Bigg Boss Telugu 7: షోలోకి కార్తీక దీపం హీరోయిన్ ఎంట్రీ.. ఒక్క పోస్టుతో తేల్చేసిన వంటలక్క
కాన్సెప్టుతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎప్పుడు ప్రసారం అయినా భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటోన్న షోనే బిగ్ బాస్. ఏడేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో విజయాన్ని అందుకున్న ఇది.. దేశంలోనే టాప్ షోగా నిలిచింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇక, ఇందులోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా రాబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఓ సెలెబ్రిటీ క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే...
ఉల్టా పుల్టా సీజన్ రెడీగానే:తెలుగులో ఆరు సీజన్లు పూర్తి అవడంతో బిగ్ బాస్ ఏడో సీజన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వస్తున్నట్లు చెప్పడంతో అవన్నీ రెట్టింపు అయ్యాడు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని సరికొత్త కంటెంట్‌తో నడుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లను హైలైట్ చేస్తున్నారు.

ఫస్ట్ 14, తర్వాత ఐదుగురు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఐదు వారాల తర్వాత మరో ఐదుగురు కూడా హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఇలా మొత్తం మీద 19 మంది కంటెస్టెంట్లు ఇందులోకి వచ్చారు. అయితే, ఇప్పటి వరకూ ఆరు వారాలు పూర్తి అవగా.. అన్నింట్లోనూ ఫీమేల్ కంటెస్టెంట్లే ఎలిమినేట్ అయ్యారు. దీంతో షో జరిగే తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మరొకరు రీఎంట్రీ అంటూ:ముందుగా వచ్చిన కంటెస్టెంట్లు కాకుండా.. మరో ఐదుగురిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎలిమినేట్ అయిన దామిని, రతికా రోజ్, శుభశ్రీ రాయగురులలో ఒకరితో రీఎంట్రీ ఇప్పించబోతున్నాడు. ఇప్పటికే వీళ్లు ముగ్గురూ శనివారం ఎపిసోడ్‌లో ఓట్లను అప్పీల్ చేసుకున్నారు. దీంతో హౌస్‌మేట్లు ఓట్లు కూడా వేశారు. దీనిపై బిగ్ బాస్ ప్రకటించాల్సి ఉంది.

ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ:ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం, త్వరలోనే మరో లేడీ కంటెస్టెంట్ రీఎంట్రీ ఇవ్వడం జరగబోతుండగా.. షోలో ఇంకొక స్పెషల్ ఎంట్రీ కూడా ఉండబోతుందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీనే అని అంటున్నారు. ఇందుకోసం భారీ ఫాలోయింగ్ ఉన్న సెలెబ్రిటీని తీసుకు రావాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్‌లోకి వంటలక్క:కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్క అలియాస్ దీపగా నటించి తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయిన మలయాళ నటి ప్రేమీ విశ్వనాథ్ బిగ్ బాస్ షోలోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నిర్వహకులు ఆమెతో ఒప్పందం కూడా చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో వంటలక్క రాక కోసం ఆమె అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

ఒక్క పోస్టుతో తేల్చింది:ప్రేమీ విశ్వనాథ్ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వస్తుందన్న వార్తలు వైరల్ అవుతోన్న నేపథ్యంలో ఆమె తాజాగా దీనిపై స్పందించింది. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ రాసిన ఈ కథనానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'ఇది ఫేక్ న్యూస్' అని తేల్చేసింది. ఫలితంగా బిగ్ బాస్ షోలోకి తాను రావడం లేదని క్లారిటీ ఇచ్చేసింది.


Click it and Unblock the Notifications











