యాంకర్ సుమ స్థానానికే ఎసరుబెట్టిందట.. కార్తీకదీపం వంటలక్క కూడా మొదలెట్టేసింది!
రెండు తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేమికులు, ప్రేక్షకులకు కార్తీకదీపం సీరియల్ గురించి.. అందులో దీప అలియాస్ వంటలక్క గురించి పరిచయం అక్కర్లేదు. అలాగే బుల్లితెరలో యాంకరింగ్ సామ్రాజ్యానికి మహారాణి అయిన సుమ గురించీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఈ ఇద్దరూ ఒకే చోట కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మామూలుగా కార్తీకదీపం ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్ కాస్త ప్రైవేట్‌గా ఉంటుంది. సీరియల్‌లో తప్పా బయట ఎక్కడా కనిపించదు.

ఈ మధ్య రచ్చ..
కార్తీకదీపం సీరియల్‌లో తప్పా బయట ఎక్కడా కనిపించని ప్రేమీ విశ్వనాథ్ ఇప్పుడిప్పుడే రచ్చ చేయడం ప్రారంభిస్తోంది. ఆ మధ్య దసరా ఈవెంట్ కోసం వచ్చింది. ఆ తరువాత ఓ మీడియా చానెల్‌కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. అది కూడా సుమ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది.

మళ్లీ ఒకసారి అలా..
ఆ మధ్య మీడియా చానెల్‌లో వంటలక్కను సుమక్క ఇంటర్వ్యూ చేయడంతో బాగా వైరల్ అయింది. ఈ ఇద్దరి ప్రెజెన్స్‌తొనే ఓ కళ వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేశారు. పైగా ఇద్దరూ మళయాలీలే. అలా కూడా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది.

తాజాగా మరోసారి..
అయితే తాజాగా మరోసారి సుమక్క, వంటలక్క కలిసి వచ్చారు. అయితే ఈ సారి మాత్రం సుమక్కకు పోటీగా వంటలక్క నిల్చుంది. తెనాలి డబుల్స్ హార్స్ మినపగుళ్లు అని అంటే ఎవ్వరికైనా సరే యాంకర్ సుమ గుర్తుకు రావాల్సిందే. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారేలా ఉంది.

ఇద్దరూ కలిసి..
తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు అంటూ వంటలక్క కూడా రంగంలోకి దిగింది. అయితే ఎంత వంటలక్క వచ్చినా కూడా సుమ బ్రాండ్‌ను ఆమె స్థాయిని రీప్లేస్ చేయలేదు. ఇదే విషయాన్ని ఆ యాడ్‌లొనూ సూటిగా చెప్పేశారు. మొత్తానికి మంచి కాన్సెప్ట్‌తో యాడ్‌లో సుమక్క, వంటలక్కను బ్యాలెన్స్ చేశారు.

స్థానానికి ఎసరు పెట్టేశారు..
యాడ్ గురించి వంటలక్క చెబుతూ ఉండగా.. నా స్థానానికి ఎసరు పెట్టింది ఎవరు అంటూ సుమ ఎంట్రీ ఇస్తుంది.. మీ లెవెలే వేరు అక్క అంటూ వంటలక్క సైతం సుమను పొగిడేస్తుంది. అలా చివరకు సుమ చేతే.. ప్రతీ మహిళా ఈ యాడ్‌కు అంబాసిడరే అంటూ చెప్పించారు. మొత్తానికి సుమక్క, వంటలక్క ఒకే చోట కనిపించే సరికి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.


Click it and Unblock the Notifications











