twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నా మీద ఒట్టేసి చెప్పండి.. నిజం చెప్పండి.. కార్తీక్‌ను నిలదీసిన దీప

    |

    కార్తీకదీపం సీరియల్‌లో దీప, కార్తీక్ మధ్య భావోద్వేగ క్షణాలు కనిపిస్తున్నాయి. శ్రీవల్లి, కోటేష్ చేసిన అప్పు తీర్చుతామని లేకపోతే తన కూతుళ్లలో ఒకరిని రుద్రాణికి ఇచ్చేందుకు రెడీ అంటూ అగ్రిమెంట్‌పై సంతకం చేయడం ఇప్పుడు వారిని ఇబ్బందుల్లో పడేసింది. తన కూతురును తీసుకెళ్తానని రుద్రాణి వార్నింగ్ ఇవ్వడం దీప, కార్తీక్‌ను టెన్షన్ పెడుతున్నది. రుద్రాణి మా వద్దకు వచ్చి భోజనం పెట్టడం, చాక్లెట్లు ఎందుకు ఇస్తున్నది అంటూ హిమ, శౌర్య ప్రశ్నించారు. ఈ క్రమంలో జనవరి 6వ తేదీన ప్రసారమైన 1242 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

    రుద్రాణి దౌర్జన్యం గురించి

    రుద్రాణి దౌర్జన్యం గురించి

    రుద్రాణి విషయం గురించి శౌర్య, హిమ మాట్లాడుతూ.. మీతో గొడవపడుతూ మాతో హ్యాపీగా ఎందుకు మాట్లాడుతున్నది అని అంటే.. మీరు చిన్న పిల్లలు ఇవన్నీ మీకు వద్దు. మనుషులు అన్నప్పుడు రకరకాలుగా ఉంటారు. వాటికి గురించి పట్టించుకోవద్దు. ఆలోచించవద్దు అంటూ దీప చెప్పింది.

    అయితే కార్తీక్ కొద్ది రోజులుగా విచారంలో మునిగిపోయి కనిపించడంతో.. దీప ఆ విషయాన్ని రాబట్టేందుకు ప్రయత్నించింది. మీరు ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? మీ చేతిలో ఉన్న వైద్యం పసివాడిని బాగుచేసింది. మీలో గొప్పతనం మీకు తెలియడం లేదు. రుద్రాణి అప్పు గురించి బాధపడుతున్నారా? అని అడిగితే.. అప్పు కింద మన పిల్లల్లో ఒకరిని తీసుకెళ్తుందని నీకు ఎలా చెప్పగలను అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు.

    మీ చెవిలో గుసగుసలు ఏమిటి?

    మీ చెవిలో గుసగుసలు ఏమిటి?

    రుద్రాణికి మన పిల్లల మీద సడెన్‌గా ఎందుకు ప్రేమ కలుగుతున్నది? అప్పుడు ఓ సారి వచ్చినప్పుడు మీతో గుసగుసలాడింది. మీ చెవిలో ఏం చెప్పింది? మీ ఆస్తి మొత్తం ఇచ్చేశారు? రుద్రాణి అప్పు కోసం ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? మీరు నాతో ఏదో దాస్తున్నారు. ఎందుకు కుమిలిపోతున్నారు. నిజం చెప్పండి అంటూ కార్తీక్ చేతిని తన తలపై పెట్టుకొన్నది. నా మీద ఒట్టేసి చెప్పండి.. ఏం దాస్తున్నారు? మీరు ఎందుకు నలిగిపోతున్నారు? మీరు చెప్పకపోతే చచ్చినంత ఒట్టే అంటూ దీప భావోద్వేగానికి గురైంది.

    అసలు విషయం చెప్పిన కార్తీక్

    అసలు విషయం చెప్పిన కార్తీక్

    అయితే దీప ఒట్టు వేయించుకోవడంతో కార్తీక్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. అప్పు కట్టకపోతే పిల్లల్లో ఒకరిని తీసుకెళ్తానని అంటున్నది. గడువు లోగా అప్పు చెల్లించకలేకపోతే హిమ, శౌర్యలో ఒకరిని తీసుకెళ్లిపోతానని అంటున్నది అని కార్తీక్ చెప్పగానే.. దీప షాక్ తిన్నంది. నా బతుకు ఇలా అయిపోయింది. నా పిల్లలను అప్పు కింద మరొకరికి ఇవ్వాలా? మీరు ఏం చేస్తున్నారు అంటూ దీప నిలదీసింది. దాంతో నేను సంతకం పెట్టాను. కానీ అందులో ఏ రాసిందో చూసుకోలేదు అని కార్తీక్ అన్నాడు. దాంతో తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుడా ఏమిటి నాకీ పరీక్ష. నీకు నా మీద ఇంకా కోపం పోలేదా?

    ఏ స్థితికి తీసుకొచ్చారు డాక్టర్ బాబు

    ఏ స్థితికి తీసుకొచ్చారు డాక్టర్ బాబు

    కార్తీక్‌తో దీప ఆవేదన వ్యక్తం చేస్తూ.. కడుపున పుట్టిన పసిదాని కోసం కళ్లు కాయలు కాసేలా చూశాను. గుండెలు అవిసేలా ఏడ్చాను. నా కూతురు హిమ ఎక్కడ ఉందో అని వెతికాను. ఇప్పుడు నా బిడ్డను రుద్రాణికి ఎలా అప్పగించాలి? అంటూ దీప కంటతడి పెట్టింది. మీరు ఆస్తులు వదిలేసినా ఏనాడు ప్రశ్నించలేదు. అందరం కలిసి ఉంటే చాలని అనుకొన్నాను. మీరు నన్ను ఏ స్థితికి తీసుకొచ్చారు అంటూ దీప ఆవేదన వ్యక్తం చేసింది. భగవంతుడా ఎందుకు ఇంత కక్ష? ఎంత పని చేశారు డాక్టర్ బాబు అంటూ భోరున ఏడ్చింది.

    రుద్రాణికి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్

    రుద్రాణికి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్

    దీప నిలదీయడంతో కార్తీక్ నేరుగా రుద్రాణి ఇంటికి వెళ్లాడు. కార్తీక్‌ను చూడగానే రా సారు.. ఈ సమయంలో వచ్చారేంటి? అంటే.. కోపంతో ఊగిపోతూ.. మీరు చేస్తున్న పని కరెక్ట్ కాదు అని అన్నాడు. దాంతో అవునా? పెత్తనం చేయడం తప్పా అని రుద్రాణి సమాధానం ఇచ్చింది. పెత్తనం చేస్తావో.. మరేం చేస్తావో.. మాకు అనవసరం. నా పిల్లల జోలికి.. కుటుంబం జోలికి రావొద్దు. మీ బాకీ తీర్చుతానని సంతకం పెట్టాను.

    బాకీ తీరుస్తాను. అంతటితో మీకు మాకు లావాదేవీలు ఉండవు. అనసరంగా మా కుటుంబంలో జోక్యం చేసుకొంటున్నారు. మా పిల్లలకు క్యారేజ్ పంపడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. మీ సంపాదన చూస్తే.. నా అప్పు తీర్చడం కష్టం. అందుకే మీ పిల్లలో ఒకరిని తీసుకెళ్లడం ఖాయం. అందుకే నేను పిలల్ని మచ్చిక చేసుకొంటున్నాను అని రుద్రాణి అన్నారు. అయితే నీ బాకీ తీరుస్తాను. పిల్లలపై కన్నేస్తే ఊరుకోను జాగ్రత్త అంటూ కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు.

    తాకట్టుపెట్టావా అని పిల్లలు అంటే..

    తాకట్టుపెట్టావా అని పిల్లలు అంటే..

    రుద్రాణికి వార్నింగ్ ఇచ్చి ఇంటికి చేరుకొన్న కార్తీక్‌ను దీప ఓదార్చింది. అప్పు తీర్చకపోతే నా పిల్లల్ని ఇచ్చేస్తానని సంతకం చేసిన గొప్ప తండ్రిని కదా అని అంటే.. మీరు ఆ పని తెలిసి చేయగలరా? అంటే.. రేపు ఈ విషయం నా పిల్లలకు తెలిస్తే.. నాన్న మమ్మల్ని తాకట్టుపెట్టావా అని అడిగితే.. నా వద్ద సమాధానం లేదు. ఏం సమాధానం చెప్పాలి అని కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు. మీరు తెలిసి తప్పు చేయలేదు.. అప్పు ఎలాగోలా తీర్చేద్దాం అని దీప ఊరట కలిగించే మాటలు చెప్పింది.

    ఎన్ని తప్పులు చేసినా నా డాక్టర్ బాబువే..

    ఎన్ని తప్పులు చేసినా నా డాక్టర్ బాబువే..

    దీప మాటలకు సమాధానం ఇస్తూ.. నేను ఎన్ని తప్పులు చేసినా ఎందుకు అరవవు.. కోపం తెచ్చుకోవు. నీ మంచితనం, ఓపిక నన్ను కుంచించుకోపోయేలా చేస్తున్నది. 11 ఏళ్లు నన్ను గోమాతలా భరించావు. ఒక రోజు అంతా నన్ను బాగా తిట్టు. అని కార్తీక్ అంటే.. నీవు తెలిసి తప్పు చేయవు అని నాకు తెలుసు. మీరు ఏం చేసినా నాకు డాక్టర్ బాబువే అంటూ దీప ఎమోషనల్ అయింది. బాధలో ఉన్న కార్తీక్‌ కౌగిలిలో చేరింది. ఇద్దరు అలా ఒకరినొకరు కౌగిలించుకొని సేద తీరారు.

    2022లో కార్తీకదీపం టాప్ రేటింగ్ ఇలా..

    2022లో కార్తీకదీపం టాప్ రేటింగ్ ఇలా..

    ఇక కార్తీకదీపం సీరియల్‌లో తెలుగు బుల్లితెరపై జోరుగా కొనసాగుతున్నది. గత మూడేళ్లుగా ఈ సీరియల్ టాప్ రేటింగ్‌ను నమోదు చేసుకొంటున్నది. టెలివిజన్ రంగంలో అత్యంత భారీ రేటింగ్‌ను నిలకడగా సాధిస్తూ ముందుకెళ్లున్నది. 2022 మొదటి వారంలో ఈ సీరియల్ 14.25 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది.

    English summary
    Karthika Deepam January 6th Episode number 1242
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X