Karthika Deepam weekly roundup నిరుపమ్‌‌తో పెళ్లికి ముందు హిమ మరో లవ్ ట్రాక్? కార్తీకదీపంలో మరో ట్విస్టు!

కార్తీకదీపం సీరియల్ గత మూడు సంవత్సరాలుగా సుదీర్ఘంగా సాగుతున్నది. ఈ సీరియల్‌లో రెండో జనరేషన్ మధ్య బంధాలు, అనుబంధాలు ఆసక్తికరంగా మారాయి. ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టుతో సీరియల్ జోష్‌తో ముందుకెళ్తున్నది. గతవారం రోజులుగా అంటే జూలై 25 నుంచి జూలై 30 తేదీ వరకు ఈ సీరియల్ ఎలాంటి మలుపులు తిరిగిందనే విషయంలోకి వెళితే..

జూలై 25వ తేదీ ఎపిసోడ్‌లో

జూలై 25వ తేదీ ఎపిసోడ్‌లో

తన పెళ్లి విషయంలో అడ్డుగా వస్తున్న శౌర్యను నిరుపమ్ నిలదీశాడు. హిమ అంటే నాకు ప్రేమ. మా అమ్మకు ఇష్టం లేదు. మా అమ్మను ఒప్పించి మా పెళ్లి చేసే బాధ్యత నీదే అని నిరుపమ్ అన్నాడు. దాంతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని హిమ షాకిచ్చింది. దాంతో హిమ ఏం మాట్లాడుతున్నావు తెలుసా అని నిరుపమ్ అంటే.. నిజం మాట్లాడుతున్నాను.

నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. కానీ నీవే వినిపించుకోవడం లేదు అని నిరుపమ్‌తో ‌తో హిమ అంది. దాంతో అక్కడి నుంచి శౌర్య వెళ్లిపోయి .. పసుపుతాడు తీసుకొచ్చింది. ఈ పసుపు తాడును హిమ మెడలో కట్టు. చూస్తారేంటి డాక్టర్ సాబ్. దీనిని తీసుకొని హిమ మెడలో కట్టండి అంటూ శౌర్య చెప్పింది.

జూలై 26వ తేదీ ఎపిసోడ్‌లో

జూలై 26వ తేదీ ఎపిసోడ్‌లో

నిరుపమ్‌ ప్రేమకు దూరమైన శౌర్య.. హిమను డైరెక్టుగా నిలదీసింది. నన్ను ఎందుకే పగబట్టావు? చిన్నప్పటి నుంచి నా మీద నీకు ఎందుకే ఇంత ద్వేషం. నీవేమో నానమ్మ, తాత వద్ద హాయిగా పెరిగావు. నేను, అమ్మ ఎన్ని కష్టాలు పడ్డామో. నాన్నను కలిశామని సంతోషపడే లోగా దూరం చేశావు. నీ ముఖం చూడవద్దని వెళ్లిపోయాను.

అప్పటి నుంచి కష్టాల్లో పెరిగాను. డాక్టర్ సాబ్ ఎవరో తెలియనప్పటి నుంచి ఇష్టపడ్డాను. డాక్టర్ సాబ్ చూడగానే నాకు ఎదో తెలియని ఆనందం అని శౌర్య నిలదీసింది. అయితే మీ ఇద్దరి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నా అని హిమ జవాబు ఇచ్చింది. ఇంకా నాటకాలు ఆడకు. నా పెళ్లి నీ బాధ్యత అన్నావు. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి సెట్ చేసుకొన్నావు. ఇంతకంటే మోసం ఏదైనా ఉంటుందా అని శౌర్య ఫైర్ అయింది.

జూలై 27వ తేదీ ఎపిసోడ్‌లో

జూలై 27వ తేదీ ఎపిసోడ్‌లో

డాక్టర్ శోభ తన ఇంటికి రావడం ఇష్టం లేని నిరుపమ్.. తన ఇంటి నుంచి తాత, నానమ్మ ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడ తనకు దూరంగా ఉంటున్న హిమను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించాడు. తనకు జీన్స్, టీషర్ట్ గిఫ్టుగా ఇచ్చి వాటిని వేసుకోమని నిరుపమ్ చెప్పాడు. అయితే తనకు అలాంటి డ్రస్‌లు నచ్చవు బావా అంటూ నిరాకరించింది. దాంతో నీవంటే నాకు ప్రేమ అని నిరుపమ్ అన్నాడు.

క్లినిక్‌లో డాక్టర్‌ను మాత్రమే. ఇంటికి వస్తే లవర్‌ను అని చెప్పాడు. ఇలాంటి ఇడియట్ ఆలోచనలు ఎలా వస్తున్నాయి అంటే థ్యాంక్స్ అన్నాడు. నీవు ఒప్పుకోకపోతే.. శౌర్య వద్దకు వెళ్లి.. ఈ డ్రస్సును వేసుకోమని శౌర్యకు చెబుతా అని నిరుపమ్ బెదిరించాడు.

జూలై 28వ తేదీ ఎపిసోడ్‌లో

జూలై 28వ తేదీ ఎపిసోడ్‌లో

తన తాత, నానమ్మను తిట్టిన అత్త స్వప్నకు శౌర్య గట్టిగా క్లాస్ పీకింది. ఇంకోసారి తాత, నానమ్మను ఏమైనా అంటే బయట నెట్టేసే దానిని అని అనగానే.. దూరంగా ఉండి గమనిస్తున్న సౌందర్య, ఆనందరావు చప్పట్లు కొట్టారు. దాంతో తల్లి పరిస్థితిని గమనించిన నిరుపమ్.. అమ్మా.. నీవు ఇంటికి వెళ్లిపో అంటూ పంపించే ప్రయత్నం చేశారు.

జూలై 29వ తేదీ ఎపిసోడ్‌లో

జూలై 29వ తేదీ ఎపిసోడ్‌లో

హిమపై పీకల్లోతు కోపంతో ఉన్న శౌర్య మనసు మార్చేందుకు తాత ఆనందరావు ప్రయత్నించాడు. మన ఎదుట మంచిగా కనిపించే వ్యక్తులు మంచి వాళ్లు కాదు.. అలాగే చెడు వ్యక్తులు కూడా చెడ్డవాళ్లు కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. జాగింగ్‌కు తీసుకెళ్లిన శౌర్యకు కొన్ని విషయాలను బోధించే ప్రయత్నం చేశాడు.

జూలై 30వ తేదీ ఎపిసోడ్‌లో..

జూలై 30వ తేదీ ఎపిసోడ్‌లో..

కార్తీకదీపం సీరియల్‌లో నిరుపమ్ ప్రేమ కోసం శౌర్య, హిమ మధ్య ఓ రకమైన సంఘర్షణ జరుగుతున్నది. నిరుపమ్‌కు సన్నిహితంగా ఉంటున్న హిమను చూసిన శౌర్య ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే మళ్లీ ఇంటి నుంచి బయటకు వెళ్లిన శౌర్య ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X