Karthika Deepam నేను మనిషినేనా? ఎందుకు పనికిరాని వాడిని.. కార్తీక్ ఎమోషనల్
తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్‌తో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్‌లో రకరకాల ఎమోషన్స్‌తో ముందుకెళ్తున్నది. కార్తీక్, సౌందర్య, దీప మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఒక పక్క.. మరోవైపు మోనిత, రుద్రాణి పాత్రల కుట్రలు మరో పక్క భావోద్వేగంతో సాగుతున్నాయి. జనవరి 3న ప్రసారమైన తాజా ఎపిసోడ్ 1239లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయంటే..
Recommended Video

రుద్రాణి అప్పుపై కార్తీక్, దీప చర్చ
పిండి వంటలు చేస్తున్న తల్లి వద్దకు వెళ్లి తమకు వంటలు నేర్పించమని హిమ, శౌర్య అడిగితే.. ఈ వంటలు నాతోనే ముగిసిపోవాలి. పెద్దయ్యాక మీకు కొన్ని వంటలు నేర్పిస్తాను కానీ ఇప్పుడు వద్దు. వంటలక్క అనే పదం నాతోనే ముగిసిపోవాలి అని దీప చెప్పింది. అంతలోనే తండ్రి కార్తీక్ వచ్చి.. తల్లిదండ్రులు కోటేశ్, శ్రీవల్లి మరణించడంతో ఈ పిల్లాడిని మనం పెంచుకొందాం. అంతేకాకుండా కోటేశ్ బాకీ తీర్చకపోతే ఇద్దరు కూతుళ్లలో ఒకరిని తీసుకెళ్తాను అనే విషయాలు గుర్తొచ్చాయి. దాంతో ఈ ఊరు నుంచి ఎక్కడికైనా వెళ్లిపోదాం అని కార్తీక్‌తో హిమ, శౌర్య అన్నారు. అయితే టెన్షన్‌లో ఉన్న కార్తీక్‌ను చూస్తూ.. ఇంటిని అమ్మేసి రుద్రాణి అప్పు త్వరలోనే తీర్చేద్దాం అని దీప సలహా ఇచ్చింది. అయితే ఇంటిని అమ్మేస్తే ఆనంద్‌కు అన్యాయం చేసిన వారిమి అవుతాం అని కార్తీక్ చెప్పడంతో అవును.. నేను కూడా అది ఆలోచించలేదు అంటూ దీప ఆలోచనల్లో పడింది.

నేను ఎందుకు పనికిరాని వాడిని అయ్యా
పిండి వంటలు చేసిన దీప.. వాటిని మార్కెట్‌లో అమ్మి వస్తానని చెబితే.. కార్తీక్ ఎమోషనల్ అయ్యాడు. జీవితంలో ఎందుకు పనికిరాని జీరోను నేను. డాక్టర్‌గా విఫలమయ్యాను. ఓ పేషెంట్ ప్రాణాలను కాపాడాలేకపోయాను. ఇద్దరు కూతుళ్లకు సరైన జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాను. కళ్లముందు రుద్రాణి చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించలేకపోతున్నా. నేను ప్రాణాలు తీసుకొనే పరిస్థితి ఉందని గమనించి.. నీవు నాకు ధైర్యాన్ని నూరిపోస్తున్నావు. డాక్టర్ ఉండి వైద్యం చేయలేకపోతున్నాను. నేను ఒక మనిషినేనా? సాటి మనుషులకు న్యాయం చేయలేకపోతున్నాను. పిల్లలకు పట్టెడు అన్నం పెట్టలేకపోతున్నా. ఏ బాధ్యత తీసుకొకుండా కళ్లు అప్పగించి చూస్తున్నాను అంటూ కార్తీక్ ఎమోషనల్ అయ్యాడు. అయితే మీకు ఇష్టమైన పని.. మీరు చేయదగిన పనిని చేయండి.. అప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు అని దీప సలహా ఇచ్చింది.

డబ్బులోనే ఆనందం ఉండదు..
కార్తీక్, దీప, శౌర్య, హిమ ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోవడంతో మరోసారి సౌందర్య ఎమోషనల్ అయ్యారు. చేయని తప్పుకు ఇద్దరు పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారు. వారు ఏం తప్పు చేశారు అని ఆనందరావుతో సౌందర్య అనడంతో.. డబ్బు, సంపదలో ఆనందం ఉండదు. కలిసి ఉండటంలోనే సంతోషం ఉంటుంది. ఎక్కడ ఉన్న మనస్పూర్తిగా వాళ్లంత ఆనందంగా ఉండి ఉంటారు అని ఆనందరావు చెప్పడంతో సౌందర్య ఊరట చెందింది. హిమ, శౌర్య రాసుకొన్న పుస్తకాలను చూసి భావోద్వేగానికి గురైంది.

న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ మోనిత
ఇంటిలో కనిపించిన మోనిత, కార్తీక్ పూజ ఫోటోను సౌందర్య విసిరికొట్టింది. అయితే సౌందర్య విసిరిన ఫోటోను అందుకొని మోనిత షాక్ ఇచ్చింది. నువ్వా అంటే.. నీవు విసిరి వేస్తే.. నేను క్యాచ్ పట్టుకొన్నాను. ఇది న్యూ ఇయర్ గిఫ్ట్ అని అనుకొంటాను అని మోనిత చెప్పింది. కార్తీక్‌తో పూజ చేస్తున్న ఫోటోను నేనే తీసుకెళ్దామని అనుకొన్నాను. మీరు పడేద్దామని అనుకొన్నాను. నేను తీసుకెళ్దామని అనుకొన్నాను. కానీ మీరే నా మనసు తెలుసుకొని ఇచ్చారు. మీలో మంచితనం టన్నుల కొద్ది ఉంది.

హారతి ఇచ్చి మీరే స్వాగతం
సౌందర్య మాటలకు మోనిత కౌంటర్ ఇస్తూ.. మీరు మీ ఫ్యామిలికి నన్ను దూరం చేద్దామని అనుకొన్నారు. నేను మీకు దగ్గర కావాలని అనుకొంటున్నాను అని మోనిత అంటే.. అప్పుడే మిడిసిపడకు మోనిత అంటే.. నేను మళ్లీ వస్తాను.. నా బిడ్డ, కార్తీక్‌తో ఈ ఇంటిలో అడుగుపెడుతాను. మీరే హారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు అని మోనిత చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

రుద్రాణి మరో కుట్రకు రెడీ
కోటేష్, శ్రీవల్లి మరణించడంతో ఆనంద్‌ను పట్టుకొని కార్తీక్ ఎమోషనల్ అయ్యాడు. ఏ తల్లి కన్న బిడ్డవో. కానీ కోటేష్, శ్రీవళ్లి వద్దకు వచ్చావు. ఇప్పుడు మా వద్దకు చేరావు అని కార్తీక్ తల్లడిల్లి పోయాడు. కార్తీక్ ఇలా బాధపడుతుండగా.. కార్తీక్ ఇంటికి రుద్రాణి వచ్చింది. పిండి వంటలు చేసి నా అప్పు తీర్చాలని అనుకొంటున్నారా? అయితే నీ భర్తతోనే నీ వంటలు ఆపిస్తాను అంటూ రుద్రాణి మరో కుట్రకు సిద్దమైంది. కార్తీక్ ఇంటికి వచ్చి రుద్రాణి షాక్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











