‘కార్తీకదీపం’ శౌర్య క్రేజ్‌కు నిదర్శనమిదే.. రౌడీ అంటూ బచ్చా గ్యాంగ్ రచ్చ
కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. కార్తీక దీపం బుల్లితెరపై ఓ సంచలనం. అందులో నటించిన ప్రతీ ఒక్క పాత్రకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వంటలక్క, దీప పాత్రలో ప్రేమీ విశ్వనాథ్ అద్భుతంగా నటించి స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంది. ఇక డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రలో నిరుపమ్ మీద వచ్చే మీమ్స్ గురించి అందరికీ తెలిసిందే. అలా ప్రతీ ఒక్క క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోయింది.

పిల్లల పాత్రలు హైలెట్..
ఒకప్పుడు సీరియల్ మొత్తం కూడా డాక్టర్ బాబు, వంటలక్క మధ్యలో నడిచేది. ఇప్పుడు మాత్రం పిల్లలతోనే నడుస్తోంది. శౌర్య, హిమ పాత్రలతోనే సీరియల్ ముందుకు సాగుతోంది. శౌర్య పాత్రలో రౌడీగా కృతిక ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

అలా ఫేమస్..
కార్తీకదీపం ఫేమ్ శౌర్య కేవలం తన నటనతోనే ఇంతటి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకోలేదు. ఆమె చేసే సేవా కార్యక్రమాలు, మంచి మనసుతో మరింత మందికి దగ్గరైంది. అనాథాశ్రమాలకు విరాళాలు ఇస్తుంటుంది.. ఎవరికైనా అభిమానులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలంటే సాయం చేసి చూపేడితే విషెస్ చెబుతానంటూ కండీషన్స్ పెడుతుంది.

సినిమాల్లోనూ..
ఇక కార్తీకదీపం సీరియల్ తెచ్చి పెట్టిన క్రేజ్‌తో కృతికకు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మంచి పాత్రలో కనిపించి మెప్పించింది. అలా వెండితెరపైనా కృతిక తన సత్తాను చాటుతోంది. ఇటు బుల్లితెర అటు వెండితెర మరో వైపు సోషల్ మీడియాలోనూ కృతిక దూసుకుపోతోంది.
Recommended Video
తాజాగా అలా..
తాజాగా కృతికకు తన వయసున్న పిల్ల గ్యాంగ్‌లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో తెలిపేలా ఓ వీడియోను షేర్ చేసింది. కృతిక షూటింగ్ నిమిత్తం బయటకు రావడంతో తన కారును చుట్టుముట్టేసింది పిల్లమూకలు. అందులో అందరూ బచ్చా గాళ్లే. వాళ్లంతా కృతికను చూసి రౌడీ అంటూ కేకలు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











