బిగ్‌బాస్‌‌‌పై డాక్టర్ బాబు షాకింగ్ కామెంట్స్.. ‌నాగార్జున షోపై కార్తీక దీపం హీరో కుండబద్ధలు

భారతీయ బుల్లితెరపై టాప్ రియాలిటీ షో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బిగ్‌బాస్ అని చెప్పొచ్చు. భిన్న ప్రాంతాలకు, రంగాలకు చెందిన, విభిన్న వ్యక్తులను దాదాపు 100 రోజులకు పైగా ఒకే గదిలో ఉంచి వారి వ్యక్తిత్వం, డెసిషన్ మేకింగ్, ఎమోషన్స్, త్యాగం, ఫ్రెండ్‌షిప్ ఇలా అన్ని రకాలుగా వారిని పరీక్షించడమే బిగ్‌బాస్ థీమ్. అన్ని పరీక్షల్లో నెగ్గి చివరి వరకు నిలిచిన వ్యక్తినే బిగ్‌బాస్ విజేతగా ఎంపిక చేస్తారు. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ షో.. ప్రస్తుతం ప్రాంతీయ భాషలకు విస్తరించి భారీ టీఆర్పీ రేటింగ్స్, క్రేజ్‌తో దూసుకెళ్తోంది.

తెలుగులో 9 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్‌బాస్.. త్వరలో సీజన్ 10కు రెడీ కానుంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. తన స్టైలీష్ ప్రెజెన్స్‌తో బిగ్‌బాస్‌ను నడిపిస్తున్నారు. ఈ మెగా రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనాలని ఎంతోమంది సెలబ్రిటీలు భావిస్తున్నారు. ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొంటున్నారు. త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు 10 సీజన్‌లో కంటెస్టెంట్స్‌ ఎవరు? ఈ సీజన్ ఎప్పుడు ప్రారంభం కానుంది? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అలాంటి బిగ్‌బాస్ షోలో ఆఫర్‌పై బుల్లితెర నటుడు, కార్తీక దీపం ఫేమ్ నిరూపమ్ పరిటాల షాకింగ్ కామెంట్స్ చేశారు.

Karthika Deepam fame Nirupam Paritala Shocking Comments on Bigg Boss Offer

స్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్‌ కార్తీక్ బాబుగా మహిళా ప్రేక్షకులను అభిమానాన్ని పొందారు నిరుపమ్ పరిటాల. ఎన్ని సీరియల్స్‌లో నటించినా జనం మాత్రం ఆయనను డాక్టర్ బాబుగానే గుర్తు పెట్టుకున్నారంటే ఆ పాత్రపై నిరుపమ్ వేసిన ముద్రను అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ క్రేజ్, ఈ పాపులారిటీ ఇదంతా ఆయనకు రాత్రికి రాత్రి వచ్చింది కాదు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదురైనా కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు. తండ్రి మరణం కృంగదీసినా.. అనుకున్న లక్ష్యం దిశగా సాగడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డారు. దివంగత రచయిత ఓంకార్ తనయుడే నిరుపమ్. సినీ నేపథ్యం ఉన్నప్పటికీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి నిరుపమ్ శ్రమించారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిరుపమ్ తన కెరీర్, వ్యక్తిగత విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

నేను, మంజు బయటకు వెళితే దీపక్క ఎలా ఉంది? వంటలక్క ఎలా ఉంది? అని అడుగుతుంటారు. అసలు పెళ్లాన్ని పక్కనే పెట్టుకుని ఇవన్నీ అడుగుతున్నారేంట్రా బాబు అనుకునేవాడిని. మీ కాంబోలో ఓ వీడియో చేయొచ్చు కదా అని కామెంట్స్ పెడుతుంటారు. ప్రేమి కూడా చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది, తనను కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఫ్యాన్ పేజీస్ క్రియేట్ చేసి.. మా పుట్టినరోజులు, పెళ్లిరోజులు గుర్తుపెట్టుకుని ఏదో ఒకటి పంపిస్తుంటారు. వాళ్లకు వద్దు అని చెప్పినా కూడా వద్దు ఇలాంటివి అంటే.. మాకు నచ్చుతుంది, మా ఇష్టం అంటున్నారు అని నిరుపమ్ చెప్పారు.

కొంతమంది టాటూలు కూడా వేయించుకున్నారు. నాకు వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు... ఒక మనిషి నచ్చితే ఇలా టాటూలు వేయించుకుంటారా? అనిపిస్తుంది. వంటలక్కని సీరియల్‌లో బాధపెడుతున్నానని చాలామంది ఫోన్లు చేసి బెదిరించారు కూడా. సినిమాలకే కాదు, సీరియల్స్‌కు కూడా సెకండ్ సీజన్ అనేది ఎప్పుడూ రిస్కే. కార్తీక దీపం 2లో నేను, దీప తప్ప ఫస్ట్ పార్ట్‌కి సంబంధించిన ఎవరూ లేరు. సెకండ్ సీజన్ మొదలయ్యాక చాలా కన్‌ఫ్యూజన్స్.. ఫస్ట్ పార్ట్‌కి కొనసాగింపా? మిగతావాళ్లు లేరేంటీ? వంటి ప్రశ్నలు వచ్చాయి. ఆ జనాన్ని మళ్లీ కన్విన్స్ చేసి ట్రాక్‌లోకి తీసుకురావడానికి చాలా టైం పట్టింది. లక్కీగా సీరియల్ బాగా నడుస్తోందని నిరుపమ్ తెలిపారు.

తోటి నటీనటులతో ఆరోగ్యకరమైన సంబంధాలే ఉన్నాయి. కొంతమందికి సీరియల్స్, సినిమాలు నిర్మించాలనే ఆలోచన ఉంది. రవికిరణ్ ఛాయ్ షాట్స్ అని పెట్టాడు. వాళ్ల ప్రాజెక్ట్‌లో మనకి అవకాశం ఉండి, వాళ్లకు హెల్ప్ అవుతామనుకుంటే వాళ్లే అడుగుతారు. సీరియల్స్‌లో ఒక్కో ప్రాజెక్ట్ తీసుకుంటే 2 వారాలు షెడ్యూల్ ఉంటుంది. 10 నుంచి 12 వారాలు షూటింగ్ చేసి నెలకు సరిపడా ఎపిసోడ్స్ కవర్ చేస్తాం. షూటింగ్‌కి ఒక టైం ఉంటుంది.. పోస్ట్ ప్రొడక్షన్స్‌కి రాత్రిపూట పిలుస్తారు. మనం డేలో షూటింగ్‌లో ఉంటే.. రాత్రి ఖచ్చితంగా డబ్బింగ్‌కి వెళ్లాల్సి ఉంటుంది. ఓన్ వాయిస్ అయితే కనుక మనమే డబ్బింగ్ చెప్పాలి.. లేడీస్‌కి అస్సలు కుదరదు.. మేల్ ఆర్టిస్ట్‌లలో కూడా చెప్పేవాళ్లు చాలా తక్కువ. నాకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటానని నిరుపమ్ వెల్లడించారు.

ఇక బిగ్‌బాస్ ఆఫర్ గురించి చెబుతూ.. నాకు బిగ్‌బాస్ ఆఫర్ ఎప్పుడూ రాలేదు. బిగ్‌బాస్ స్టార్‌ మానే, కార్తీక్ దీపం స్టార్ మానే. అక్కడికి వెళ్లాలంటే ఇది మానేయాలి. అది చేయలేరు కాబట్టి నాకు బిగ్‌బాస్ ఆఫర్ రాలేదు. అయితే పలుమార్లు లిస్ట్‌లో నా పేరొచ్చేది.. కానీ అది నా వరకు రాలేదు. ఒకవేళ ఆఫర్ వచ్చినా వెళ్లను. బిగ్‌బాస్‌ని మాత్రం చాలా ఫాలో అవుతా. భవిష్యత్తులో వెళ్తానా? లేదా? అన్నది నాకు కూడా పెద్ద క్వశ్చన్ మార్కేనని నిరుపమ్ తేల్చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X