Bigg Boss Telugu 7 విసిరికొట్టిన యావర్.. భోరుమన్న శోభాశెట్టి!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో కెప్టెన్సీ టాస్క్ గందరగోళానికి కారణమైంది. ఎలాగైనా కెప్టెన్ కావాలనుకొన్న శోభాశెట్టి ఆశలపై కంటెస్టెంట్లు నీళ్లు చల్లారు. కెప్టెన్సీ కంటెండెర్లుగా నిలిచిన వారికి ఇంటి సభ్యులు ఓటు వేసి కెప్టెన్‌గా ఎన్నుకోవాలి. ఈ సందర్బంగా యావర్, శోభా శెట్టి మధ్య వాగ్వాదం ఇంటిని హీటెక్కించింది. శోభాశెట్టికి యావర్‌కు మధ్య జరిగిన గొడవలోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో 8వ వారంలో కెప్టెన్సీ కోసం ప్రియాంక జైన్, శోభాశెట్టి, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, ఆట సందీప్ పోటీ పడ్డారు. తమ ఇంటికి సరిపోయే కెప్టెన్‌ను ఎన్నుకోవాలని బిగ్‌బాస్ సూచించారు. అతి తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టంట్ కెప్టెన్ అవుతారు అని రూల్స్ చెప్పారు. అయితే ఇంటి సభ్యులు అర్హత లేదంటూ తమ కారణాలు చెబుతూ కొందరిని నామినేట్ చేశారు.

అయితే శోభాశెట్టిని నామినేట్ చేస్తూ ప్రిన్స్ యావర్ తన కారణాలను చెప్పారు. యావర్ మాట్లాడుతూ.. నేను కెప్టెన్‌గా ఉండే సమయంలో నేను నీకు డిప్యూటీ కెప్టెన్‌గా నియమిస్తే నేను చేయనని చెప్పావు. నీకు కెప్టెన్సీ పదవి కంటే.. ఇమ్యునిటీ కోసమే గేమ్ ఆడుతున్నావు. కాబట్టి నీకు కెప్టెన్ పదవి అక్కర్లేదు అని యావర్ చెప్పాడు. అయితే యావర్ కారణాలపై శోభాశెట్టి అభ్యంతరం చెప్పింది.
బిగ్‌బాస్ ఇంటిలో ఉండటానికి కెప్టెన్సీ పదవి నాకు అవసరం. దాంతో ఇమ్యునిటీ వస్తుంది. నాకు ఆ రెండు అవసరమే అంటూ తన వాదన వినిపించింది. అయితే మరి ఎందుకు డిప్యూటీ కెప్టెన్ పదవిని రిజెక్ట్ చేశావు అని ప్రిన్స్ యావర్ అడిగితే.. అది నా ఇష్టం అని శోభా సమాధానం ఇచ్చింది. దాంతో అయితే నీకు అర్హత లేదంటూ యావర్ చెప్పాడు.
కెప్టెన్సీ టాస్క్‌లో ప్రిన్స్ యావర్, శోభాశెట్టి మధ్య వాగ్వాదం జోరుగా సాగింది. ఓ దశలో సహనం కోల్పోయి ఒకరిపై మరొకరు అరుచుకొన్నారు. ఒకరిపై మరొకరు దూసుకెళ్లారు. ఆ క్రమంలో యావర్ పిచ్చోడు అంటూ కామెంట్ చేసింది. దాంతో కోపంతో ఊగిపోయిన యావర్ తన చేతిలోని మిర్చి దండను నేలకేసి విసిరికొట్టాడు. ఇంటి సభ్యులు నచ్చ జెప్పిన తర్వాత శోభా మెడలో యావర్ మిర్చి దండవేసి అనర్హురాలివి అంటూ కామెంట్ చేశాడు.
తనను నామినేట్ చేయడంతోపాటు కెప్టెన్సీకి దూరం చేసిన కంటెస్టెంట్లపై శోభాశెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది. నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే భోరున ఏడ్చింది. ఆమె ఏడుస్తూ కనిపించడంతో ప్రియాంక జైన్, టేస్టీ తేజ, అశ్వినీ శ్రీ ఓదార్చారు. ఇలా కెప్టెన్సీ టాస్క్ హాట్ హాట్ వాగ్వాదంతో ముగిసింది. చివరకు కెప్టెన్సీ టాస్క్‌లో గౌతమ్ కృష్ణ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.


Click it and Unblock the Notifications











