Bigg Boss Telugu: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ను బకరా చేసిన శోభాశెట్టి.. షాకింగ్‌గా చెవిలో పూలు పెట్టిన మోనిత

సాధారణంగా ఈ మధ్య రీల్స్ తో ఫేమస్ అయినవారు అందరూ బిగ్ బాస్ హౌస్ లోనే కనిపిస్తున్నారు. సీరియల్ నటులు, యూట్యూబ్ లో వీడియోలు చేసేవారు, ఫుడ్ వోల్గ్స్ చేసేవారు అందరిని బిగ్ బాస్ హౌస్ కు తీసుకొస్తున్నారు. అక్కడనుంచి వచ్చాక వారే పెద్దస సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ 7 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. అయితే బిగ్‌బాస్‌లో మంచి ఫ్రెండ్స్ అయిన శోభాశెట్టి, టేస్టీ తేజ మధ్య ఆసక్తికరమైన సంఘటన జరిగింది.. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా రాగా.. రెండవ సీజన్ కు నాని ఆ బాధ్యతలు అందుకున్నాడు. ఇక మూడో సీజన్ నుంచి 7 వ సీజన్ వరకు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7 లో వచ్చిన కంటెస్టెంట్స్.. వారు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చుక్క బ్యాచ్ వర్సెస్ మొక్క బ్యాచ్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకోవడం మొదలుపెట్టారు.

karthika deepam fame shobha shetty rejects tasty teja love proposal Reels goes Viral

చుక్క బ్యాచ్ లో మా టీవీ సీరియల్ ఆర్టిస్టులు అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఉండగా.. మొక్క బ్యాచ్ లో పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ ఉన్నారు. ఇక వీరు కాకుండా ఆటలో అరటిపండు టేస్టీ తేజ. ఈ కంటెస్టెంట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. జబర్దస్త్ లో కమెడియన్ గా నవ్వించి.. యూట్యూబ్ లో ఫుడ్ వోల్గ్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న తేజ.. మొట్ట మొదటిసారి హౌస్ లోకి అడుగుపెట్టి.. తనదైన కామెడీతో అభిమానులను అలరించాడు.

karthika deepam fame shobha shetty rejects tasty teja love proposal Reels goes Viral

ముఖ్యంగా శోభా శెట్టితో అతడి స్నేహం మరువలేనిది. ఆమెతో కలిసి హౌస్ లో చేసిన అల్లరిని ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఎంత గొడవపడినా తరువాత వెళ్లి సారీ చెప్పి కలిసిపోవడం, ఆమెకు ప్రపోజ్ చేసినప్పుడు కాదన్నా .. ఇంకా వెంటపడడం.. నాగార్జున, శోభా టాటూ వేయించుకోమని అడిగినప్పుడు తేజ భయపడడం.. ఇలా ఒకటి అని చెప్పలేం. వీరిద్దరి మధ్య ఎన్నో జ్ఞాపకాలు బిగ్ బాస్ హౌస్ తో ముడిపడి ఉన్నాయి.

ఇక ఇదే స్నేహాన్ని వీరు బయట కూడా కొనసాగిస్తున్నారు. శోభాకు ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెల్సిందే. కార్తీక దీపం సీరియల్ చేస్తున్న సమయంలో కార్తీక్ తమ్ముడు పాత్రలో నటించిన యస్వంత్ రెడ్డితో ప్రేమలో పడింది. ఈ ప్రేమ .. పెళ్లి వరకు వచ్చింది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం ఎవరి కెరీర్స్ తో వారు బిజీగా ఉన్న ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఎప్పుడో ఒకసారి కలుస్తారు.

తాజాగా తేజ పుట్టినరోజున వీరందరూ మరోసారి కలిశారు. ఈ వేడుక అనంతరం తేజ, శోభా కలిసి ఒక రీల్ చేశారు. దాన్ని శోభా పంచుకుంటూ తేజకు బర్త్ డే విషెస్ తెలిపింది. ఆ వీడియోలో శోభాకు తేజా పూలు ఇస్తూ ప్రపోజ్ చేయగా.. ఆ పూలు తీసుకున్న శోభా తేజ చెవిలో పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గామారింది. మీ ఇద్దరి స్నేహం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నామని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X