పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. ‘కార్తీక దీపం’ శౌర్య చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే!!
బుల్లితెరపై కార్తీక దీపం ధారావాహికది ఓ సంచలనం. మరీ ముఖ్యంగా వంటలక్క, శౌర్య పాత్రలకు విపరీతమైన ఆదరణ దక్కింది. బుల్లితెరను ఆరాధించే మహిళా లోకం వంటలక్కను నెత్తిన పెట్టుకుంది. ఇక శౌర్య చేసే అల్లరి సైతం అందర్నీ ఆకట్టుకుంటుంది. రౌడీ పిల్లలా వేసే వేషాలు చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందర్నీ ఆకట్టుకుంటాయి. అయితే శౌర్య బుల్లితెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటుందో.. బయట కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంది.

సోషల్ మీడియాలో హల్చల్..
శౌర్య అసలు పేరు కృతిక. కృతిక తన సోషల్ మీడియా ఖాతాలో సందడి చేస్తూ ఉంటుంది. సీరియల్ షూటింగ్‌కు సంబంధించిన విశేషాలు, వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటుంది. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేయాలనే ఉన్నతమైన ఆలోచనలు కలది. ఈ మధ్య కృతిక చేసిన ఓ పని అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

నెటిజన్ అభ్యర్థన..
ఇటీవల ఒక అభిమాని తన భార్య పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పమని కృతికని అభ్యర్థించాడు. దానికి క్రితిక "సరే చెప్తాను కానీ నేను చెప్పిన ఒక పని చెయ్యాలి" అని కండీషన్ పెట్టింది. అందుకు సదరు అభిమాని సరే అన్నాడు. అప్పుడు క్రితిక ‘కనీస అవసరాల సదుపాయం లేని వారికి ఎవరికైనా వెయ్యి రూపాయలతో మీకు తోచిన సహాయం చేయండి. ఆ ఫోటోలు నాకు పంపించండి' అని పేర్కొంది.

సాయం చేశాడు..
కృతిక చెప్పినట్టుగానే ఆ అభిమాని కొంత మందికి పప్పు, బియ్యం, నూనె లాంటి ఇంటికి అవసరమయ్యే సరుకులను ఇచ్చి ఆ ఫోటోలను క్రితికకి పంపించాడు. అప్పుడు క్రితిక అతని భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి సహాయం చేసినందుకు అతనికి కూడా ధన్యవాదాలు చెప్పింది.

స్క్రీన్ షాట్లు వైరల్..
ఇలా వారిమధ్య జరిగిన సంభాషణను స్క్రీన్ షాట్ తీసి క్రితిక తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఎవరో తెలియని ఆ అన్నకు ధన్యవాదాలు.. ఇలా ప్రత్యేక సందర్భాల్లో అవసరంలో ఉన్నవారికి సాయం చేశాడని పేర్కొంది. మీరు కూడా మీకు చేతనైనంతలో ఇతరులకు సాయం చేయండని కోరింది.
Recommended Video

వారే నాకు స్ఫూర్తి..
ఇలాంటి మంచి పనులు చేయడానికి స్పూర్తినిచ్చిన వాళ్లు మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి, ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల అని చెప్పింది. ఇక ఇదే విషయాన్ని ఓ ప్రముఖ దినపత్రిక కూడా ప్రచురించడంతో.. తాను చేసిన ఈ చిన్న పనిని కూడా గుర్తించి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలని తెలిపింది. ఇంత చిన్న వయసులోనే ఎంత పరిణితి సాధించని కృతికకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











