మేకప్‌ మ్యాన్‌కు ‘కార్తీక దీపం’ వంటలక్క షాక్: సెట్స్‌లో ఊహించని పని చేసిన ప్రేమీ విశ్వనాథ్

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే బుల్లితెరపై నటించే వాళ్లకు సినీ యాక్టర్లతో సమానమైన ఫాలోయింగ్ వస్తుంది. ఇలా ఇప్పటికే ఎంతో మంది నటీనటులు స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో 'కార్తీక దీపం' సీరియల్ హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ ఒకరు. చాలా తక్కువ సమయంలోనే ఎవరూ అనుకోని స్థాయిలో పాపులర్ అయిన ఈమె.. సీరియల్ సెట్స్‌లో మేకప్ మ్యాన్ కోసం ఊహించని పని చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

 ‘కార్తీక దీపం' మొదలవడానికి కారణం ఇదే

‘కార్తీక దీపం' మొదలవడానికి కారణం ఇదే

తెలుగులో నెంబర్ వన్ సీరియల్‌గా ఉన్న 'కార్తీక దీపం'.. మలయాళంలో 2014లో ప్రసారమై సూపర్ హిట్‌గా నిలిచిన 'కరుతముత్తు'కు రీమేక్‌ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇక, ఇందులో హీరో డాక్టర్ బాబు.. దీప అలియాస్ వంటలక్కను పెళ్లి చేసుకుని అనుమానంతో వదిలేస్తాడు. ఆ తర్వాత ఆమెకు పుట్టిన కవలలు తల్లిదండ్రులను ఎలా కలిపారనేదే ఈ సీరియల్ కథ.

వంటలక్క... తెలుగులో టాప్ హీరోయిన్‌గా

వంటలక్క... తెలుగులో టాప్ హీరోయిన్‌గా

దాదాపు మూడేళ్లుగా స్టార్ మాలో ప్రసారం అవుతోంది 'కార్తీక దీపం' సీరియల్. మొదటి నుంచీ ప్రేక్షకాదరణ పొందిన దీనికి భారీ స్థాయిలో రేటింగ్ వస్తోంది. ఇక, ఇందులో హీరోయిన్‌గా చేస్తున్న ప్రేమీ విశ్వనాథ్‌కు కూడా అదే స్థాయిలో పాపులారిటీ వచ్చింది. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ప్రతి ఒక్కరూ ఆమెను తమ ఆడపడుచుగా చేసేసుకున్నారు.

ఇండియాలోనే ఫస్ట్ సీరియల్ ‘కార్తీక దీపం'

ఇండియాలోనే ఫస్ట్ సీరియల్ ‘కార్తీక దీపం'

'కార్తీక దీపం' ముందు బడా హీరోల సినిమాలు సైతం తట్టుకోలేకపోతున్నాయి. అంతేకాదు, ఎన్నో చానెళ్లలో వస్తున్న కామెడీ షోలు సైతం దీని ముందు దిగదుడుపే అన్నట్లుగా ఉంటున్నాయి. అంతలా రేటింగ్ సాధిస్తోందీ వంటలక్క సీరియల్. దాదాపు రెండున్నరేళ్లుగా ఇదే రేంజ్‌లో రేటింగ్ రాబడుతూ ఇండియాలోనే ఈ ఘనత సాధించిన మొదటి సీరియల్‌గా నిలుస్తోంది.

హీరోయిన్ ఖాతాలో ఎన్నో అరుదైన రికార్డ్స్

హీరోయిన్ ఖాతాలో ఎన్నో అరుదైన రికార్డ్స్

అద్భుతమైన నటనతో చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై తన హవాను చూపిస్తోంది 'కార్తీక దీపం' హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్. అసాధారణ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. ఇలాంటి సమయంలో ప్రేమీ విశ్వనాథ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

అక్కడ ఫుల్ బిజీ... అన్నీ అప్‌డేట్స్ చేస్తూ

అక్కడ ఫుల్ బిజీ... అన్నీ అప్‌డేట్స్ చేస్తూ

నటిగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది. అంతేకాదు, కెరీర్‌కు సంబంధించిన విశేషాలనూ షేర్ చేస్తోంది. దీనితో పాటు తన ఫొటోలు, వీడియోలు వదులుతూ తన అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉంటోంది.

మేకప్‌ మ్యాన్‌కు ‘కార్తీక దీపం' వంటలక్క షాక్

మేకప్‌ మ్యాన్‌కు ‘కార్తీక దీపం' వంటలక్క షాక్

'కార్తీక దీపం' సెట్‌లో ప్రేమీ విశ్వనాథ్ ఊహించని పని చేసింది. మూడేళ్లుగా తనకు మేకప్ మ్యాన్‌గా పని చేస్తున్న భరత్ అనే వ్యక్తికి ఖరీదైన స్టార్మ్ ఫోన్ గిప్టుగా ఇచ్చింది. తన అభిమాన హీరోయిన్ చేసిన పనికి అతడు షాకైపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆమెనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మూడెళ్ల బంధానికి చిన్న గిఫ్ట్ అంటూ అందులో చెప్పుకొచ్చిందామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X