నా భర్తతో కలిసి ఉండను.. కారణం అదే.. కార్తీకదీపం వంటలక్క క్లారిటీ

తెలుగు బుల్లితెరపై సంచలనం కార్తీక దీపం సీరియల్. ఈ సీరియల్‌కు కథే బలం. భారీ టీఆర్పీలతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది కార్తీక దీపం. ఈ సీరియల్ ఇంతపెద్ద హిట్ కావడానికి ముగ్గురు ఆర్టిస్టులు ప్రధాన కారణం ఒకరు డాక్టర్‌బాబుగా నటించిన నిరూపమ్ పరిటాల.. ఆయన భార్య దీపగా నటించిన ప్రేమి విశ్వనాథ్.. డాక్టర్ బాబు ప్రియురాలు మోనితగా నటించిన శోభా శెట్టి. వీరిద్దరూ తమదైన నటనతో రక్తికట్టించడంతో కుటుంబ ప్రేక్షకులు కార్తీక దీపానికి బ్రహ్మరథం పట్టారు.

2017లో ప్రారంభమైన ఈ సీరియల్... 2023 వరకు దాదాపు 1500కు పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన తెలుగు ధారావాహికగా చరిత్ర సృష్టించింది. ఈ సీరియల్ ముగిసి నాలుగేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ దీని గురించి డిస్కషన్ నడుస్తూనే ఉంది. దీప పాత్రలో నటించిన మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిపోయారు. హీరోయిన్లను మించిన క్రేజ్‌తో.. ప్రతి తెలుగు కుటుంబంలోనూ అభిమానులను సంపాదించుకున్నారు ప్రేమి విశ్వనాథ్. దీప అనే కంటే వంటలక్క అనగానే ప్రేక్షకులు టక్కున గుర్తుపడతారు.

Karthika Deepam fame Premi Viswanath Opens Up About her Married Life Busy Schedules and Son

కేరళలోని ఎడపల్లి ఎర్నాకులంలో జన్మించారు ప్రేమి విశ్వనాథ్. 2014లో కారుతముతు సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టారు ఈ ముద్దుగుమ్మ. ఏషియానెట్‌లో ప్రసారమైన ఈ ధారావాహిక ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కాయంకులం కొచాన్నియుడే మకన్ సీరియల్స్‌లో నటించారు. ఈ ఫేమ్‌తోనే స్టార్ మాలో కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్కగా నటించే అవకాశం వచ్చింది. ఈ దెబ్బకు ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత ఎంటె మాతవులో నటించింది. ప్రస్తుతం స్టార్ మాలో కార్తీక దీపం 2లో ప్రేమి విశ్వనాథ్ నటిస్తున్నారు. తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన చెల్లమ్మ సీరియల్‌కు రీమేక్‌గా దీనిని రూపొందించారు.

డాక్టర్ టీఎస్ వినీత్ భట్‌తో ప్రేమి విశ్వనాథ్‌కు పెళ్లయ్యింది. ఈ దంపతులకు మనుజిత్ అనే కుమారుడు ఉన్నాడు. ఆరడుగుల హైట్, సిక్స్ ప్యాక్‌ బాడీతో హీరోలా ఉన్నాడు ప్రేమి విశ్వనాథ్. మొన్నామధ్య తల్లీకొడుకులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో చూసిన జనం.. ప్రేమికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. మీడియాకు, పబ్లిసిటీ దూరంగా ఉండే ప్రేమి విశ్వనాథ్.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తన సీరియల్స్, షూటింగ్స్, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. కొద్దిరోజుల క్రితం యాంకర్ సుమ కనకాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమి విశ్వనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఫ్యామిలీతో గడిపే టైం తక్కువ అయిపోతోంది.. ఆ స్టేట్ ఈ స్టేట్ అని తిరుగుతున్నారు కదా? మీ హాజ్బెండ్ మీ మీద కోప్పడలేదా అని సుమ అడగ్గా.. నిజం చెప్పాలంటే నేను కేరళలో ఉన్నప్పుడు తను కేరళలో ఉండడు.. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఉండడు. ఆయన నా కంటే బిజీ, సార్ బిజీగా ఉన్నప్పుడు నేను ఒక్కదానినే ఇంట్లో కూర్చొని ఏం చేయాలి. నేను కూడా బయటకు వెళ్లిపోతాను అని వచ్చేశా... ఇప్పుడు నేను హ్యాపీ. ఆయన బిజీ.. నేను కూడా బిజీ, ఎప్పుడో ఒకసారి కలుస్తానని ప్రేమి విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

బాబుని, కెరీర్‌ని, వర్క్‌ని, ట్రావెలింగ్‌ని ఎలా మేనేజ్ చేస్తున్నారని సుమ అడగ్గా.. బాబు ఆలనా పాలనా అమ్మ చూసుకుంటారు. మిస్ అయినట్లుగా అనిపించదు.. వీడియో కాల్, ఫోన్‌లు ఉన్నాయి కదా. వన్ వీక్ అక్కడ, వన్ వీక్ ఇక్కడ ఉంటున్నాను. నేను తెలుగు నేర్చుకోవడానికి మీరే ఇన్‌స్పిరేషన్. సీరియల్స్‌కు ముందు మూడేళ్లు లీగల్ అడ్వైజర్‌గా పనిచేశా. అందులో ఉన్నప్పుడే కార్తీక దీపంలో ఆఫర్ వచ్చింది. యాక్టింగ్ గురించి కూడా తెలియదు. అక్కడ చాలామంది టెస్ట్‌కి వచ్చినా ఎవరూ సెట్ కాలేదు, డైరెక్టర్‌కి నచ్చలేదు. వైట్ స్కిన్ టోన్‌లో ఉన్న అమ్మాయిలకు బ్లాక్ మేకప్ చేసేసరికి వెరియేషన్ కనిపించలేదని మా ఫ్రెండ్ చెప్పడంతో ఆడిషన్స్‌కి వెళ్లానని ప్రేమి విశ్వనాథ్ అన్నారు.

అక్కడికి వెళ్లాక కూడా నాకు యాక్టింగ్ తెలియదు, కేవలం మీ కోసమే వస్తున్నాను, నన్ను తొందరగా పంపించాలని చెప్పా. ఆడిషన్స్‌లో భాగంగా నాకు క్లీన్ చేయమని చీపురుకట్ట ఇచ్చారు.. ఇంట్లో అలవాటే కాబట్టి మంచిగా క్లీన్ చేశా. మేకప్ వేయించి స్క్రీన్ టెస్ట్ చేశారు.. అన్నీ అయిపోయిన తర్వాత ఒక ఏడుపు సీన్ చేయించారు. టెంపుల్‌కి వెళ్తుంటే నేను అడ్డుగా ఉన్నానని తిడుతున్నారు దాంతో నేను నిజంగానే ఏడ్చా, చివరికి అలా సెలెక్ట్ అయిపోయానని ప్రేమి విశ్వనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X