Karthika Deepam: వంటలక్కకు షాకింగ్ రెమ్యునరేషన్.. ప్రేమి విశ్వనాథ్ కు ఒక్క రోజు పారితోషికం ఎంతో తెలుసా?
Premi Vishwanath: బుల్లితెర హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ (Premi Viswanath) అంటే గుర్తుపట్టడం కాస్త కష్టమేమో కావొచ్చు కానీ, కార్తీక దీపం సీరియల్ వంటలక్క ( Vantalakka )చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపంమ (Karthika deepam) సీరియల్ తో మంచి గుర్తింపు, భారీ పాపులారిటీ సంపాదించుకుంది ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క. తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ ద్వారా భారీగా అభిమానును సొంతం చేసుకోన్న వంటలక్క మరోసారి కార్తీకదీపం 2- ఇది నవ వసంతం సీరియల్ తో సత్తా చాటుతోంది. అయితే ఈ సీరియల్ కోసం ప్రేమి విశ్వనాథ్ షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇంతకీ ప్రేమి విశ్వనాథ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో మీరు కూడా ఓ లూక్కేయండి.
బుల్లితెర నటి ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె ఇప్పటివరకు ఆరు సీరియల్స్‌లో నటించింది. కరుతముత్తు అనే మలయాళ సీరియల్ ద్వారా బుల్లితెర పరిశ్రమలో అడుగుపెట్టింది.అనంతరం మౌనమ్‌మణి, కుట్టికలవరా, కాయంకులనమ్ కోచినున్నయుడే మకన్ సీరియల్ లతో ఇండస్డ్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2017లో ప్రారంభంలో ప్రారంభమైన కార్తీకదీపం సీరియల్ నటించి తన ప్రత్యేక గుర్తింపు చెప్పుకుంది. ఎంతలా అంటే.. ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అనే పాట వినిపిస్తే చాలు.. బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు.

అందులో దీపా అలియస్ వంటలక్క ఏడిస్తే ఏడ్చారు, నవ్వితే వారు కూడ నవ్వారు, వంటలక్క కు కష్టసుఖాలు వస్తే.. తమకు క్షషాలు వచ్చినట్టు బాధపడుతారు. పక్కనే ఉన్నావారి మీద పడి ఏడ్చేస్తారనడంలో కూడా అతిశయోక్తి లేదు. అంతలా వంటలక్క తెలుసు ప్రేక్షకులు మదిలో స్థానం దక్కించుకుంది. ఈ ఒక్క సీరియల్ తో ప్రేమి విశ్వనాథ్ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం కార్తీకదీపం 2లో నటిస్తోంది.
ఇంకా చెల్లెలి కాపురం, గోరింటాకు, జాతరో జాతర వంటి సీరియల్స్‌లోనూ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ప్రేమి విశ్వనాథ్ . దక్షిణాదిలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న బుల్లితెర నటిగా గుర్తింపు దక్కించుకుంది. ప్రేమి విశ్వనాథ్ కేవలం సీరియల్సే కాకుండా సినిమా రంగంలోనూ రాణించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతంలో అకమే అనే మలయాళ చిత్రంలో నటించింది. ఇటీవల నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీలో కనిపించింది. అలాగే.. సాల్మన్ 3డీ తమిళ చిత్రంలోనూ కనిపించింది.

ఇక కార్తీకదీపం సీరియల్ బుల్లితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ రికార్డు స్థాయిలో టీఆర్పి రేటింగ్స్ ను సొంతం చేసుకుంది.ఇకపోతే.. కార్తీక దీపం సీక్వెల్ గా కార్తీక దీపం 2 సీరియల్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. బుల్లితెర హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క మరోసారి కార్తీకదీపం 2- ఇది నవ వసంతం సీరియల్ తో సత్తా చాటుతోంది.
అయితే.. కార్తీక దీపం ఈ సీరియల్ నటించడం కోసం ప్రేమి విశ్వనాథ్ భారీ మొత్తంలో పారిదోషకం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సీరియల్ లో నటించడానికి ప్రేమి విశ్వనాథ్ ఒక్క రోజు 35 వేల రూపాయల చొప్పున తీసుకుంటోందట. ఈ సీరియల్ షూటింగ్ నెలలో సుమారు 20 రోజులు షూటింగు ఉంటుంది. అంటే.. నెలకు వంటలక్క కార్తీక దీపం 2 ద్వారా రూ. రూ 7 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు తీసుకుంటుందట. మరి ఇందులో నిజమెంతో తెలీదు. కానీ, వంటలక్క రెమ్యునరేషన్ లక్షల్లో ఉండే సరికి షాక్ అవుతున్నారు ఫాన్స్.


Click it and Unblock the Notifications











