Karthika Deepam దీప, నీ పిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారా? కార్తీక్‌కు రుద్రాణి వార్నింగ్

కార్తీకదీపం గత కొద్దికాలంగా రొటీన్‌గా సాగదీసినట్టు ముందుకెళ్తున్నది. ఎలాంటి ట్విస్టులు, ఫీల్ గుడ్ కంటెంట్‌ లేకుండా సాధారణంగా సాగడం కనిపిస్తున్నది. కార్తీక్, దీప ఆర్థిక కష్టాలు, రుద్రాణి దౌర్జన్యం, మోనిత పిచ్చితనం లాంటి అంశాలు కనిపిస్తున్నాయి. కొడుకు కోసం సౌందర్య వెతుకులాట మొదలైంది. జనవరి 4వ తేదీన ప్రసారమైన 1240 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

కార్తీక్‌ను అవమానించిన రుద్రాణి

కార్తీక్‌ను అవమానించిన రుద్రాణి

రుద్రాణి అప్పు తీర్చడానికి దీప పిండి వంటలు చేసి అమ్మడం ప్రారంభించింది. అయితే ఈ విషయం తెలుసుకొన్న రుద్రాణి దీప ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు సిద్దమైంది. వంటలు చేసి నా అప్పు తీర్చుతుందా? దీప భర్తతోనే పిండి వంటల అమ్మకాలను నిలిపివేస్తా. మగాడి అహం మీద దెబ్బ కొడితే అన్ని పనులకు బ్రేక్ అంటూ కార్తీక్ ఇంటిలోకి రుద్రాణి ప్రవేశించింది. పిల్లాడికి పాలుపడుతున్న కార్తీక్‌తో మాట్లాడుతూ.. ఏంటి సార్. రంగరాజుకు పాలు కలుపుతున్నావా? అరెరె.. ఇంతకు ముందు ఏం చేసేవాడివో.. నాకు తెలియదు. ఇంట్లో ఆడ మనిషి బయటకు వెళ్లి పిండి వంటలు అమ్ముతుందా? నీవేమో ఇలాంటి పనులు చేస్తున్నావా? మొగుడు పెళ్లాం అయింది.. పెళ్లాం మొగుడు అయ్యాడు. ఛీ ఛీ ఏంటి సార్ అంటూ రుద్రాణి ఎద్దేవా చేసింది.

కార్తీక్‌కు రుద్రాణి వార్నింగ్

కార్తీక్‌కు రుద్రాణి వార్నింగ్

అయితే రుద్రాణి తనను కించపరిచే విధంగా మాట్లాడటంతో కార్తీక్ కోపంతో ఊగిపోయాడు. మర్యాదగా మాట్లాడు అని కార్తీక్ వార్నింగ్ ఇస్తే.. నీవు ఇంట్లో ఇలాంటి పనులు చేస్తే.. రేపటి నుంచి నీకు ఎవరు మర్యాద ఇవ్వరు. ఏంటి సార్.. కోపం వస్తుందా? పని పాట చేతవాళ్లకు కోపం ఎక్కువ అని రుద్రాణి అవమానించేలా మాట్లాడింది. అయితే మర్యాదగా మాటలు ఆపి బయటకు వెళ్లు అంటూ కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో వెళ్తాను బాబు.. కానీ నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రంగరాజును నాకు ఇవ్వండి. నాకు పిల్లలు లేరు. అసలు నేను మంచి దానిని కూడా కాదు అని రుద్రాణి అంటే.. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అంటూ కార్తీక్ ప్రశ్నించాడు.

నీ భార్య, పిల్లలు జాగ్రత్త అంటూ

నీ భార్య, పిల్లలు జాగ్రత్త అంటూ

నాతో పెట్టుకొంటే మంచిగా ఉండదు. బయటకు వెళ్లిన నీ భార్య దీప క్షేమంగా ఇంటికి రావాలి కదా? అని రుద్రాణి హెచ్చరించింది. ఏంటి? దీప ఎందుకు క్షేమంగా ఇంటికి రాదు అని కార్తీక్ అంటే.. దీపనే కాదు.. స్కూల్‌కు వెళ్లిన పిల్లలు కూడా క్షేమంగా రావాలి.. రోజులు మంచిగా లేవు. శ్రీవల్లి, కోటేష్ ఉత్త పుణ్యానికే చనిపోయారు అంటూ వారి ఫోటోపై పూలు వేసి.. కోరి కష్టాలు తెచ్చుకోకు.. దీప, పిల్లలు జాగ్రత్త అంటూ వెళ్లిపోయింది.

కామన్ సెన్స్ ఉందా అని కార్తీక్

కామన్ సెన్స్ ఉందా అని కార్తీక్

రుద్రాణి నేరుగా శౌర్య, హిమ స్కూల్‌కు భోజనం పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే ఇద్దరు కూడా భోజనం చేయానికి నిరాకరించారు. అయితే వారిని బుజ్జగించి తినిపించేందుకు ప్రయత్నించింది. దాంతో రుద్రాణి చేతిని శౌర్య విసిరికొట్టింది. దాంతో రుద్రాణికి పెట్టడం మాత్రమే కాదు.. చాలా తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతలోనే కార్తీక్ అక్కడికి చేరుకొని.. గట్టిగా మందలించాడు. తండ్రిని చూసి శౌర్య, హిమ పరుగెత్తుకెళ్లి.. బలవంతంగా అన్నం తినమని బెదిరిస్తుంది అని చెప్పారు. దాంతో పిల్లల్ని బెదిరిస్తారా? వాళ్లు ఎలా భయపడుతున్నారో చూడు. మీకు కనీసం కామన్ సెన్స్ లేదా అంటూ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత మా పిల్లలకు మీరు భోజనం పెట్టడం ఏమిటని కార్తీక్ కడిగిపడేశాడు. అయితే దీపమ్మ ఇంటికి క్షేమంగా వస్తుందా? వెతుక్కో అంటూ రుద్రాణి వార్నింగ్ ఇచ్చింది.

నా కార్తీక్ వస్తాడు అంటూ

నా కార్తీక్ వస్తాడు అంటూ

కార్తీక్‌తో పూజ చేస్తూ దిగిన ఫోటోను చూసి మోనిత మురిసిపోయింది. తప్పిపోయిన కొడుకు ఆనందరావును గుర్తు చేసుకొని త్వరలోనే కార్తీక్ ఇంటికి వస్తాడు అంటూ బొమ్మతో మాట్లాడుతూ కనిపించింది. అంతలోనే పనిమనిషి నర్సమ్మ రాగానే.. ఫోటో బాగుంది కదా అంటూ అడిగింది. ఫోటోలో అందంగా ఉన్నాను. నాకంటే కార్తీక్ మరింత అందంగా ఉన్నాడు. మా జంట బాగుంది కదా అంటే.. మౌనంగా నర్సమ్మ చూస్తూ కనిపించింది. అయితే సార్ ఎక్కడికి పోయాడు అంటే.. ముంబైకి కాన్ఫరెన్స్‌కు వెళ్లాడని మోనిత చెబితే.. నాకు అంతా తెలుసు అమ్మా.. అని నర్సమ్మ సమాధానం ఇచ్చింది. దాంతో త్వరలోనే నా కార్తీక్ వస్తాడు అని మోనిత చెప్పింది. అయితే వస్తాడని నమ్మకం ఉందా? లేక జీవితాంతం ఫోటోను చూస్తూ బతికేస్తావా అంటూ నర్సమ్మ కౌంటర్ ఇచ్చింది. దాంతో నర్సమ్మకు వార్నింగ్ ఇచ్చింది.

కార్తీక్ కోసం వెతుకలాట

కార్తీక్ కోసం వెతుకలాట

కార్తీక్ ఆచూకీ తెలుసుకోమని సౌందర్య, ఆనందరావు చెప్పడంతో పిచ్చివాడు తాడికొండకు చేరుకొన్నారు. ఆ ఊరిలో కనిపించిన ప్రతీవ్యక్తికి కార్తీక్ ఫోటో చూపించి ఇతను తెలుసా? అంటూ అడగడం ప్రారంభించారు. ఏకంగా రుద్రాణి మనుషులను అడిగితే.. మాకు పని ఉందంటూ వెళ్లిపోయారు. అలా కార్తీక్‌ను వెతుకుతూ పిచ్చివాడు కనిపించాడు. ఓ దశలో కార్తీక్ పక్కనే ఉన్న పిచ్చివాడు చూడకుండా పక్కకు వెళ్లడం సీరియల్‌లో ఆసక్తికరంగా కనిపించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X