For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘కార్తీక దీపం’ హీరో నిరుపమ్ అరెస్ట్: ఆ ఫొటో షేర్ చేయడంతో కేసు.. విషయం చెప్పి బాధ పడిన స్టార్

  |

  తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇక్కడ చాలా మంది స్టార్లు భారీ ఫ్యాన్ బేస్‌తో సత్తా చాటుతున్నారు. అదే సమయంలో సీరియల్‌లో నటించే నటీనటులకు కూడా మన దగ్గర మంచి ఫాలోయింగే ఉంది. మరీ ముఖ్యంగా సూపర్ డూపర్ హిట్ సీరియల్ 'కార్తీక దీపం'లో చేస్తున్న వాళ్లకు ఒకింత ఎక్కువగానే ఆదరణ దక్కుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో హీరోగా చేస్తోన్న నిరుపమ్ పరిటాల కొంత కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తున్నాడు. తద్వారా వరుసగా సీరియళ్లు చేస్తూ సత్తా చాటుతున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిరుపమ్.. ఇటీవల ఓ ఫొటోను షేర్ చేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ‘కార్తీక దీపం' సీరియల్ ఎలా మొదలైంది?

  ‘కార్తీక దీపం' సీరియల్ ఎలా మొదలైంది?

  చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ సీరియల్‌గా వెలుగొందుతోంది 'కార్తీక దీపం'. సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న ఈ ధారావాహిక మొదట మలయాళంలో 'కరుతముత్తు' అనే టైటిల్‌తో ప్రసారం అయింది. అక్కడ ఇది సూపర్ హిట్ అయింది. అందులోనూ ప్రేమీ విశ్వనాథే హీరోయిన్‌గా చేసింది. కాకపోతే కథలో కొన్ని మార్పులు చేసిన డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర దీన్ని సక్సెస్ చేశారు. ఫలితంగా ఈ సీరియల్ టెలివిజన్‌పై హవాను చూపిస్తూ దూసుకెళ్తోంది. ఇందులో నిరుపమ్ పరిటాల హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే.

  Anchor Pradeepపై సునీత సంచలన వ్యాఖ్యలు: ఆడవాళ్లపై అలా.. అందుకే పెళ్లి కావట్లేదంటూ!

  ఇండియాలోనే నెంబర్ వన్ సీరియల్ ఇదే

  ఇండియాలోనే నెంబర్ వన్ సీరియల్ ఇదే

  ఆరంభం నుంచే 'కార్తీక దీపం' సీరియల్‌కు తెలుగు ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందిస్తున్నారు. ఆ టైమ్ వచ్చిందంటే చాలు.. రెండు రాష్ట్రాల్లోని చాలా మంది ఆడవాళ్లు టీవీల ముందు వాలిపోతున్నారు. దీనికి మగ అభిమానులు కూడా ఉన్నారన్న విషయం చెప్పనక్కర్లేదు. అందుకే దాదాపు మూడున్నరేళ్లుగా వెయ్యికి పైగా ఎపిసోడ్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అదే సమయంలో టీఆర్పీ రేటింగ్‌లోనూ సత్తా చాటుతూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తెలుగులో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈ సీరియల్.. జాతీయ స్థాయిలో టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది.

  బుల్లితెర శోభన్ బాబుకు భారీ స్థాయి క్రేజ్

  బుల్లితెర శోభన్ బాబుకు భారీ స్థాయి క్రేజ్

  'కార్తీక దీపం' సీరియల్ వల్ల హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫాలోయింగ్ పెరిగిపోయింది. అదే సమయంలో 'కార్తీక దీపం' సీరియల్‌లో హీరో కార్తీక్ పాత్రలో నటిస్తోన్న మన బుల్లితెర శోభన్ బాబుగా పేరిందిన నటుడు నిరుపమ్ పరిటాల కూడా తన సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. అద్భుతమైన నటనతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నాడు. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకున్నాడు. అదే సమయంలో పలు ఛానెళ్లలో సీరియళ్లు చేస్తూ హవాను చూపిస్తున్నాడు. ప్రముఖ నటుడు ఓంకార్ కుమారుడే ఈ నిరుపమ్ పరిటాల.

  Bigg Boss Telugu 5 సుడిగాలి సుధీర్‌కు బిగ్ బాస్ దిమ్మతిరిగే ఆఫర్: ఆ స్టార్ హీరో రేంజ్‌లో!

  అందులో నిరుపమ్‌కు భారీగా ఫాలోయింగ్

  అందులో నిరుపమ్‌కు భారీగా ఫాలోయింగ్

  పలు ఛానెళ్లలో వరుస సీరియళ్లతో బిజీ బిజీగా గడుపుతున్నప్పటికీ 'కార్తీక దీపం' హీరో నిరుపమ్ పరిటాల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తరచూ తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను అందులో పంచుకుంటూ ఉంటాడు. అదే సమయంలో సీరియల్ సెట్స్‌లో జరిగిన ఫన్నీ సంఘటనలను కూడా షేర్ చేసుకుంటాడు. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం పోస్ట్ చేస్తుంటాడు. ఇక, ఇందులోనూ అతడికి ఫాలోయింగ్ భారీగానే ఉంది. అందుకే నిరుపమ్ పరిటాల పెట్టే పోస్టులకు లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి.

   పోలీస్ స్టేషన్‌లో నిరుపమ్.. అరెస్ట్ అంటూ

  పోలీస్ స్టేషన్‌లో నిరుపమ్.. అరెస్ట్ అంటూ

  బుల్లితెరపై స్టార్‌గా వెలుగొందుతోన్న నిరుపమ్ పరిటాల.. స్టార్ మాలో 'కార్తీక దీపం'తో పాటు జీ తెలుగులో 'హిస్టర్ గారి పెళ్లాం' అనే సీరియళ్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దానికి దీనికి డేట్స్ కేటాయిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇవే కాక స్పెషల్ ఈవెంట్లు, గేమ్ షోలలోనూ పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అలాగే, మరికొన్ని ఆఫర్లు కూడా అతడికి వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బుల్లితెర స్టార్ హీరో నిరుపమ్ పరిటాల అరెస్ట్ అయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో అతడి అభిమానులు అందోళనగా ఉన్నారు.

   ఏసేయండి అంటే నన్ను ఏసేశారు అని పోస్ట్

  ఏసేయండి అంటే నన్ను ఏసేశారు అని పోస్ట్

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిరుపమ్ పరిటాల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశాడు. ఇందులో అతడు పోలీస్ స్టేషన్‌లోని కటకటాల లోపల దిగాలుగా ఉన్నాడు. దీన్ని పోస్ట్ చేసిన ఈ స్టార్ హీరో.. 'గన్‌తో పిక్ పెడితే ఏసేయండి ఏసేయండీ అన్నారు. ఇప్పుడేమో పోలీసోళ్లు నన్ను ఏసేశారు. దీనికి హూ ఈజ్ రెస్పాన్స్‌బిలిటీ? అహా ఎవరు బాధ్యత వహిస్తారు. నన్ను ఎవరు విడిపిస్తారు? చెప్పండి' అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. దీంతో అతడు అరెస్ట్ అయింది నిజం కాదని.. ఇదో ఫన్నీ పోస్ట్ అని అందరికీ ఆ తర్వాత అర్థం అయింది.

  ఘాటు ఫొటోలతో షాకిచ్చిన రుహానీ శర్మ: సినిమాల్లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!

  తుపాకీతో నిరుపమ్ హల్‌చల్.. అప్పుడలా

  తుపాకీతో నిరుపమ్ హల్‌చల్.. అప్పుడలా

  'కార్తీక దీపం' సీరియల్‌లో మోనిత చేస్తున్న మోసం గురించి కార్తీక్‌కు నిజం తెలిసిపోతుంది. దీంతో ఆమెను చంపడానికి రెడీ అవుతాడు. ఈ క్రమంలోనే తుపాకీ పట్టుకుని వెళ్తాడు. ఆ డమ్మీ గన్ పట్టుకునే నిరుపమ్ పరిటాల సోషల్ మీడియాలో రెండు రోజుల క్రితం ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. ఇప్పుడు దాని వల్లే తాను అరెస్ట్ అయ్యానంటూ ఫన్నీగా పోస్ట్ చేశాడు. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఫలితంగా ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముందుగా ఇది చూసిన వాళ్లంతా అతడు నిజంగానే అరెస్ట్ అయ్యాడని భ్రమపడుతున్నారు.

  English summary
  Karthika Deepam Hero Nirupam Paritala Very Active In Social Media. Now He Posted his Photo in Instagram. in This Post He is in Police Station.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X