For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘Karthika Deepam’ హీరోయిన్ కన్నీటి పర్యంతం: తన తండ్రి పరిస్థితిని చెబుతూ.. ఎప్పుడూ ఇలా జరగలేదంటూ!

  |

  ప్రేమీ విశ్వనాథ్.. ఈ పేరు చెబితే తెలియకపోవచ్చు కానీ.. 'కార్తీక దీపం' హీరోయిన్ దీప అలియాస్ వంటలక్క అంటే మాత్రం అందరూ గుర్తు పట్టేస్తారు. అంతలా ఈ అమ్మడు తెలుగు బుల్లితెరపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. అదే సమయంలో అద్భుతమైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలెబ్రిటీ అయిపోయింది. ఇంతటి పేరు సంపాదించిన ఈమె.. తాజాగా నిర్వహించిన లైవ్‌లో తన తండ్రి పరిస్థితిని వివరిస్తూ కన్నీటి పర్యంతం అయింది. అసలు ప్రేమీ విశ్వనాథ్ తండ్రికి ఏమైంది? ఆమె ఎందుకు ఏడ్చింది? పూర్తి వివరాలు మీకోసం!

  అక్కడ ఫేమస్... అందుకే ఇక్కడకు

  అక్కడ ఫేమస్... అందుకే ఇక్కడకు

  చాలా తక్కువ సమయంలోనే మలయాళంలో బుల్లితెరపై తన హవాను చూపించి స్టార్‌గా ఎదిగిపోయింది ప్రేమీ విశ్వనాథ్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సీరియళ్లలో నటించిన ఆమె.. ‘కరుతముత్తు' అనే సీరియల్‌లో అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఇందులో ఆమె పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అదే తెలుగులోకి ‘కార్తీక దీపం' అనే పేరుతో రీమేక్ అయింది.

  ఒకే ఒక్క పాత్రతో అదుర్స్ అనిపించి

  ఒకే ఒక్క పాత్రతో అదుర్స్ అనిపించి

  ‘కరుతముత్తు'లో నటించిన ప్రేమీ విశ్వనాథ్‌ యాక్టింగ్ చూసిన తెలుగు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర ‘కార్తీక దీపం' కోసం ఆమెను ఇక్కడకు తీసుకొచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సీరియల్‌లో దీప అలియాస్ వంటలక్కగా ఆమె అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇస్తోంది. ఎలాంటి సీన్‌నైనా అలవోకగా చేస్తూ.. యాక్టింగ్‌కు భాషతో సంబంధం లేదని నిరూపింస్తోందీ మలయాళ కుట్టి.

   తెలుగింటి ఆడపడుచు... ఫ్యాన్ బేస్

  తెలుగింటి ఆడపడుచు... ఫ్యాన్ బేస్

  ప్రేమీ విశ్వనాథ్ తెలుగులో చేసింది ‘కార్తీక దీపం' ఒక్కటే. ఈ ఒక్క సీరియల్‌తోనే ఆమెకు భారీ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఆమె ఏడిస్తే ఏడ్చేవాళ్లు.. నవ్వితే నవ్వే వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఉన్నారు. అంతలా తన ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోందామె. ఇలా ఈ సీరియల్ వల్ల ప్రేమీ విశ్వనాథ్ తెలుగింటి ఆడపడుచుగా మారిపోయి.. ఇక్కడా ఫాలోయింగ్‌ను తెచ్చుకుంది.

   ఈ సీరియల్‌తో దేశ వ్యాప్తంగా ఫేమస్

  ఈ సీరియల్‌తో దేశ వ్యాప్తంగా ఫేమస్

  ‘కార్తీక దీపం' సీరియల్ దాదాపు మూడున్నరేళ్లుగా ప్రసారం అవుతోంది. దీనికి ఆరంభం నుంచే భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇది రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా జాతీయ స్థాయిలోనూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సీరియల్ ద్వారా ప్రేమీ విశ్వనాథ్ కూడా దేశ వ్యాప్తంగా ఊహించని స్థాయిలో గుర్తింపును అందుకుంది.

   వ్యాపార ప్రకటనలు.. సుమతో కలిసి

  వ్యాపార ప్రకటనలు.. సుమతో కలిసి

  ప్రేమీ విశ్వనాథ్ తెలుగులో ‘కార్తీక దీపం' చేస్తోన్న సమయంలోనే ఆమెకు ఎన్నో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సినిమా అవకాశాలు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, ఆమె మాత్రం ఆ సీరియల్‌కే పరిమితం అయిపోయింది. అదే సమయంలో యాంకర్ సుమతో కలిసి ఓ బ్రాండ్‌కు అంబాసీడర్‌గా పని చేస్తోంది. దీని కోసం తరచూ వ్యాపార ప్రకటనల్లో నటిస్తోంది.

  దాని కోసం స్పెషల్ లైవ్.. ఎమోషనల్

  దాని కోసం స్పెషల్ లైవ్.. ఎమోషనల్

  ‘కార్తీక దీపం' హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ అంబాసీడర్‌గా వ్యవహరిస్తోన్న ప్రొడక్ట్ కోసం ఆదివారం సుమ కనకాలతో కలిసి లైవ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు జీవితంలోని ఎన్నో విశేషాలను పంచుకుంది. అదే సమయంలో తన కుటుంబ పరిస్థితులను చెబుతూ.. తండ్రి ప్రేమ గురించి వివరిస్తూ బాగా ఎమోషనల్ అయిపోయింది.

  తండ్రి గురించి ప్రేమీ కన్నీటి పర్యంతం

  తండ్రి గురించి ప్రేమీ కన్నీటి పర్యంతం

  ఈ లైవ్‌లో ప్రేమీ మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో నేను అటు ఇటు తిరగడం నా తండ్రికి ఇష్టం లేదు. ఆయన నా గురించి ఎప్పుడూ బాధపడతారు. ఇంటికి వెళ్తే అప్పుడు సంతోషిస్తారు. నేను కూడా షూట్ కంప్లీట్ అయిన వెంటనే ఆయన ముందు వాలిపోతా' అంటూ కన్నీటి పర్యంతం అయిందామె. తానెప్పుడూ బయట ఏడవలేదని.. ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పుకొచ్చిది వంటలక్క.

  English summary
  Karthika Deepam Is Top Serial in Telugu Television History. Now Heroine Premi Viswanath Crying About her Father in Suma Kanakala Live.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X