Karthika Deepam కార్తీక్‌ను పసిగట్టిన మోనిత.. మారు వేషంలో డాక్టర్ బాబు.. సీరియల్‌లో హైడ్రామా
కార్తీకదీపం సీరియల్‌లో మరో హై పవర్ ఎపిసోడ్‌కు తెరలేచింది. ఇప్పటి వరకు నత్తనడకలా సాగుతున్న సీరియల్‌లో మోనిత పుల్ ఎంట్రీ ఇవ్వడంతో కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది. తాడిపత్రి గ్రామంలో కష్టాలు పడుతున్న కార్తీక్, దీప కుటుంబం వంట పనులు చేసుకొంటూ కాలం గడుపుతున్నారు. అయితే అదే గ్రామంలో డాక్టర్ అంజలి ఇంటిలో ఫంక్షన్‌కు డాక్టర్ భారతీ, డాక్టర్ మోనిత హాజరుకావడం సీరియల్‌లో ట్విస్టుగా మారింది. అయితే తాజా ఎపిసోడ్ 1269లో ఇంకా ఎలాంటి సన్నివేశాలు చోటుచేసుకొన్నాయంటే..

వంట పనులు చూసుకోమని చెబితే..
డాక్టర్ కార్తీక్ ఇదే ఊర్లో ఉన్నారనే విషయాన్ని తెలుసుకొన్న మోనిత ఆయనను వెతకడానికి బయలుదేరుతానని బెట్టు చేసింది. అయితే ఫంక్షన్ అయ్యేంత వరకు అంజలి ఇంటిలోనే ఉందాం. ఆ తర్వాత కార్తీక్‌ను వెతుకుదామని చెప్పితే మొండికేసింది. అంతలోనే అంజలి వచ్చి.. నా భార్త త్వరలోనే ఊరి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు. మీరు కాస్త వంట పనులు చూసుకోండి అంటూ చెప్పింది. దాంతో మోనితను వంట పనులు చూసుకోమని మోనితకు చెబుతున్నాను అంటూ డాక్టర్ భారతి సమాధానం ఇచ్చింది. దాంతో విసుక్కొంటూ మోనిత దీప, కార్తీక్ వంట చేస్తున్న ప్రదేశం వద్దకు బయలు దేరింది.

వంటపని చేస్తూ కార్తీక్‌ను చూసి షాక్
అయితే వంట పనులు చేస్తున్న ప్రదేశానికి మోనిత వెళ్లుండగా.. నెత్తికి టవల్ కట్టుకొని కార్తీక్ వంట చేయడం చూసిన మోనిత షాక్ గురైంది. కార్తీక్‌ను చూసిన షాక్‌తోపాటు ఆనందంలో అంజలి వద్దకు పరుగెత్తుకెళ్లింది. కార్తీక్ కనిపించాడు.. వంట చేస్తున్నాడనే విషయం చెబితే అంజలి తేలికగా తీసుకొన్నది. దాంతో నీకు చూపిస్తాను రా అంటూ చేతిని పట్టుకొని భారతిని లాక్కెళ్లింది. కార్తీక్‌ను చూసిన భారతీ కూడా షాక్‌కు గురైంది. అయితే మోనిత చూపించిన వ్యక్తి కార్తీక్ కాకపోవడంతో.. నీకు ఎవరిని చూసినా కార్తీక్ మాదిరిగానే కనిపిస్తున్నాడు అంటూ మోనితను భారతి లాక్కెళ్లింది.

భారతీకి కాఫీ ఇచ్చిన దీప..
అయితే డాక్టర్ భారతిని పక్కకు తీసుకెళ్లిన మోనిత.. ఇక్కడ ఉన్న అన్ని హాస్పిటల్స్‌కు ఫోన్ చేసి కార్తీక్ గురించి ఆరా తీద్దామా అంటే.. ఫంక్షన్ కానివ్వు మోనిత.. ఆ తర్వాత చూద్దాం అని భారతీ సర్దిచెప్పబోయింది. అయితే భారతీని వదిలేసి మళ్లీ వంట ప్రదేశానికి మోనిత వచ్చింది. అయితే అంతలోనే డాక్టర్ అంజలి వచ్చి మా ఇంటిలోని అతిథులను పరిచయం చేస్తాను అంటూ తీసుకెళ్లింది. అలా పరిచయం చేస్తుండగా.. దీప.. కాఫీ తీసుకొని ఇంటిలోకి ప్రవేశించింది. కాఫీ ట్రేను తీసుకొని నేరుగా భారతీ వద్దకు వచ్చి కాఫీ ఇచ్చింది. అయితే ఫోన్‌లో బిజీగా మాట్లాడుతుండటంతో దీప ముఖాన్ని భారతీ చూడలేకపోయింది. కానీ భారతీ, మోనితను చూసిన దీప.. ముఖంపై చీర కొంగు కప్పుకొని.. కంగారు పడుతూ కార్తీక్ వద్దకు పరుగెత్తింది.

మోనిత, భారతీ వచ్చారు అంటూ దీప
కార్తీక్ వద్దకు వచ్చిన దీప.. మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి.. వెంటనే వెళ్లిపోవాలి అని అంటే.. శౌర్యకు ఏమైనా అయిందా? లేదా రుద్రాణి మళ్లీ ఏమైనా బెదిరించిందా అని అడిగితే.. అయ్యో అది కాదు.. ఈ ఫంక్షన్‌కు భారతీ, మోనిత వచ్చారు. వారి కంటపడకుండానే వెళ్లిపోదాం అని దీప అంటే.. లేదు లేదు.. మనకు సహాయం చేసిన అంజలి అప్పగించిన పనిని చేయకుండా వెళ్లిపోవడం తప్పు. మనం కష్టాల్లో ఉన్నామని.. ఎదుటి వాళ్ల పనిని మధ్యలోనే వదిలేసి వెళ్లడం సరికాదు అని కార్తీక్ నచ్చజెప్పింది. అంతలోనే డాక్టర్ అంజలి వచ్చి.. మీరు కేక్ కట్ చేసి.. భోజనం చేసి వెళ్లండి.. మరీ మరీ పిలిపించుకోకండి అని అంజలి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ముఖానికి టవల్ చుట్టేసుకొని కార్తీక్
అయితే అంజలి మనసు నొప్పించకూడదని.. ముఖానికి టవల్ చుట్టేసుకొని కార్తీక్, దీప ఫంక్షన్‌లోని కేక్ కటింగ్ ప్రోగ్రాంకు వెళ్లారు. అయితే అక్కడ కేక్ కటింగ్ చేస్తుండగా.. మా ఆనందరావు ఎక్కడ ఉన్నాడో.. ఫస్ట్ బర్త్ డేను గ్రాండ్‌గా చేయాలి. నా పక్కనే కార్తీక్ ఉండాలి అంటూ మోనిత తన మనసులో మోనిత అనుకొంటూ కనిపించింది. ఆ పక్కనే ముఖం కప్పేసుకొన్న కార్తీక్‌ను పిలిచి అందరికి కేక్ పంచి పెట్టండి అంటూ అంజలి పిలిచింది.

అతిథులకు కేక్ పంచుతూ కార్తీక్
అంజలి కూతురు బర్త్ డే వేడుకల్లో కార్తీక్ కేక్ పంచుతుండగా.. భారతీతో మోనిత మాట్లాడుతూ.. కార్తీక్ ఇక్కడే హాస్పిటల్ పెట్టి ఉంటాడా? అని అడిగింది. అయితే ఇప్పుడు కూడా అలాంటి ఆలోచనలేనా అంటూ భారతీ మోనితతో కాస్త కటవుగానే అడిగింది. దాంతో అంజలి జోక్యం కలిగించుకొంటూ... ముందు కేక్ తీరికకగా తినండి.. ఆ తర్వాత మాట్లాడుకొందాం అని చెప్పింది. అంతలోనే కార్తీక్ చేతితో కేక్ ఇవ్వగానే మోనిత అతడిని పసిగట్టింది.
Recommended Video

మీకు కేక్ పంచిన వ్యక్తే.. పేషెంట్ తండ్రి అంటూ
ఇక తాజా ప్రోమోలో నాకు కేక్ ఇచ్చిన వ్యక్తి కార్తీక్ మాదిరిగానే కనిపించాడు. కార్తీక్ సర్జరీ చేసిన పేషెంట్, తల్లిదండ్రులు ఎవరో కనుక్కోవాలి అంటూ అంజలిని మోనిత అడిగింది. దాంతో అంజలి స్పందిస్తూ.. ఆ పేషెంట్ తండ్రి మీకు కేకులు ఇచ్చిన వ్యక్తే అంటూ అంజలి చెప్పింది. అయితే మోనిత చెప్పిన మాటలన్నీ కార్తీక్, దీప జాగ్రత్తగా వింటూ కనిపించారు. తాజా ప్రోమోలో డ్రామా ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ సీరియల్ రేటింగ్ టాప్ పొజిషన్‌లో ఉంది. సుమారు 13.5 రేటింగ్‌తో ఈ సీరియల్ కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











