతే.. మరో బుల్లితెర నటి మంజులను నిరుపమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చంద్రముఖి అనే సీరియల్ చేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత మంజుల సీరియల్స్‌కు దూరమై భర్త, కుమారుడిని చూసుకుంటున్నారు. వీరిద్దరి వివాహం జరిగి 15 ఏళ్లు పూర్తి కావడంతో మంజుల - నిరుపమ్‌లు గతేడాది అక్టోబర్ 13న మరోసారి సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.
నిరుపమ్ ప్రస్తుతం కార్తీక దీపం 2, మూగమనసులు, హిట్లర్ గారి పెళ్లాం వంటి సీరియల్స్‌లో నటిస్తున్నారు. వీటితో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించి రెండు చేతులా సంపాదిస్తున్నారు. కొద్దిరోజుల వరకు అద్దె ఇంట్లోనే నివసిస్తూ వస్తున్న నిరుపమ్.. సొంతంగా ఫ్లాట్ కొనుగోలు చేసి గతేడాది ఏప్రిల్‌లో గృహ ప్రవేశం చేసి సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. కార్తీక దీపంకు ముందు నిరుపమ్ చాలా సీరియల్స్‌లో చేసినా అంత నేమ్ అండ్ ఫేమ్ రాలేదు. ఈ సీరియల్ తర్వాతి నుంచి నిరుపమ్ పరిటాల రెమ్యునరేషన్ కూడా మారిపోయింది. గతంలో ఎపిసోడ్‌కు రూ. 25 వేలు తీసుకునే ఆయన.. ఇప్పుడు దాదాపు రూ.45 వేలు చొప్పున ఛార్జ్ చేస్తున్నాడట. ఈ అన్ని సీరియల్స్ కలిపి నెలకు దాదాపు రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు సంపాదిస్తున్నాడట నిరుపమ్.
షూటింగ్స్ లేనప్పుడు కుటుంబంతో గడపటానికి సమయం కేటాయించే నిరుపమ్.. వీలున్నప్పుడల్లా ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్తుంటాడు. తాజాగా తన భార్యతో కలిసి మాల్దీవులకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ పడవల్లో తిరుగుతూ, బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న నిరుపమ్ - మంజుల ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. పోజ్ పెట్టటానికి ఇది టైటానిక్ కాకపోవచ్చు కానీ రిఫ్రెష్ కావడానికి ఈ ట్రిప్ ఒక టానిక్. ఒకసారి ట్రై చేసి చూడండి అని నిరుపమ్ రాసుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











