twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కార్తీక దీపం’ హీరోయిన్ అరుదైన రికార్డు: తెలుగులో ఈ ఘనత సాధించిన ఏకైక నటిగా వంటలక్క

    |

    బుల్లితెరపై వచ్చే కార్యక్రమాలు అన్నింటిలో ప్రతి రోజూ సాయంత్రం సమయంలో ప్రసారం అయ్యే సీరియళ్లకు ఎక్కువ ఆదరణ లభిస్తుంటుంది. తెలుగులో ఇది కొంచెం ఎక్కువ అనే చెప్పాలి. అందుకే మన భాషలో వచ్చే ధారావాహికలు చాలా కాలం విజయవంతంగా ప్రసారం అవుతూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందనను అందుకుంటాయి. అందులో స్టార్ మాలో వచ్చే 'కార్తీక దీపం' ఒకటి. ఈ సీరియల్‌లో హీరోయిన్‌గా చేస్తున్న ప్రేమీ విశ్వనాథ్‌కు కూడా ఎనలేని క్రేజ్ వచ్చింది. తాజాగా ఈమె ఓ అరుదైన రికార్డును సాధించింది. వివరాల్లోకి వెళ్తే...

    అప్పుడు ఆ సీరియళ్లు.. ఇప్పుడు కార్తీక దీపమే

    అప్పుడు ఆ సీరియళ్లు.. ఇప్పుడు కార్తీక దీపమే

    మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులోనే సీరియళ్లకు ఎక్కువ స్పందన వస్తోంది. దీంతో చాలా ఛానెళ్లు సరికొత్త ధారావాహికలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గతంలో 'అంతరంగాలు', 'ఎండమావులు', 'చక్రవాకం', 'మొగలిరేకులు' వంటి సీరియల్స్ సుదీర్ఘంగా ప్రదర్శితమయ్యాయి. ఇప్పుడు స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కార్తీక దీపం' కూడా ఆ రేంజ్ స్పందనను అందుకుంది.

    ఆ భాషలోనే మొదలు.. దానికి రీమేక్‌గా వస్తోంది

    ఆ భాషలోనే మొదలు.. దానికి రీమేక్‌గా వస్తోంది

    తెలుగులో నెంబర్ వన్ సీరియల్‌గా ఉన్న 'కార్తీక దీపం'.. మలయాళంలో 2014లో ప్రసారమై సూపర్ హిట్‌గా నిలిచిన 'కరుతముత్తు'కు రీమేక్‌ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇక, ఇందులో హీరో డాక్టర్ బాబు.. దీప అలియాస్ వంటలక్కను పెళ్లి చేసుకుని అనుమానంతో వదిలేస్తాడు. ఆ తర్వాత ఆమెకు పుట్టిన కవలలు తల్లిదండ్రులను ఎలా కలిపారనేదే ఈ సీరియల్ కథ.

    వంటలక్క.. తెలుగు వారి ఆడపడుచు అయింది

    వంటలక్క.. తెలుగు వారి ఆడపడుచు అయింది

    దాదాపు మూడేళ్లుగా స్టార్ మాలో ప్రసారం అవుతోంది 'కార్తీక దీపం' సీరియల్. మొదటి నుంచీ ప్రేక్షకాదరణ పొందిన దీనికి భారీ స్థాయిలో రేటింగ్ వస్తోంది. ఇక, ఇందులో హీరోయిన్‌గా చేస్తున్న ప్రేమీ విశ్వనాథ్‌కు కూడా అదే స్థాయిలో పాపులారిటీ వచ్చింది. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ప్రతి ఒక్కరూ ఆమెను తమ ఆడపడుచుగా చేసేసుకున్నారు.

    దేశంలోనే మొదటి సీరియల్.... అసాధారణ క్రేజ్

    దేశంలోనే మొదటి సీరియల్.... అసాధారణ క్రేజ్

    'కార్తీక దీపం' ముందు బడా హీరోల సినిమాలు సైతం తట్టుకోలేకపోతున్నాయి. అంతేకాదు, ఎన్నో చానెళ్లలో వస్తున్న కామెడీ షోలు సైతం దీని ముందు దిగదుడుపే అన్నట్లుగా ఉంటున్నాయి. అంతలా రేటింగ్ సాధిస్తోందీ వంటలక్క సీరియల్. దాదాపు రెండున్నరేళ్లుగా ఇదే రేంజ్‌లో రేటింగ్ రాబడుతూ ఇండియాలోనే ఈ ఘనత సాధించిన మొదటి సీరియల్‌గా నిలుస్తోంది.

    ‘కార్తీక దీపం' హీరోయిన్ ఖాతాలో అరుదైన రికార్డ్

    ‘కార్తీక దీపం' హీరోయిన్ ఖాతాలో అరుదైన రికార్డ్

    అద్భుతమైన నటనతో చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై తన హవాను చూపిస్తోంది 'కార్తీక దీపం' హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్. అసాధారణ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. ఇలాంటి సమయంలో ప్రేమీ విశ్వనాథ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

    ఈ ఘనత సాధించిన ఏకైక నటిగా వంటలక్క

    ఈ ఘనత సాధించిన ఏకైక నటిగా వంటలక్క

    దేశ వ్యాప్తంగా బుల్లితెరపై ఉత్తమ నటీనటులను ఎంపిక చేసే ఆర్మాక్స్ మీడియా తాజాగా 2020 సంవత్సరానికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉత్తమ కల్పిత పాత్రల విభాగంలో తెలుగు నుంచి ప్రేమీ విశ్వనాథ్ (కార్తీక దీపం) ఎంపికైంది. అలాగే, హిందీలో జెతాలాల్, తమిళంలో ముల్లాయి, బెంగాళీలో శ్రీమోయీ, మరాఠీలో అరుందతీ అనే పాత్రలు ఎంపికయ్యాయి.

    English summary
    Deepa, a dark-skinned girl, is treated badly by her fair-skinned sister. She gets married to Dr Karthik but has to fight societal and family pressures in order to lead a happy married life. A mother, a wife, and a daughter-in-law were Tulasi's identity, but when these relations turned their back on her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X