Karthika Deepam ఆర్థిక కష్టాల్లో కార్తీక్ బాబు.. అలాంటి పనికి సిద్దమైన డాక్టర్ బాబు!

కార్తీకదీపం సీరియల్‌లో ఒకప్పుడు కోట్లకు పడగలెత్తిన కార్తీక్‌ చేతిలో చిల్లిగవ్వ లేకుండా బతకడం చాలా కష్టంగా మారింది. కన్న కూతుళ్లకు తిండి పెట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లాడు. జేబులో పైసలు లేకపోవడం, ఇంట్లో నిత్యావసర వస్తువులు లేకపోవడం కష్టాలు పడుతున్నాడు. ఒకవైపు రుద్రాణి అప్పు చెల్లిస్తానని.. దేవుడే వస్తున్నాడో.. దేవతే వచ్చి అప్పు తీరుస్తాడో వేచిచూడమని దీప సవాల్ విసిరింది. ఇలాంటి అంశాల మధ్య కార్తీకదీపం సీరియల్‌లోని ఎపిసోడ్ 1245 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

100 రూపాయలంటే లెక్కలేదా?

100 రూపాయలంటే లెక్కలేదా?

హిమ, శౌర్య కోసం టిఫిన్ తీసుకెళ్లగా అది కిందిపడి అన్నం నేలపాలు కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంటికెళ్లి చూస్తే సరుకులు నిండుకోవడంతో బొంబాయి హోటల్‌కు వెళ్లి ఫుల్ మీల్స్ పార్సిల్ ఫ్రీగా ఇవ్వమని అడిగితే.. ఓనర్ కోపగించుకొన్నారు. 100 రూపాయలు అంటే నీకు లెక్కలేదు. డబ్బు విలువ తెలుసా నీకు? అంటూ కార్తీక్‌ను హోటల్ ఓనర్ నిలదీశాడు. అయితే హోటల్‌లో పనిచేస్తాను.. ఇక మీల్స్ పార్సిల్ ఇవ్వండి అని కార్తీక్ అడిగితే.. సరే అని ఒప్పుకోవడంతో డాక్టర్ బాబు పార్సిల్ తీసుకొని స్కూల్‌కు వెళ్లాడు.

పిల్లలకు భోజనం తెచ్చి..

పిల్లలకు భోజనం తెచ్చి..

స్కూల్‌కు కార్తీక్ చేరుకొన్న సమయంలో హిమ, శౌర్య ఇద్దరు ఆకలి తాళలేక నీళ్లు తాగుతూ కనిపించారు. దాంతో కార్తీక్‌కు ఒక్కసారిగా పరిస్థితి అర్ధమైంది. వెంటనే వారిని పిలిచి భోజనం తినిపించాడు. అయితే పార్సిల్ ఎక్కడి నుంచి తెచ్చావు? నీ వద్ద డబ్బు లేదు కదా.. పార్సిల్ ఎక్కడిది అని పిల్లలు అడిగితే.. అమ్మ ఇంట్లో డబ్బు పెట్టింది. దాంతో కొని తీసుకొచ్చాను అని కార్తీక్ తిన్నాడు. పిల్లలు కూడా తండ్రికి చెరో ముద్ద తినిపించారు.

హోటల్‌లో వంటపనికి సిద్దమైన దీప

హోటల్‌లో వంటపనికి సిద్దమైన దీప

ఇక రుద్రాణి అడుగడుగనా అడ్డుపడటంతో దీప చేసిన పిండి వంటలు అమ్ముడుపోలేదు. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎదురుగా బొంబాయి హోటల్ కనిపించింది. అందులోకి వెళ్లి తన పిండి వంటల గురించి చెప్పింది. ఒక స్వీట్ తిన్న హోటల్ ఓనర్.. చాలా బాగున్నాయి.. మీరు బాగా వంట చేస్తారని అర్ధమైంది. మా హోటల్‌లో వంట చేయగలరా? అంటే సరే అంటూ దీప బదులిచ్చింది.

అయితే తాను ఇక్కడ పనిచేసే విషయాన్ని రుద్రాణికి తెలియనివ్వొద్దు అని దీప కోరింది. దాంతో రుద్రాణికి మీకు పడదా? అయితే నాకు రుద్రాణికి గొడవలు ఉన్నాయి. కానీ నేను ఆమెకు తల వంచలేదు అని హోటల్ ఓనర్ జవాబిచ్చాడు. మీరు ఎప్పుడు పనిచేయమంటే.. నేను పనిచేస్తాను అంటూ దీప చెప్పి అక్కడి నుంచి బయలు దేరింది.

రుద్రాణి పిచ్చి చేష్టలు

రుద్రాణి పిచ్చి చేష్టలు

కార్తీక్ పిల్లలు హిమ, శౌర్య ఇద్దరిని రుద్రాణి మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేసింది. అయితే రుద్రాణి రావడం, ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. వారితో మాట్లాడేందుకు రుద్రాణి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతలోనే దీప ఇంటికి చేరుకొన్నది. రుద్రాణిని చూసి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. నా పిల్లలను ఇంకోసారి కలిసే ప్రయత్నం చేయకు. నీ అప్పు ఎలాగైనా తీరుస్తాం అని గట్టిగా మందలించింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
కార్తీకదీపం రేటింగ్ ఇలా..

కార్తీకదీపం రేటింగ్ ఇలా..

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా రొటీన్‌గా సాగదీతగా కార్తీకదీపం సీరియల్ కొనసాగుతున్నది. అయినా ఈ సీరియల్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే విషయం తాజా రేటింగ్‌తో బయటపడింది. లేటేస్ట్ వీక్‌లో కార్తీక్ దీపం 14.25 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్‌తో నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X