For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పరిటాల శ్రీరామ్‌తో కార్తీక దీపం హీరో: టీడీపీ లీడర్‌పై ఊహించని కామెంట్.. ఫ్యాన్స్ మధ్య గొడవ

  |

  సాధారణంగా సినిమా హీరోలకు మాత్రమే అభిమానులు భారీ స్థాయిలో ఉంటారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సీరియళ్లలో నటించే వాళ్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. అలా తెలుగు టెలివిజన్‌పై ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న వారిలో బుల్లితెర శోభన్ బాబు నిరుపమ్ పరిటాల ఒకరు. 'కార్తీక దీపం' సీరియల్ వల్ల తన రేంజ్‌ను పెంచుకున్న అతడు.. వరుసగా సీరియళ్లను చేస్తూ దూసుకెళ్తోన్నాడు. అలాగే, సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోన్నాడు. ఇందులో భాగంగానే తాజాగా నిరుపమ్.. టీడీపీ లీడర్‌తో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!సాధారణంగా సినిమా హీరోలకు మాత్రమే అభిమానులు భారీ స్థాయిలో ఉంటారు.

  అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సీరియళ్లలో నటించే వాళ్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. అలా తెలుగు టెలివిజన్‌పై ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న వారిలో బుల్లితెర శోభన్ బాబు నిరుపమ్ పరిటాల ఒకరు. 'కార్తీక దీపం' సీరియల్ వల్ల తన రేంజ్‌ను పెంచుకున్న అతడు.. వరుసగా సీరియళ్లను చేస్తూ దూసుకెళ్తోన్నాడు. అలాగే, సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోన్నాడు. ఇందులో భాగంగానే తాజాగా నిరుపమ్.. టీడీపీ లీడర్‌తో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

   అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

  అలా పరిచయం.. ఫుల్ ఫేమస్


  సీనియర్ నటుడు ఓంకార్ కుమారుడిగా నిరుపమ్ పరిటాల బుల్లితెరపైకి అడుగు పెట్టాడు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారి కొన్ని సీరియళ్లలో నటించాడు. ఇలా వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అద్భుతమైన నటనతో పాటు హావభావాలను చక్కగా పలికిస్తూ తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యాడు.

  తెలుగు పిల్ల డింపుల్ అందాల జాతర: ఎద భాగం కనిపించేలా ఏకంగా ఫ్లైట్‌లోనే!

  హీరోయిన్‌తో ప్రేమ వివాహంతో

  హీరోయిన్‌తో ప్రేమ వివాహంతో


  'చంద్రముఖి' అనే సీరియల్‌లో నిరుపమ్ పరిటాల హీరోగా చేశాడు. అందులో మంజుల హీరోయిన్‌గా చేసింది. ఈ సీరియల్ నడుస్తోన్న సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇలా చాలా కాలం పాటు ఒకరినొకరు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. తర్వాత ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.

  కార్తీక దీపంతో క్రేజ్ రెట్టింపుగా

  కార్తీక దీపంతో క్రేజ్ రెట్టింపుగా

  బుల్లితెర స్టార్ నిరుపమ్ పరిటాలకు యాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఇక, 'కార్తీక దీపం' సీరియల్ వల్ల హీరో కార్తీక్ పాత్రలో నటించిన అతడు తన సత్తాను నిరూపించుకున్నాడు. అద్భుతమైన నటన, హావభావాలు, ఎమోషనల్ సీన్స్‌తో అలరించాడు. ముఖ్యంగా డాక్టర్ బాబు పాత్రతో తెలుగు వాళ్లకు కలకాలం గుర్తుండిపోయాడు. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకున్నాడు.

  జబర్ధస్త్ వర్ష సొగసుల జాతర: అతి చిన్న డ్రెస్‌లో ఆ పార్ట్ కనిపించేలా!

  కథ ముగిసింది.. ఫ్యాన్స్ నిరాశ

  కథ ముగిసింది.. ఫ్యాన్స్ నిరాశ


  దాదాపు 1600 ఎపిసోడ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించి.. అత్యధిక రేటింగ్‌తో నెంబర్ వన్ సీరియల్‌గా పేరు తెచ్చుకుంది 'కార్తీక దీపం'. ఇది జనవరి 23 సోమవారం ఎపిసోడ్‌తో పూర్తి కాబోతుంది. దీంతో ఫ్యాన్స్ అంతా నిరాశగా ఉన్నారు. ఇక, ఇటీవలే నిరుపమ్, ప్రేమ్ విశ్వనాథ్‌కు స్టార్ మాలోని ఓ షోలో ఫేరెవెల్ పార్టీ కూడా ఇచ్చారు. ఇదెంతో ఎమోషనల్‌గా సాగిన విషయం తెలిసిందే.

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ


  కొన్ని ఛానెళ్లలో వరుస సీరియళ్లతో బిజీ బిజీగా గడుపుతున్నప్పటికీ 'కార్తీక దీపం' హీరో నిరుపమ్ పరిటాల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తరచూ తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను అందులో పంచుకుంటూ ఉంటాడు. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం పోస్ట్ చేస్తూ తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోన్నాడు.

  బీచ్‌లో తెలుగు పిల్ల అనన్య నాగళ్ల హాట్ షో: ఎద అందాలను అలా చూపిస్తూ!

   పరిటాల శ్రీరామ్‌తో నిరుపమ్

  పరిటాల శ్రీరామ్‌తో నిరుపమ్


  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సీరియల్ హీరో నిరుపమ్ పరిటాల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ అదిరిపోయే ఫొటోను షేర్ చేశాడు. అందులో అతడు.. పరిటాల రవీంద్ర కుమారుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు శ్రీరామ్‌తో కలిసి కనిపించాడు. అనుకోకుండా అతడిని కలిశానని చెప్పిన నిరుపమ్‌.. తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో కూడా పంచుకున్నాడు.

  ఆ మాటలతో ఫ్యాన్స్ గొడవ

  ఆ మాటలతో ఫ్యాన్స్ గొడవ


  పరిటాల శ్రీరామ్‌తో దిగిన ఫొటోను షేర్ చేసిన నిరుపమ్.. అతడిని 'రియల్ హీరో' అంటూ కామెంట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో చిచ్చు రేగింది. 'శ్రీరామ్ రియల్ హీరోనా' అంటూ కొందరు వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు. దీనికి మరికొందరు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కుల ప్రస్థావనతో కూడా గొడవ జరుగుతోంది. దీంతో ఇప్పుడీ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.

  English summary
  Karthika Deepam Hero Nirupam Paritala Very Active In Social Media. Now He Met TDP Leader Paritala Sriram and Shares This Pic In Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X