For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజకీయాల్లోకి ‘కార్తీక దీపం’ హీరోయిన్: తెలుగు రాష్ట్రంలోనే పోటీ.. ఏ పార్టీలో చేరుతారు అని అడిగితే!

  |

  ఒకప్పుడు సినిమా హీరోయిన్లనే దేవతలుగా ఆరాధించేవారు. అంతలా వాళ్లు సహజమైన నటనతో ప్రతి ఇంటి ఆడపడుచులా మారిపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి సినిమా రంగం కంటే సీరియళ్ల విషయంలో ఎక్కువగా కనిపిస్తోంది. చాలా కాలంగా తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లలోని హీరోయిన్లపై ఆడియెన్స్ ప్రేమను కురిపిస్తున్నారు. అలా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోన్న వారిలో 'కార్తీక దీపం' హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ ఒకరు. ఒకే ఒక్క సీరియల్‌తో ఎనలేని క్రేజ్‌ను అందుకున్న ఈ భామ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. ఆ వివరాలు మీకోసం!

  దమ్ము కొడుతూ దొరికిపోయిన స్టార్ హీరోయిన్లు.. నయనతార, ప్రియాంక, కంగన స్టైల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

  అది చూసే.. ఇక్కడ తీసుకున్నారు

  అది చూసే.. ఇక్కడ తీసుకున్నారు

  తెలుగులో ‘కార్తీక దీపం' పేరుతో ప్రసారం అవుతోన్న సీరియల్.. దీని కంటే ముందే మలయాళంలో వచ్చింది. ‘కరుతముత్తు' అనే పేరుతో ప్రసారం అయిన దీనికి అక్కడ ఎనలేని స్పందన వచ్చింది. ఫలితంగా అందులో చేసిన హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్‌కు మంచి పేరు వచ్చింది. అది చూసే తెలుగులోకి కూడా ఆమెను తీసుకుని రీమేక్ చేశారు. వాళ్లు తీసుకున్న నిర్ణయం బాగా కలిసొచ్చింది.

  అదరగొట్టిన వంటలక్క... భారీ క్రేజ్

  అదరగొట్టిన వంటలక్క... భారీ క్రేజ్

  సాదాసీదా సీరియల్‌గా తెలుగులో ప్రారంభం అయింది ‘కార్తీక దీపం'. ఆరంభంలో దీనికి పెద్దగా ఆదరణ లభిస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ, రోజులు గడిచిన కొద్దీ తెలుగు ప్రేక్షకులు ఈ సీరియల్‌కు ఫిదా అయిపోయారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ నటనకు పడిపోయారు. అందుకే ఈమె దాదాపు మూడున్నరేళ్లుగా తెలుగింటి ఆడపచుడు అయిపోయింది.

  దేశ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం

  దేశ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం

  ‘కార్తీక దీపం' సీరియల్‌లో మంచి కాస్టింగ్ ఉన్నప్పటికీ ప్రేమీ విశ్వనాథ్ మాత్రం తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేసింది. ఫలితంగా ఈ సీరియల్‌కు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా మూడేళ్లుగా తెలుగులో ఇదే నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంటోంది. అదే సమయంలో భారీగా రేటింగ్ అందుకుని దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకుంది.

  ఆ భాషలోనే కాదు.. ఇక్కడ కూడా

  ఆ భాషలోనే కాదు.. ఇక్కడ కూడా

  తెలుగులోకి ప్రవేశించక ముందే ‘కార్తీక దీపం' హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్‌కు మంచి గుర్తింపు దక్కింది. మలయాళంలో ఆమె పలు సీరియళ్లతో పాటు కొన్ని చిత్రాల్లోనూ కనిపించింది. దీంతో ఈ బ్యూటీకి అక్కడ భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు తెలుగులోనూ ఒకే ఒక్క సీరియల్‌తో హవా చూపిస్తోంది. ఫలితంగా రెండు చోట్లా ఒకే రకమైన ఆదరణతో దూసుకుపోతోంది.

  ఎప్పుడూ అందులోనే.. అన్నీ చెప్తూ

  ఎప్పుడూ అందులోనే.. అన్నీ చెప్తూ

  కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ప్రేమీ విశ్వనాథ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది. అంతేకాదు, తన ఫొటోలు, వీడియోలు వదులుతూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. ఫలితంగా ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.

  రాజకీయాల్లోకి వంటలక్క ప్రవేశం

  రాజకీయాల్లోకి వంటలక్క ప్రవేశం

  రెండు భాషల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గానూ ప్రేమీ విశ్వనాథ్ ఆ మధ్య యూట్యూబ్ ఛానెల్‌కు కూడా ప్రారంభించింది. తాజాగా ఇందులో ‘కార్తీక దీపం' షూటింగ్ స్పాట్‌లో చేసిన ఓ వీడియోను వదిలింది. అందులో ఎన్నో విషయాలపై చర్చిస్తూ కనిపించింది. ఈ క్రమంలోనే నిర్మాతతో జరిగిన సంభాషణలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చిందీ బ్యూటీ.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
   ఏ పార్టీలో చేరుతారు అని అడిగితే!

  ఏ పార్టీలో చేరుతారు అని అడిగితే!

  ఈ వీడియోలో ప్రేమీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘కేరళలో మా పార్టీ గెలిచింది. మొత్తం ఎరుపుమయం అయింది' అంది. దీనికి ‘నిర్మాత వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ ఇస్తారా' అని ప్రశ్నించగా.. తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. అప్పుడాయన ‘ఏపీలో టికెట్ ఇస్తే పోటీ చేస్తారా' అని అడగగా.. వెంటనే చేస్తానని చెప్పేసింది. మరి ఏ పార్టీలో చేరతావు అని అడిగితే మాత్రం సమాధానం దాటవేసింది.

  English summary
  Karthika Deepam Is Top Serial in Telugu Television History. Now Heroine Premi Viswanath Interesting Comments on her Political Entry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X