For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గొంతుకు పిసికి చంపేస్తా.. కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్‌కు వంటలక్క వార్నింగ్

  |

  తెలుగు వినోద పరిశ్రమలో బుల్లితెర మీద అత్యంత టెలివిజన్ రేటింగ్ సాధించిన సీరియల్ కార్తీకదీపం. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్‌కు విశేషమైన అభిమానులు ఉన్నారు. అలాగే ఈ సీరియల్‌పై అంతే మొత్తంలో సెటైర్లు వేసే వారు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కార్తీకదీపం సీరియల్ సుమారు ఐదు సంవత్సరాలు నిరాటంకంగా సాగింది. అయితే తెలుగు ప్రేక్షకులతో విడదీయలేని బంధం ఏర్పడిన కార్తీక్, దీప పాత్రలు అనూహ్యంగా మృతి చెందడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమ పాత్రలు ముగిసిన తర్వాత దీప పాత్రను పోషించిన ప్రేమి విశ్వనాథ్, కార్తీక్ పాత్రను పోషించిన నిరుపమ్ పరిటాల సరదాగా మాట్లాడుకొంటూ అభిమానులకు ఆనందాన్ని పంచారు. ఆ చిట్ చాట్ వివరాల్లోకి వెళితే..

   ప్రతీ కథకు ఓ ముగింపు అంటూ కార్తీక్

  ప్రతీ కథకు ఓ ముగింపు అంటూ కార్తీక్


  కార్తీకదీపం చివరి రోజున దీప క్యారెక్టర్ పోషించిన ప్రేమి విశ్వనాథ్‌తో డాక్టర్ బాబుగా, కార్తీక్‌గా నటించిన నిరుపమ్ పరిటాల ఎమోషనల్ అయ్యారు. ఐదేళ్ల సుదీర్ఘమైన ప్రయాణంలో చివరి రోజున మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది అని నిరుపమ్ అడిగాడు. అయితే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది అని అడిగింది. లాస్ట్ డే ఎలాంటి ఫీలింగ్ ఉంది అని మళ్లీ నిరుపమ్ అడిగితే.. కొంగుతో ముఖం తుడిచింది. దాంతో ఓవరాక్షన్ చేయకు అని నిరుపమ్ అంటూ.. ప్రతీ కథకు ఓ ముగింపు ఉంటుంది. ఏదో ఒక చోట ముగింపు పలకాలి. కానీ విడిపోతుంటే చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా అని అన్నాడు. అయితే మళ్లీ ఒక చోట కలుస్తూనే ఉంటాం.. కానీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది అని నిరుపమ్ అన్నాడు.

  వంటలక్కతో బాధపడలేక.. హ్యాపీగా ఉందా?

  వంటలక్కతో బాధపడలేక.. హ్యాపీగా ఉందా?


  అయితే నిరుపమ్ మాటలపై ప్రేమి విశ్వనాథ్ స్పందిస్తూ.. మీకు హ్యాపీగా ఉంది కదా?.. ఈ వంటలక్కతో ఏంటిరా? బాబు.. ఈ పిల్లలు ఏంటి? నా డాక్టర్ బతుకు ఏమిటి అనే బాధ నుంచి తప్పుకొంటున్నందుకు హ్యాపీగా ఉందా అని కౌంటర్ వేసింది. అయితే స్టోరి పరంగా పడే బాధలు వేరు. నీతో ప్రతీసారి సింగిల్ టేక్ అవ్వదు. నాలుగైదు సార్లు రీటేక్స్ చేయాలంటే చాలా విసుగే అని నిరుపమ్ ఎన్‌కౌంటర్ వేశాడు. దాంతో ప్రేమి విశ్వనాథ్ కంగారుపడిపోయింది. నిరుపమ్ మాటలను కట్ చేయాలని సైగ చేసింది.

  నీ గొంతు పిసికేస్తాను అంటూ దీప

  నీ గొంతు పిసికేస్తాను అంటూ దీప


  అయితే ప్రేమి విశ్వనాథ్ మాటలకు, సైగలకు నిరుపమ్ అడ్డుపడుతూ.. గత ఐదేళ్లలో ఒక్కసారి వెనుకకు వెళితే.. మన ఇద్దరి కాంబినేషన్‌లో ఒక్క సీన్ అయినా సింగిల్ టేక్‌లో ఒకే అయిందా? అని ప్రశ్నించాడు. దాంతో అలా అంటే నీ గొంతు పిసికి చంపేస్తాను అంటూ ప్రేమి విశ్వనాథ్ వార్నింగ్ ఇచ్చింది. మీరు కూడా కొన్నిసార్లు మూడు నాలుగు టేక్స్ తీసుకొన్నారు కదా అంటూ ప్రశ్నించింది. మలయాళం భాషకు చెందిన నేను.. తెలుగును అర్ధం చేసుకొని డైలాగ్స్ చెబుతున్నాను. కానీ నీవు తెలుగు వాడివి అయి ఉండి కూడా సరిగా డైలాగ్స్ చెప్పకుండా టేక్స్, రీటేక్స్ తీసుకొంటున్నావు అంటూ నిరుపమ్‌పై ప్రేమి విశ్వనాథ్ కంప్లయింట్ చేసింది.

   తెలుగులో దీప క్యారెక్టర్ బాగుందంటూ

  తెలుగులో దీప క్యారెక్టర్ బాగుందంటూ


  కార్తీకదీపం సీరియల్‌లోని దీప పాత్ర గురించి మాట్లాడుతూ.. తెలుగులో దీప క్యారెక్టర్ బాగుందా? మలయాళంలో దీప పాత్ర బాగుందా? అని నిరుపమ్ అడిగితే.. తెలుగులోనే నా క్యారెక్టర్ చాలా డీప్‌గా ఉంది. కార్తీకదీపం సీరియల్‌లో కార్తీక్ కంటే దీప క్యారెక్టర్ బెటర్‌గా ఉంది. ఆన్ స్క్రీన్ చూస్తే.. నా పాత్రను చూసి నేనే ఏడ్చేసిన సందర్భాలు ఉన్నాయి. నేనే కాదు.. చాలా మంది ప్రేక్షకులు కూడా మిస్ అవుతారు. నా కెరీర్‌లో దీప క్యారెక్టర్ బెస్ట్. ఇలాంటి క్యారెక్టర్ మళ్లీ లభించదు. మళ్లీ ఏడ్చే క్యారెక్టర్ వస్తే.. చేస్తాను. నీవు ఉంటే తప్పకుండా చేస్తాను అని ప్రేమి విశ్వనాథ్ చెప్పింది.

   తెలుగులో మళ్లీ సీరియల్ చేస్తాను అంటూ

  తెలుగులో మళ్లీ సీరియల్ చేస్తాను అంటూ


  కార్తీకదీపం తర్వాత మళ్లీ తప్పకుండా తెలుగు సీరియల్ చేస్తాను. ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. దీప లాంటి క్యారెక్టర్‌ కంటే ఎక్కువ ఇంటెన్స్ ఉన్న సీరియల్ రావాలని కోరుకొంటాను. మన ఇద్దరం కలిసి ఓ సీరియల్ చేద్దాం. మన కోసం ఎవరో ఒకరు కథ రాస్తుంటారు అని ప్రేమీ విశ్వనాథ్ అన్నారు. వారిద్దరి చాటింగ్ చివరన ప్రేమి విశ్వనాథ్‌కు నిరుపమ్ ఓ గిఫ్టును బహుకరించారు.

  English summary
  Popular and most TRP serial Karthika Deepam comes to end. After Karthik, Deepa Charecters death, This serial takes interesting turn. In this occassion, Premi Vishwanath and Nirupam Paritala had chit chat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X