For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Premi Viswanath సిగరెట్ కాల్చుతూ దొరికిన వంటలక్క: షర్ట్ బటన్స్ తీసేసి బోల్డుగా..షాక్‌లో కార్తీక దీపం ఫ్యాన్స్!

  |

  తెలుగులో సినిమా స్టార్లకే కాదు.. బుల్లితెరపై వచ్చే సీరియల్ నటీనటులకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఎంతో మంది నటీమణులు ఇలా ఫేమస్ అయ్యారు. ఈ మధ్య కాలంలో 'కార్తీక దీపం' హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతలా ఆమె పాపులారిటీని సంపాదించుకుంది. అద్భుతమైన నటనతో దాదాపు మూడేళ్లుగా అలరిస్తూనే ఉంది. ఈ కారణంగానే ఆమెకు ఫ్యాన్స్ పెరిగారు. అయితే, తాజాగా ప్రేమీ విశ్వనాథ్ స్మోకింగ్ ఫొటో బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  ఆండ్రియా జెరెమియా.. హాట్ నెస్ లో ఆల్ రౌండర్

   అలా చూసి.. ఇలా తీసుకుని వచ్చారు

  అలా చూసి.. ఇలా తీసుకుని వచ్చారు

  ‘కార్తీక దీపం' సీరియల్ తెలుగులో కంటే ముందే మలయాళంలో ‘కరుతముత్తు' అనే పేరుతో ప్రసారం అయింది. అక్కడ కూడా దీనికి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. అందులో కూడా ప్రేమీ విశ్వనాథే హీరోయిన్‌గా చేసింది. అది చూసే తెలుగులో కూడా ఆమెనే చేస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యారు. అందుకు అనుగుణంగానే ఆమెను ఒప్పించి ‘కార్తీక దీపం'లో నటింపజేస్తున్నారు.

  ఫిదా చేసేసిన దీప అలియాస్ వంటలక్క

  ఫిదా చేసేసిన దీప అలియాస్ వంటలక్క

  ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రారంభం అయిన ‘కార్తీక దీపం' సీరియల్‌కు తెలుగులో విశేషమైన స్పందన లభించింది. మరీ ముఖ్యంగా ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ దీప అలియాస్ వంటలక్క ప్రేక్షకులను ఫిదా చేసేసింది. దీంతో ఆమె ప్రతి ఇంటి ఆడపడుచుగా మారిపోయింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుని ఫుల్ ఫేమస్ అయిపోయిందామె.

  దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయిన పేరు

  దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయిన పేరు

  ‘కార్తీక దీపం' సీరియల్‌కు తెలుగులో భారీ స్థాయిలో రేటింగ్ వస్తోంది. అందుకే దాదాపు మూడేళ్లుగా ఇది టాప్ ప్లేస్‌లోనే వెలుగొందుతోంది. అందుకే బడా హీరోలు భారీ హిట్ చిత్రాలు కూడా ఈ రేంజ్ రేటింగ్‌ను అందుకోలేకపోతున్నాయి. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న టీఆర్పీ రికార్డులను ఇది బద్దలు కొట్టేసింది. ఫలితంగా ఇందులోని హీరోయిన్ క్యారెక్టర్ విపరీతంగా హైలైట్ అయింది.

   అక్కడ ఇక్కడా రికార్డులు.. పాపులారిటీ

  అక్కడ ఇక్కడా రికార్డులు.. పాపులారిటీ

  బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, ‘కార్తీక దీపం'కు దక్కిన ఆదరణ ఈ మధ్య కాలంలో మరో దానికి రాలేదు. అలాగే, హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్‌కు కూడా ఎనలేని ఫాలోయింగ్ సొంతం అయింది. అలాగే, మలయాళంలోనూ ఈ అమ్మడికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా రెండు చోట్లా దూసుకుపోతూ సత్తా చాటుతోందీ మల్లూ బ్యూటీ.

   అందులో ఫుల్ బిజీగా.. రచ్చ చేస్తుందిగా

  అందులో ఫుల్ బిజీగా.. రచ్చ చేస్తుందిగా

  సీరియల్స్ వల్ల ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది. అంతేకాదు, కెరీర్‌కు సంబంధించిన విశేషాలనూ షేర్ చేస్తోంది. దీనితో పాటు తన ఫొటోలు, వీడియోలు వదులుతూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది.

  స్మోకింగ్ చేస్తూ దొరికిన ప్రేమీ విశ్వనాథ్

  సోషల్ మీడియాలో చాలా రోజులుగా సందడి చేస్తోన్న తాజాగా ఓ ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది. దీనికి కారణం అందులో ఆమె స్మోకింగ్ చేస్తూ కనిపించడమే. అంతేకాదు, పక్కనే కోడిపుంజును కూడా అందులో చూపించారు. చేతిలో సిగరెట్ పట్టుకుని నోటి నుంచి పొగ వదులుతూ కనిపించింది. దీంతో ఈ ఫొటోపై ‘కార్తీక దీపం' సీరియల్ అభిమానులు షాకింగ్‌గా కామెంట్లు చేస్తున్నారు.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  షర్ట్ బటన్స్ తీసేసి బోల్డుగా.. రచ్చ చేస్తూ

  షర్ట్ బటన్స్ తీసేసి బోల్డుగా.. రచ్చ చేస్తూ

  ఈ ఫొటో మాత్రమే కాదు.. ‘అల.. వైకుంఠపురములో' సినిమాలోని ‘సిత్తరాల సిరపడు' అనే పాటను కూడా చేసింది ప్రేమీ విశ్వనాథ్. అందులో అల్లు అర్జున్ మాదిరిగానే షర్ట్ బటన్స్ తీసేసి.. స్మోకింగ్ చేస్తూ.. కోడిపుంజును పట్టుకుని రచ్చ చేసింది. మొత్తంగా ఇందులో బోల్డు అవతారంతో కనిపించింది. దీంతో ప్రేమీ విశ్వనాథ్ ఫొటో, వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

  English summary
  Karthika Deepam Is Top Serial in Telugu Television History. Now Heroine Premi Viswanath Share A Smoking Photo in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X