Don't Miss!
- News
Budget 2023: ధరలు తగ్గే- పెరిగే వస్తువులు ఇవే: వారికి బిగ్ షాక్..!!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Lifestyle
షుగర్ పేషంట్స్ ఉదయాన్నే ఈ ఆహారాలను తినకూడదు.. తింటే షుగర్ లెవల్స్ పెరిగి, ప్రాణాలకే ప్రమాదం...
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Karthika Deepam డాక్టర్ బాబుకు పెళ్లి చేయండి.. సౌందర్యకు షాకిచ్చిన దీప
దీప ఆరోగ్య పరిస్థితిపై సౌందర్య ఆందోళన చెందుతూ తల్లడిల్లిపోయింది. వంటగదిలోకి వెళ్లిన దీపను చూసి నీవు పొగకు దూరంగా ఉండాలి. నీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించడంతో.. అత్తమ్మ నీ పరిస్థితి నీకు తెలిసిపోయిందా అని అడిగితే.. నాకు ఏమీ తెలియదు. నీ ఆరోగ్యం కోసం నేను చెప్పాను అని సౌందర్య అంటే.. ఇంకా నాటకాలు ఎందుకు ఆడుతావు. నీకు నాటకాలు ఆడటం రాదు. నీకు, కార్తీక్‌కు నాటకం ఆడాలని ప్రయత్నించినా మీ ముఖంలో ఆ భావాలను దాచలేరు అని దీప అంది. అయితే కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?
తన ఆరోగ్య పరిస్థితి తెలియడంతో నీకు ఎవరు చెప్పారని దీప అడిగింది. దాంతో నాకు మీ గురించి మోనిత అంతా చెప్పింది. మోనిత మీ జీవితాలతో ఆడుకొంటున్నది అని సౌందర్య చెప్పింది. అయితే తన మరణం తప్పదనే విషయం అత్తయ్యకు కూడా తెలియడంతో దీప.. ఇక అసలు విషయాలను, తన ప్రపోజల్‌ను ముందు పెట్టింది.
సౌందర్యతో దీప మాట్లాడుతూ.. నేను ఇంకా ఎంతో కాలం బతకలేను. కాబట్టి నా పిల్లలకు తల్లి అవసరం ఉంది. నా పిల్లలు అనాథలుగా ఉండవద్దు. మీకు మంచి కోడలు కావాలి. అందుకోసం మీరు కార్తీక్‌కు మంచి భార్యను తీసుకురండి. కార్తీక్ మరో పెళ్లి చేయండి. అప్పుడే నా ఆత్మ శాంతంగా ఉంటుంది అని దీప చెప్పింది. అయితే తన కోడలు మాటలు విన్న సౌందర్య కంటతడి పెట్టింది. నీకు ఏమీ కాదు. నిన్ను ఎలాగైనా బతికించుకొంటాం అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది.

కార్తీక్ ఫ్యామిలీ అంతా ఆలయానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే కుటుంబంతో వెళ్లకుండా హిమ తప్పించుకొని మోనిత వద్దకు వెళ్లాలని ప్లాన్ చేసింది. ఫోన్‌లో మాట్లాడితే.. మీ అమ్మ గురించి సీక్రెట్ చెప్పాలి. కానీ ఫోన్ కాదు. పర్సనల్‌గా కలిస్తే చెబుతాను అని చెప్పడంతో ఫ్యామిలీతో గుడికి వెళ్లోద్దని నిర్ణయం తీసుకొన్నది. స్కూల్ ఫ్రెండ్ వద్ద నోట్స్ తీసుకొంటానని చెప్పి మోనిత ఇంటికి వెళ్లింది.
తన ఇంటి వద్దకు వచ్చిన హిమను చూసి మోనిత ఆనందపడిపోయింది. కార్తీక్ ఇంటిలో ఒకరి వాడుకోవాలి. ఆ ఇంటిలో ఒకరు నాకు కావాలి అనుకొనే సమయంలో హిమ నా చేతికి చిక్కడం అంతా మంచే జరుగుతున్నదని మనసులో అనుకొన్నది. మోనిత వద్దకు హిమ వచ్చి మా అమ్మ గురించి సీక్రెట్ చెప్పమని అడిగితే.. నీవు చిన్నపిల్లవు. నీకు చెప్పకూడదు అని అంటే.. నేను చిన్న పిల్లలను కాదు. అమ్మా, నాన్న కనిపించకపోతే.. నేను వెతికాను. ఇప్పుడు ఆటోలో నేను ఒక్కదానినే వచ్చాను. ఇంకా నేను చిన్న పిల్లదానిని కాదు అని హిమ వాదనకు దిగింది. దాంతో మీ అమ్మ ఎన్నో రోజులు బతకదని, గుండె జబ్బుతో మరణించడం ఖాయం అంటే.. హిమ షాక్ తిన్నది. మోనిత చెప్పిన విషయాన్ని నమ్మలేకపోయింది.
అయితే మీ అమ్మను బతికించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. నా గుండెను మీ అమ్మకు మార్చి బతికిస్తాను అని మోనిత అంటే.. ఇప్పటి వరకు నీ గురించి ఏదో అనుకొన్నాం. కానీ నీలో ఇంత మంచి మనసు ఉందా? మా అమ్మ గురించి ఇంతగా ఆలోచిస్తామని అనుకోలేదు అని హిమ అంది. ఆ తర్వాత భారమైన హృదయంతో ఇంటికి బయలుదేరింది. దీప విషయం హిమకు చెప్పి ఆనందంలో మునిగిపోయింది. నేను మంచిదానినా అంటూ క్రూరంగా నవ్వింది.