Shobha Shetty : గులాబీ రంగు చీరలో కార్తీక దీపం మోనిత .. నడుము అందాలు చూపిస్తూ టీజింగ్
తెలుగు బుల్లితెరపై కన్నడ భామల హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, అభినయంతో తెలుగు వారిని మెస్మరైజ్ చేస్తున్న కర్ణాటక అమ్మాయిలు ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా తెలుగు బిగ్‌బాస్‌లోనూ హల్ చల్ చేస్తే టైటిల్ విన్నర్ అయ్యే దిశగా దూసుకెళ్తున్నారు. కన్నడ నటీమణుల్లో శోభాశెట్టి ఒకరు. ఇప్పుడు ఆమె ఏకంగా తెలుగింటికే కోడలిగా రానున్నారు. తాజాగా శోభా శెట్టి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం ద్వారా శోభాశెట్టి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. అంతకుముందు తెలుగులో పలు సీరియల్స్ చేసినా కార్తీక దీపం ఎవర్‌గ్రీన్. ఇందులో హీరోను ఇష్టపడే డాక్టర్ మోనితగా తన దారికి ఎవరు అడ్డొచ్చినా చంపడానికి కూడా వెనుకాడనంత క్రూరంగా కనిపిస్తుంది శోభ. ఆమెను తప్పించి ఆ క్యారెక్టర్‌లో మరొకరిని ఊహించుకోలేరు ప్రేక్షకులు. నిజానికి కార్తీక దీపం అంత పెద్ద హిట్ కావడానికి డాక్టర్ మోనిత క్యారెక్టర్ ఒక ముఖ్య కారణం.

కార్తీక దీపానికి ఎండ్ కార్డ్ పడిన తర్వాత శోభాశెట్టి మరో సీరియల్‌కి కమిట్ కాలేదు. అయితే తర్వాత బిగ్‌బాస్ తెలుగు 7లో అవకాశం దక్కించుకుని షాకిచ్చారు. అందులో స్పై బ్యాచ్ (శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్)కు ఎదురు తిరిగి జనానికి బాగా నచ్చేశారు. అయితే తన బిహేవియర్‌తో కొందరికి శోభా శెట్టి నచ్చలేదు. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానెల్‌పై ఫోకస్ పెట్టిన ఆమె ఎప్పటికప్పుడు వీడియో పెడుతూ, ఫాలోవర్స్‌ని పెంచుకుంటున్నారు.
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్ సందర్భంగా శోభాశెట్టి లవ్ స్టోరీ బయటపడింది. స్టేజ్ మీదకి వచ్చిన ఆమె ప్రియుడిని చూసి బుల్లితెర ప్రేక్షకులు షాకయ్యారు. కార్తీక దీపం సీరియల్‌లో నిరుపమ్ పరిటాలకు తమ్ముడిగా నటించిన యశ్వంతే అతను. షూటింగ్ జరుగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి తర్వాత ప్రేమకు దారి తీసింది. స్టార్ మా పరివార్ విత్ స్టార్ వార్స్ షోలో ఓ సారి నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట రీసెంట్‌గా మరోసారి కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.
ప్రియుడిని తీసుకుని బెంగళూరు వెళ్లిన ఈ భామ అక్కడ చక్కర్లు కొట్టింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన ఇంట్లో ఈ జంట గృహ ప్రవేశం కూడా పూర్తి చేసింది. తర్వాత యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా లక్షలాది రూపాయల విలువైన బీస్ట్ ఎక్స్‌యూవీ 700 కారుని గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శోభాశెట్టి .. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చీర కట్టుకుని నడుము అందాలు చూపిస్తున్న ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











