karthika deepam హిమ ఇంటికి ఈటెల రాజేందర్.. అసలు ఏమైందంటే?

తెలుగులో ఇప్పుడు టీవీ సీరియల్స్ కూడా జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే మంచి టిఆర్పి రేటింగ్స్ సాధిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో టాప్ టీవీ సీరియల్ ఏది అంటే ఎవరు తడుముకోకుండా చెప్పే సమాధానం కార్తీక దీపం. ఈ సీరియల్ అంతగా జనానికి చేరువైంది. ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరి పేరు దాదాపు అందరికీ నోటెడ్. ఈ సీరియల్ లో బాలనటిగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న కార్తీకదీపం హిమ ఇంటికి తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.

అందరూ ఫెమస్సే

అందరూ ఫెమస్సే

కార్తీకదీపం సీరియల్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు వంటలక్క, ఆ తరువాత డాక్టర్ బాబు. నిరుపమ్ పరిటాల ప్రేమి విశ్వనాథ్ జంటగా నటిస్తున్న ఈ సీరియల్ జనం అందరిని ఆకట్టుకుని మంచి టిఆర్పి రేటింగ్ సాధిస్తోంది.. ఈ సీరియల్ లో ప్రతి పాత్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మౌనిత, వంటలక్క, డాక్టర్ బాబు ఇలా అందరి పేర్లు తెలుగు ప్రేక్షకులకు నోట్ అయిపోయాయి.

సూపర్ క్రేజ్

సూపర్ క్రేజ్

ఈ సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పాలంటే తాజాగా రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ గురించి చెప్పాలి. ఈ కొత్త పోస్టర్ ను సైతం కార్తీక దీపం స్టైల్ లోకి మార్చి డాక్టర్ బాబు, బండి తోలుతుండగా ఒక పక్క వంటలక్క మరో పక్క మోనిత బండి ఎక్కినట్లు చూపిస్తూ మీమ్స్ క్రియేట్ చేశారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. ఈ సీరియల్ లో నటిస్తున్న దాదాపు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా అవి ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

 సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

ఈ సీరియల్ లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్టులు సహృద ఫ్రూటీ - హిమ, కృత్తిక - బేబీ సౌర్య, డాక్టర్ బాబు నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ వీరందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన కొన్ని ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.. తాజాగా కార్తీకదీపం హిమ అదేనండి సహృద షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 మా ఇంటికి వచ్చారు

మా ఇంటికి వచ్చారు

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ మా ఇంటికి వచ్చారు అని చెబుతూ ఆయనతో దిగిన ఫోటోను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈటల రాజేందర్ ఎందుకు తన ఇంటికి వచ్చారు అనే విషయాన్ని ఆమె వెల్లడించక పోయినప్పటికీ నెటిజన్లు ఆయన మీ ఇంటికి ఎందుకు వచ్చారు ? అసలు మీ ఇల్లు ఎక్కడ ? లాంటి అనేక ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

ప్రచారంలో ఈటెల

ప్రచారంలో ఈటెల

నిజానికి కొద్ది రోజుల క్రితం వరకు తెలంగాణ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ అనుకోని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం బిజెపిలో చేరిన ఆయన హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు బహుశా ఆ ప్రచారంలో భాగంగానే ఆ ప్రాంతానికి చెందిన సహృద ఇంటికి వెళ్లి ఉండవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X